సాక్షి, ఆలూరు: ఎస్‌ఐ, గొర్రెల కాపరి పరస్పరం దాడి చేసుకున్న సంఘటన ఆలూరు మండలంలోని గోనేహాలు–మనేకుర్తి గ్రామాల సమీపంలో శుక్రవారం చోటుచేసుకుంది. వివరాలిలా ఉన్నాయి. హాలహర్వి మండల ఎస్‌ఐ బాలనరసింహులు పని నిమిత్తం ఆదోని పట్టణానికి బైక్‌పై బయలుదేరారు. మనేకుర్తి–గోనేహాలు సమీపంలో రోడ్డుపై గొర్రెలు అడ్డొచ్చాయి. వాటిని పక్కకు తోలాలని కాపరి బీరప్పను దూషించారు. ఆయన మఫ్టీలో ఉండడంతో ఎస్‌ఐగా గుర్తించలేని గొర్రెల కాపరి కాస్త కటువుగానే మాట్లాడాడు. ‘నువ్వు ఎవరు నాకు చెప్పడానికి? అవి మూగజీవాలు.. పక్కకు జరగాలని వాటికి తెలియద’ని అన్నాడు.దీంతో ఎస్‌ఐ.. గొర్రెల కాపరి చెంప చెళ్లుమనిపించాడు. దీంతో అతను కూడా ఎదురుదాడికి దిగాడు. సంఘటన తరువాత ఎస్‌ఐ ఆలూరు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు బృందాలుగా ఏర్పడి గొర్రెల కాపరి కోసం గాలిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment