పాలమూరు, న్యూస్‌లైన్: ఎన్ని‘కల’ ఫలించి గ్రామ సర్పంచ్ పీఠమెక్కిన ప్రజా ప్రతినిధులకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న కొత్త నిర్ణయంతో సంకటస్థితిలో పడేసినట్లయింది. దీంతో స ర్పంచ్‌లు, కార్యదర్శులకు మధ్య సంతకాల పంచాయితీ మొదలైంది. గ్రామపంచాయతీల్లో అక్రమాలకు అడ్డుకట్టవేసేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఇదిలాఉండగా, గత పాలకవర్గాల పదవీకాలం ముగిసిన రెండేళ్ల తర్వాత పంచాయతీలకు ఎన్నికలు జరిగాయి.
ఆగస్టు మొదటివారంలో అధికారిక బాధ్యతలు స్వీకరించిన సర్పంచ్‌లకు చెక్‌పవర్ లేకపోవడంతో పనులు నిర్వహణ కష్టంగా మారింది. దీంతోవారు తమ అధికారాల కోసం ఒత్తిడితేవడంతో సోమవారం రాష్ట్ర ప్రభుత్వం సర్పంచ్‌లు, కార్యదర్శులకు ఉమ్మడి చెక్‌పవర్ ఉండేవిధంగా జీఓ నెం.385ను జారీచేసింది. ప్రభుత్వ నిర్ణయం పట్ల సర్పంచ్‌లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గతంలో సర్పంచ్‌లు, కార్యదర్శులకు జాయింట్ చెక్‌పవర్ ఉండేది. కానీ జనరల్ నిధులకు సంబంధించి సర్పంచ్‌లకు మాత్రమే పూర్తి అధికారాలు కేటాయించారు.
ఈసారి మాత్రం అన్ని ఖర్చులు, నిధులకు సంబంధించి జాయింట్ పవర్ కేటాయించారు. జిల్లాలో 1324 గ్రామపంచాయతీలకు 518 మంది కార్యదర్శులు మాత్రమే ఉన్నారు. (గ్రేడ్ 1 పంచాయతీల్లో 8, గ్రేడ్2 పంచాయతీల్లో నాలుగు ఖాళీలు ఉన్నాయి.) వీరిలో 80 మందికి పైగా తాత్కాలిక సిబ్బంది పనిచేస్తున్నారు. దాదాపు 800 పంచాయతీ కార్యదర్శుల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఈ కారణంగా ఒక్కో కార్యదర్శికి రెండు మూడు గ్రామాలకు సంబంధించి అదనపు బాధ్యతలు అప్పగించారు. ఈ నేపథ్యంలో చెక్‌వపర్‌ను సర్పంచ్‌లతోపాటు కార్యదర్శులకు కేటాయించడం సరికాదని గ్రామ ప్రథమపౌరులు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు.
అక్రమాలకు అడ్డుకట్ట వేసేందుకు
పంచాయతీ నిధులను వినియోగించడంలో ప లు అక్రమాలు చోటుచేసుకున్న సందర్భంగా సర్పంచ్‌ల అక్రమాలకు అడ్డుకట్ట వేసేందుకు ఉమ్మడి చెక్ పవర్ కేటాయించినట్లు పంచాయతీరాజ్ శాఖ అధికారులు పేర్కొంటున్నారు. గ తంలో జిల్లాలో 30 మందికిపైగా సర్పంచ్‌లు అవినీతికి పాల్పడినట్లుగా ఆరోపణలు ఉన్నా యి. వారిలో 11 మంది అవినీతికి పాల్పడిన ట్లు రుజువుకావడంతో వారిని ఈ పోటీల్లో అనర్హులుగా ప్రభుత్వం ప్రకటించింది. వారి నుంచి రూ.86,75,651 మాత్రమే నిధులు రికవరీ చే శారు. మిగతా వారిపై కూడా విచారణ జరిపి రి కవరీ చేస్తే కోట్లరూపాయలు వసూలవుతాయి. కాగా, ఎవరో చేసిన తప్పులకు తమ అధికారాలకు అడ్డుకట్ట వేయడం సరైన విధానం సరికాదని కొత్త సర్పంచ్‌లు వాదిస్తున్నారు. రాజ్యాం గబద్ధంగా తమకు కేటాయించిన అధికారాల ను అప్పగించాలని, లేదంటే ఆందోళన బాట పడతామని హెచ్చరిస్తున్నారు.
సమన్వయం సాధ్యం కాదు
కార్యదర్శులకు జాయింట్ చె క్‌పవర్ ఇవ్వడంతో ఇద్దరి మ ధ్య సయన్వయం కుదరదు. గ్రామంలో సర్పంచ్, పట్టణం లో కార్యదర్శులు ఉంటే పను లు సాధ్యపడవు. సకాలంలో పనులు చేయలేక గె లిపించిందెందుకని ప్రజలు మమ్మల్ని ఛీదరించుకుంటారు.
- వెంకటయ్య గౌడ్,
సర్పంచ్, గౌరారం, బొంరాస్‌పేట(మం)
ప్రభుత్వానిది నిర్లక్ష్యధోరణి
అసలే పంచాయతీలకు కార్యదర్శు ల కొరత తీవ్రం గా ఉంది. ఒక్కో కార్యదర్శి మూడు, నాలు గు గ్రామాల్లో పనిచేస్తున్నాడు. దీనివల్ల ఇబ్బందులు తలెత్తుతాయి. ప్ర భుత్వం స్థానిక సంస్థలపై నిర్లక్ష్యధోరణి ని ప్రదర్శిస్తుందనడానికి ఇదే నిదర్శనం..
- ఇంద్రయ్య సాగర్, సర్పంచ్,
నిజాలాపూర్, అడ్డాకుల (మం)
‘పవర్’ సర్పంచ్‌లకే ఉండాలి
గ్రామావృద్ధికి సంబంధించి చెక్ పవర్ సర్పంచ్‌కే ఉండాలి. పంచాయతీ కార్యదర్శితో జాయింట్ సంతకం వల్ల అభివృద్ధి విషయంలో ఇద్దరి మధ్య బేధాభిప్రాయాలు తలెత్తుతాయి. అభివృద్ధి కూడా కుంటుపడే అవకాశం ఉంటుంది.
-కె.రఘు, సర్పంచ్, అడ్డాకుల
జాయింట్ పవర్ వద్దు
పంచాయితీ నిధుల వ్యయంలో సర్పం చ్‌లతోపాటు పం చాయతీ కార్యదర్శులకు జాయింట్ చెక్ పవర్ ఉండొద్దు. పనులు చేయాలన్నా, పంచాయతీకి అవసరమైన సామగ్రిని కొనుగోలు చేయాలన్నా కార్యదర్శులను ఆశ్రయించాలంటేఇబ్బందిగా ఉంటుంది.
- లక్ష్మీ, సర్పంచ్,
తుంకిమెట్ల, బొంరాస్‌పేట(మం)
సంతకాల ‘పంచాయితీ’!
Published Thu, Aug 22 2013 2:09 AM | Last Updated on Fri, Nov 9 2018 5:52 PM
Advertisement
Advertisement