Siddharthanath Singh
-
నోట్ల రద్దు నిర్ణయాన్ని బాబు సమర్థించారు
ఏపీ బీజేపీ వ్యవహారాల ఇంచార్జ్ సిద్ధార్థనాథ్ సింగ్ సాక్షి, న్యూఢిల్లీ: నోట్ల రద్దు నిర్ణయాన్ని చంద్రబాబుతో పాటు టీడీపీ గట్టిగా సమర్థించిందని ఏపీ బీజేపీ వ్యవహారాల ఇంచార్జ్ సిద్ధార్థనాథ్ సింగ్ అన్నారు. బుధవారం ఆయన విలేకర్లతో మాట్లాడుతూ నోట్ల రద్దు నిర్ణయం క్రెడిట్‌ను ఏపీ సీఎం చంద్రబాబుతో పాటు ఆయన పార్టీ తీసుకుందని పేర్కొన్నారు. చంద్రబాబు డిజిటల్ ఎకానమీ కమిటీకి కన్వీనర్‌గా పనిచేస్తున్నారని, పెద్ద నోట్ల రద్దు వల్ల తలెత్తిన సమస్యలు త్వరగా పరిష్కారం కావాలని ఆయన కోరుకుంటున్నారని చెప్పారు. బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా ఇదే కోరుతున్నారని అన్నారు. చంద్రబాబు గతంలో చేసిన వ్యాఖ్యలకు ప్రస్తుతం ఆయన అనుసరిస్తున్న వైఖరికి తేడా ఏమీ లేదని, ఆయన వ్యాఖ్యల్లో ఎలాంటి వివాదం లేదన్నారు. -
ఆరేడు నెలలు చర్చించాకే నిర్ణయం
పెద్ద నోట్ల రద్దుపై సిద్ధార్థనాథ్ సింగ్ క్రెడిట్ చంద్రబాబు తీసుకుంటే అభ్యంతరం లేదు సాక్షి, అమరావతి: రూ. 500, 1,000 నోట్లను రద్దు చేయాలన్న నిర్ణయం ఒక్క రోజులో జరిగింది కాదని, కేంద్రంలో కీలకమైన ఇద్దరు ముగ్గురు వ్యక్తులు దీనిపై ఆరేడు నెలలుగా చర్చించిన తర్వాతే అమల్లోకి తీసుకువచ్చారని బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి సిద్ధార్థనాథ్ సింగ్ వెల్లడించారు. గురువారం ఆయన విజయవాడలో విలేకరులతో మాట్లాడారు. తాను లేఖ రాయడం వల్లే కేంద్రం నోట్ల రద్దు నిర్ణయం తీసుకుందని ఏపీ సీఎం చంద్రబాబు చెప్పుకోవడంతో పాటు టీడీపీ నేతలు అదే విషయాన్ని ప్రచారం చేయడంపై విలేకరులు అడిగిన ప్రశ్నకు సిద్దార్థనాథ్‌సింగ్ స్పందించారు. బాబు తమ మిత్రపక్ష నాయకుడేనని,. కెడ్రిట్ ఎవరు తీసుకున్నా అభ్యంతరం లేదని అన్నారు. -
పవన్ ముందు నీ భవిష్యత్తు చూసుకో!
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం పూర్తిస్థాయిలో సాయం చేస్తుందని బీజేపీ ఏపీ ఇన్చార్జ్ సిద్ధార్థనాథ్ సింగ్ తెలిపారు. బొంబాయి రాష్ట్రం నుంచి విడిపోయే సమయంలో గుజరాత్ ఏపీ కంటే వెనుకబడి ఉండేదని, కానీ ఇప్పుడు దేశంలోనే అగ్రగామి రాష్ట్రంగా నిలిచిందని ప్రధాని నరేంద్రమోదీ పేర్కొన్నట్టు ఆయన గుర్తు చేశారు. ఏపీకి ప్రత్యేక సాయం అందించినందుకు రాష్ట్ర బీజేపీ నేతలు శనివారం ప్రధానమంత్రి నరేంద్రమోదీని కలిసి కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం ఢిల్లీలో సిద్ధార్థనాథ్ సింగ్ మీడియాతో మాట్లాడుతూ జనసేన అధ్యక్షుడు, సినీ నటుడు పవన్ కల్యాణ్ తీరును తప్పుబట్టారు. పవన్ అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు. భావోద్వేగాలతో అభివృద్ధి సాధ్యం కాదని పేర్కొన్నారు. బీజేపీ భవిష్యత్ లేదన్న పవన్ ముందు తన భవిష్యత్ ఏమిటో చూసుకోవాలని హితవు పలికారు. పవన్ ఎన్డీయేలో ఉంటారా? లేదా? అన్నది ఆయన ఇష్టమని సిద్ధార్థనాథ్ సింగ్ స్పష్టం చేశారు. పవన్ పాచిపోయిన లడ్డూల గురించి స్పందిస్తూ.. నిధులు పాచిపోవు.. మాటలే పాచిపోతాయని పేర్కొన్నారు. బీజేపీ ఎంపీ హరిబాబు మాట్లాడుతూ ఏపీకి ప్రత్యేక సాయాన్ని ప్రజల్లోకి తీసుకెళుతామని చెప్పారు. ఇందుకోసం తిరుపతి, విశాఖపట్టణం, విజయవాడలలో బహిరంగ సభలు నిర్వహిస్తామని తెలిపారు. ఈ సభలకు కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ హాజరవుతారని చెప్పారు. ఏ రాష్ట్రానికి ఇవ్వనివిధంగా ఏపీకి సాయం చేశారని అన్నారు. -
కేంద్ర సాయంపై తప్పుడు ప్రచారం
బీజేపీ జాతీయ కార్యదర్శి సిద్ధార్థనాథ్ సింగ్ అనంతపురం సెంట్రల్: రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం సాయం చేస్తున్నా దుష్ర్పచారం చేస్తున్నారని బీజేపీ జాతీయ కార్యదర్శి, రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జ్ సిద్ధార్థనాథ్ సింగ్ మండిపడ్డారు. అనంతపురంలోని కేటీఆర్ కన్వెన్షన్ హాలులో రెండు రోజులుగా జరుగుతున్న శిక్షణ తరగతులకు శుక్రవారం ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా విషయంలో యూపీఏ ప్రభుత్వం అన్యాయం చేసిందని ఆరోపించారు. అన్ని రాష్ట్రాలను సమాన దృష్టితో చూడాలనే ఉద్దేశంతోనే భవిష్యత్‌లో ఏ రాష్ట్రానికీ ప్రత్యేకహోదా ఇవ్వకూడదని నిర్ణయించినట్లు తెలిపారు. ప్రస్తుతం ప్రత్యేకహోదా కలిగిన 11 రాష్ట్రాలకు 2017తో గడువు పూర్తవుతుందని వివరించారు. భవిష్యత్‌లో ప్రత్యేకహోదా అంటూ ఉండదని స్పష్టం చేశారు. ఇందుకు అన్ని రాజకీయ పక్షాలు మద్దతు తెలిపాయన్నారు. కానీ రాష్ట్రానికి వచ్చే సరికి కేంద్రం అన్యాయం చేస్తోందని దుష్ర్పచారం చేయడం భావ్యం కాదన్నారు. -
కాపుల రిజర్వేషన్లపై బీజేపీ పెద్దల ఆరా
సాక్షి, హైదరాబాద్: కాపులను బీసీలుగా గుర్తించాలంటూ రాష్ట్రంలో జరుగుతున్న ఆందోళనలపై బీజేపీ జాతీయ నాయకత్వం ఆరా తీసింది. పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి సిద్ధార్థనాథ్ సింగ్ రెండు రోజుల కిందటే కాపుల రిజర్వేషన్ల పూర్వాపరాలపై నివేదిక పంపాలంటూ రాష్ట్ర నేతలకు సూచించారు. దీంతో రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు కంభంపాటి హరిబాబు ఇందుకు సంబంధించిన వివరాలతో పాటు తునిలో జరిగిన పరిణామాలను వివరిస్తూ ఒక నివేదికను జాతీయ నాయకత్వానికి పంపారు.