కేంద్ర సాయంపై తప్పుడు ప్రచారం | False claims on the central help | Sakshi
Sakshi News home page

కేంద్ర సాయంపై తప్పుడు ప్రచారం

Published Sat, Sep 3 2016 1:56 AM | Last Updated on Fri, Mar 29 2019 9:31 PM

కేంద్ర సాయంపై తప్పుడు ప్రచారం - Sakshi

కేంద్ర సాయంపై తప్పుడు ప్రచారం

బీజేపీ జాతీయ కార్యదర్శి సిద్ధార్థనాథ్ సింగ్

 అనంతపురం సెంట్రల్: రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం సాయం చేస్తున్నా దుష్ర్పచారం చేస్తున్నారని బీజేపీ జాతీయ కార్యదర్శి, రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్ సిద్ధార్థనాథ్ సింగ్ మండిపడ్డారు. అనంతపురంలోని కేటీఆర్ కన్వెన్షన్ హాలులో రెండు రోజులుగా జరుగుతున్న శిక్షణ తరగతులకు శుక్రవారం ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా విషయంలో యూపీఏ ప్రభుత్వం అన్యాయం చేసిందని ఆరోపించారు.

అన్ని రాష్ట్రాలను సమాన దృష్టితో చూడాలనే ఉద్దేశంతోనే భవిష్యత్‌లో ఏ రాష్ట్రానికీ ప్రత్యేకహోదా ఇవ్వకూడదని నిర్ణయించినట్లు తెలిపారు. ప్రస్తుతం ప్రత్యేకహోదా కలిగిన 11 రాష్ట్రాలకు 2017తో గడువు పూర్తవుతుందని వివరించారు. భవిష్యత్‌లో ప్రత్యేకహోదా అంటూ ఉండదని స్పష్టం చేశారు. ఇందుకు అన్ని రాజకీయ పక్షాలు మద్దతు తెలిపాయన్నారు. కానీ రాష్ట్రానికి వచ్చే సరికి కేంద్రం అన్యాయం చేస్తోందని దుష్ర్పచారం చేయడం భావ్యం కాదన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement