పామర్రు, న్యూస్‌లైన్ : ఫార్ట్‌సర్క్యూట్ కారణంగా ఓ విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్ పేలిపోయి ఇళ్లలోని టీవీలు, బల్బులు మాడిపోయిన ఘటన చాట్లవానిపాలెంలో గురువారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే... ఎంతో కాలంగా గ్రామంలోని నివాస గృహాల మధ్య ఉన్న విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్లను తొలగించాలని విద్యుత్ అధికారులను వేడుకున్నా... పట్టించుకోకపోవ డంతో పలుమార్లు షార్ట్‌సర్క్యూట్‌తో అవి పేలిపోతున్నాయి. సుమారు 8 నెలల క్రితం ఇక్కడి విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్ పేలిపోయి గృహోపకరణాలు కాలిపోయి తీవ్రనష్టం ఏర్పడిందని గ్రామస్తులు చెబుతున్నారు. ఇళ్ల మధ్యలో ఉన్న ట్రాన్స్‌ఫార్మర్లను తొలగించి రహదారి పక్కకు మార్చాలని విద్యుత్ శాఖ ఏఈని కోరగా త్వరలోనే మార్చుతామని హామీ ఇచ్చారన్నారు.
అయితే 8 నెలలు కావస్తున్నా ఇంత వరకూ పట్టించుకున్న దాఖలాలు లేవన్నారు. ఇప్పటి కైనా సంబంధిత విద్యుత్ శాఖ అధికారులు స్పందించి గృహాల మధ్యలో ఉన్న విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్లను తొలగించి గృహాలకు దూరంగా ఏర్పాటు చేయాలని స్థానికులు అంజి, హనుమంతు, చాట్ల ఏసుపాదం, శ్రీనివాసరావు,టీ వెంటేశ్వరరావు,చాట్ల రాజేష్, కొడాలి రవీంద్ర, రామయ్య తదితరులు కోరుతున్నారు.
షార్ట్ సర్క్యూట్‌తో పేలిపోయిన ట్రాన్స్‌ఫార్మర్
Published Fri, Mar 21 2014 3:04 AM | Last Updated on Sat, Sep 2 2017 4:57 AM
Advertisement