రూ. 500, 1,000 నోట్లను రద్దు చేయాలన్న నిర్ణయం ఒక్క రోజులో జరిగింది కాదని, కేంద్రంలో కీలకమైన ఇద్దరుముగ్గురు వ్యక్తులు
పెద్ద నోట్ల రద్దుపై సిద్ధార్థనాథ్ సింగ్ క్రెడిట్ చంద్రబాబు తీసుకుంటే అభ్యంతరం లేదు
సాక్షి, అమరావతి: రూ. 500, 1,000 నోట్లను రద్దు చేయాలన్న నిర్ణయం ఒక్క రోజులో జరిగింది కాదని, కేంద్రంలో కీలకమైన ఇద్దరు ముగ్గురు వ్యక్తులు దీనిపై ఆరేడు నెలలుగా చర్చించిన తర్వాతే అమల్లోకి తీసుకువచ్చారని బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి సిద్ధార్థనాథ్ సింగ్ వెల్లడించారు. గురువారం ఆయన విజయవాడలో విలేకరులతో మాట్లాడారు.
తాను లేఖ రాయడం వల్లే కేంద్రం నోట్ల రద్దు నిర్ణయం తీసుకుందని ఏపీ సీఎం చంద్రబాబు చెప్పుకోవడంతో పాటు టీడీపీ నేతలు అదే విషయాన్ని ప్రచారం చేయడంపై విలేకరులు అడిగిన ప్రశ్నకు సిద్దార్థనాథ్‌సింగ్ స్పందించారు. బాబు తమ మిత్రపక్ష నాయకుడేనని,. కెడ్రిట్ ఎవరు తీసుకున్నా అభ్యంతరం లేదని అన్నారు.