joint check power
-
ఏ రాష్ట్రంలోనూ లేని పద్ధతి తెలంగాణలో ఎందుకు?
సాక్షి, ఢిల్లీ : తెలంగాణలో ఉమ్మడి చెక్ పవర్ ఇచ్చి ప్రభుత్వం సర్పంచ్‌లను అవమానిస్తోందని మాజీ మంత్రి, బీజేపీ నేత డీకే అరుణ ఆరోపించారు. మంగళవారం ఆమె నేతృత్వంలో తెలంగాణ సర్పంచ్ల ఫోరమ్ నాయకులు కేంద్రమంత్రి నరేందర్ సింగ్ తోమర్‌ను కలిశారు. సమావేశం అనంతరం డీకే అరుణ మీడియాతో మాట్లాడుతూ.. లక్షలు ఖర్చుపెట్టుకొని గెలిచిన సర్పంచ్‌తో సమానంగా ఉప సర్పంచ్‌కి చెక్ పవర్ ఇవ్వడం వల్ల గ్రామాల్లో గొడవలు జరుగుతున్నాయన్నారు. ఏమైనా పనులు చేయాలంటే ఉప సర్పంచులు బ్లాక్మెయిల్ చేస్తున్నారని, సర్పంచ్‌లు తీవ్ర మనస్తాపంతో ఉన్నారని ఆమె వెల్లడించారు. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం గత ఐదేళ్లుగా గ్రామాలకు నిధులు కేటాయించకపోవడంతో గ్రామాభివృద్ధి కుంటుపడిందని, గ్రామాలకోసం కేంద్రం ఇచ్చిన నిధులు పక్కదారి పడుతున్నాయని ఆమె విమర్శించారు. మేం చెప్పిన విషయాల పట్ల కేంద్రమంత్రి సానుకూలంగా స్పందించిన మంత్రి, త్వరలో తెలంగాణలో పర్యటిస్తానని హామీ ఇచ్చారని తెలియజేశారు. తెలంగాణ సర్పంచ్ల సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు భూమన్న యాదవ్ మాట్లాడుతూ.. దేశంలో ఏ రాష్ట్రంలోనూ లేని విధంగా తెలంగాణలో ఉమ్మడి చెక్‌పవర్ ఇవ్వడం దారుణమని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ మీద తమకు నమ్మకం లేదని, ఆయనవి మాటలే తప్ప చేతలు లేవన్నారు. -
సర్పంచ్ల చేతికొచ్చిన ‘పవర్’
దమ్మపేట: గ్రామపంచాయతీల్లో ఏడాదిన్నర కాలంగా ఖర్చు కాకుండా ఉన్న నిధులను వినియోగించుకునేందుకు అవకాశం ఏర్పండింది. ప్రభుత్వం వారం రోజుల క్రితమే ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఇప్పటి వరకు ఉన్న అడ్డంకులు తొలగిపోయాయి. కొత్త పంచాయతీరాజ్ చట్టం అమలులోకి వచ్చింది. వివిధ పథకాల కింద పంచాయతీలకు మంజూరవుతున్న నిధులను సద్వినియోగం చేసుకునేలా ప్రభుత్వం నిబంధనలు సూచించింది. అందులో భాగంగా సర్పంచులకు నిధుల వ్యయం, పనుల నిర్వహణకు సంబంధించిన బాధ్యతలు అప్పగించారు. సర్పంచ్, ఉపసర్పంచులకు ఉమ్మడి చెక్‌పవర్ అమలులోకి తీసుకువచ్చారు. దీంతో గ్రామాల్లో ఎంతో కాలంగా వేధిస్తున్న సమస్యలకు పరిష్కారం లభించింది. ఇప్పటికైనా సౌకర్యాల కల్పనకు ప్రజాప్రతినిధులు తగిన చొరవ చూపాల్సిన అవసరం ఉంది. పారిశుద్ధ్యం అస్తవ్యస్తం.. ఆయా పంచాయతీల సర్పంచులు బాధ్యతలు చేపట్టిన వెంటనే గ్రామాల్లో అత్యవసరమైన సౌకర్యాల కల్పనకు ఇప్పటి వరకు పెద్ద మొత్తంలో వ్యయం చేశారు. అనంతరం పారిశుద్ధ్యం, తాగునీటి సమస్యలు నెలకొంటున్నా ఒక సొంతంగా నిధులను భరించలేమని చేతులెత్తేశారు. దీంతో గ్రామాల్లో సమస్యలు పేరుకుపోయాయి. పంచాయతీల్లో పారిశుద్ధ్య సిబ్బందికి నెలల తరబడి జీతాలు ఇవ్వని పరిస్థితి ఏర్పండింది. నిధుల వ్యయంపై దృష్టి.. గతంలో సర్పంచి, గ్రామ కార్యదర్శికి ఉమ్మడి చెక్‌పవర్ ఉండటంతో అవసరమైన నిధులు డ్రా చేయడం అంత సులువుగా జరిగేది కాదు. ప్రతి ఏటా నిర్వహించే ఆడిట్ సమయలో గ్రామ కార్యదర్శి బాధ్యత వహించాల్సి వస్తుందన్న కారణంతో సిబ్బంది తగిన జాగ్రత్తలు తీసుకునే వారు. ఎంబీ రికార్డుల ఆధారంగా నిధులు డ్రా చేసేవారు. ప్రస్తుతం సర్పంచ్, ఉపసర్పంచులకు ఉమ్మడి చెక్‌పవర్ రావడంతో నిధుల వ్యయంపై కార్యదర్శులకు బాధ్యత తప్పింది. ఇదే సమయంలో ఇద్దరికి ఇవ్వడం వల్ల కూడా ఇష్టానుసారంగా నిధులను డ్రా చేసే పరిస్థితి ఉండదు. గ్రామసభల్లోనూ నిధుల అందుబాటు, వ్యయం వివరాలు చర్చకు వస్తుండటంతో పారదర్శకతకు అవకాశం ఉంటుంది. ప్రజల భాగస్వామ్యం.. కొత్త చట్టంలో గ్రామసభలకు హాజరయ్యే ప్రజల సంఖ్యపై కచ్చితమైన నిబంధనలను ప్రభుత్వం పేర్కొంది. దీంతో గ్రామపంచాయతీలో ఏం జరుగుతోంది? పాలన ఎలా ఉంది? నిధుల వ్యయం పరిశీలన, ఎలాంటి పనులను చేపడతారు? అనే విషయాలు అందరికీ తెలిసే పరిస్థితి ఏర్పడుతుంది. గ్రామ జనాభా ఆధారంగా గ్రామసభకు ఎంత మంది హాజరు అవ్వాల్సి ఉందన్న దానిపై స్పష్టత ఇచ్చింది. గ్రామంలో 500 మంది జనాభా ఉంటే 50 మంది, వెయ్యి మంది ఉంటే 75 మంది, 3 వేలు మంది ఉంటే 150, 5 వేలు ఉంటే 200, 10 వేల జనాభా ఉంటే 300 మంది హాజరు కావాలి. ఇలా కాకుండా హాజరైన సంఖ్య తగ్గితే కోరం లేనట్లుగానే పరిగణిస్తారు. ఈ నిబంధనలతో పంచాయతీ పాలక వర్గాలు బాధ్యతగా నడుచుకునేందుకు మార్గం ఏర్పడుతుంది. హాజరు అంతంత మాత్రమే.. ఇప్పటి వరకు జరిగిన గ్రామసభలు పరిశీలిస్తే ప్రజలు ఎక్కడా ఆశించిన స్థాయిలో హాజరైన సందర్భాలు లేవు. గ్రామసభలు నిర్వహించే సమయాన్ని కూడా పంచాయతీలు కొన్ని సందర్భాల్లో ప్రజలకు తెలపని సంఘటనలున్నాయనే ఆరోపణలు లేకపోలేదు. మరో వైపు కోరం నిబంధనతో సమస్యల పరిష్కారం త్వరితగతిన జరుగుతుందని పలువురు అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. -
జాయింట్ చెక్ పవరొద్దు..
సాక్షి, నేలకొండపల్లి : ప్రభుత్వం ఇటీవల సర్పంచ్, ఉప సర్పంచ్‌లకు కలిపి జాయింట్ చెక్ పవర్ కల్పించడాన్ని గ్రామ పంచాయతీల సర్పంచ్‌లు వ్యతిరేకిస్తున్నారు. సర్పంచ్, పంచాయతీ కార్యదర్శికి కలిపి చెక్ పవర్ కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు. ఇందుకోసం జిల్లాలోని సర్పంచ్‌లు ఆందోళన బాటకు సిద్ధమయ్యారు. గత ఐదు నెలల క్రితం జరిగిన పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసి ప్రజల ఆమోదంతో గెలిచిన సర్పంచ్‌లు చెక్‌పవర్ కోసం నెలల తరబడి ఎదురుచూశారు. గ్రామాలను అభివృద్ధి చేయాల నే సంకల్పంతో సర్పంచ్‌లు సిద్ధమవుతున్న తరుణంలో రాష్ట్ర ప్రభుత్వం నూతన పంచాయతీరాజ్ చట్టం 2018 ప్రకారం జీవోఎంఎస్ నంబర్ 38ని ప్రవేశపెట్టింది. అందులో సర్పంచ్–ఉప సర్పంచ్‌లకు జాయింట్ చెక్ పవర్ కల్పిస్తూ పంచాయతీరాజ్ ప్రిన్సిపల్ సెక్రటరీ వికాస్‌రాజ్ ఈ నెల 15న జీఓ విడుదల చేశారు. ఉప సర్పంచ్‌తో కలిపి సంయుక్తంగా చెక్ పవర్ కల్పించడం వల్ల అనేక సమస్యలు ఉత్పన్నం అవుతాయని సర్పంచ్‌లు అంటున్నారు. రాజకీయంగా సర్పంచ్ ఒక పార్టీ, ఉప సర్పంచ్ మరో పార్టీ నుంచి గెలుపొందిన చోట్ల..ఐక్యత ఉండదని చెబుతున్నారు. పాలకవర్గాల్లో గ్రూపు రాజకీయాలు చేస్తూ అభివృద్ధిని కుంటుపరిచేందుకు వీలు ఉందని ఇంకొందరు భావిస్తున్నారు. దీంతో గ్రామంలో అభివృద్ధి కుంటుపడే అవకాశం ఉంది. రాజకీయ గొడవలకు కూడా ఆస్కారం ఉండే ప్రమాదం ఉంది. జీఓ 38ని రద్దు చేయాలనే డిమాండ్‌తో సర్పంచ్‌లు ఆందోళనకు సిద్ధమయ్యారు. ఈ నెల 21న మండల పరిషత్ కార్యాలయం వద్ద ధర్నాకు పిలుపునిచ్చారు. సర్పంచ్–పంచాయతీ కార్యదర్శికి చెక్‌పవర్ అప్పగించాలని కోరుతున్నారు. జాయిం ట్ చెక్‌పవర్ విషయంలో పునారాలోచించాలని, అలాగే..కనీస గౌరవ వేతనం పెంచాలని సర్పంచ్ లు డిమాండ్ చేస్తున్నారు. తమ న్యాయమైన డిమాండ్ల సాధనకు దశల వారీ పోరాటాలకు సిద్ధమవుతున్నారు. సర్పంచ్ల ప్రధాన డిమాండ్లు ఇలా.. ⇒ పంచాయతీ కార్యదర్శి, సర్పంచ్‌లకు జాయింట్ చెక్ పవర్ ఇవ్వాలి ⇒ జాయింట్ చెక్ పవర్లో ఉపసర్పంచ్‌కు ప్రాధాన్యం వద్దు ⇒ ఏకగ్రీవంగా ఎన్నికైన పంచాయతీలకు వెంటనే రూ.15 లక్షలు ఇవ్వాలి ⇒ సర్పంచ్‌లకు గౌరవ వేతనం రూ.20 వేలు ఇవ్వాలి ⇒ 14వ ఆర్థిక సంఘం నిధులు విడుదల చేయాలి -
ఇక ‘జాయింట్’ పవర్
జైనథ్: నాలుగు నెలల నిరీక్షణకు తెరపడింది. గ్రామ పంచాయతీల్లో నూతనంగా కొలువుదీరిన సర్పంచులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న చెక్ పవర్‌ను జారీ చేస్తూ ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. గ్రామ పంచాయతీ సర్పంచ్, ఉప సర్పంచ్‌లకు జాయింట్ చెక్ పవర్ కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. నేటి నుంచి జాయింట్ చెక్‌పవర్ అమలులోకి రానుంది. దీంతో గ్రామాల్లో ఎన్నో రోజుల నుం చి పేరుకుపోయిన సమస్యలను పరిష్కరించడానికి మార్గం సుగమమైంది. సమస్యలతో సతమతం.. గ్రామాల్లో పాలకవర్గం ఫిబ్రవరిలో కొలువుదీరింది. జిల్లాలో 467 గ్రామ పంచాయతీలు ఉండగా, చెక్ పవర్ లేకపోవడంతో గ్రామాల్లో ఎక్కడికక్కడ సమస్యలు అక్కడే పేరుకుపోయాయి. కనీసం మురికి కాలువలు తీయడం, తాగునీటి సరఫరా, వీధిదీపాలు వంటి మౌలిక సౌకర్యాలు కల్పించలేని స్థితిలో గ్రామ పంచాయతీలు కొట్టుమిట్టాడుతున్నాయి. 2018 చివర్లో జిల్లాకు ఎఫ్ఎఫ్సీ నిధులు విడుదలయ్యాయి. గ్రామ పంచాయతీల వారీగా ఖాతాల్లో జమ కావడంతో అప్పటి పాలక వర్గాలు 60 శాతం నిధులు ఖర్చు చేశాయి. 2019 ఫిబ్రవరిలో కొత్త సర్పంచులు ఎన్నికయ్యారు. కానీ నిధులు ఉన్నప్పటికీ కూడా చెక్‌పవర్ లేకపోవడంతో నిధులు ఉపయోగించలేని పరిస్థితి నెలకొంది. మళ్లీ 2019 మార్చిలో ఎఫ్ఎఫ్సీ మరోవిడత కింద 14కోట్లు విడుదలయ్యాయి. ఈ నిధులు కూడా గ్రామ పంచాయతీ ఖాతాల్లో జమఅయ్యాయి. కానీ చెక్‌పవర్ లేకపోవడం ఎఫ్ఎఫ్సీ నిధులు ఖాతాల్లో మూలుగుతున్నాయి. ప్రస్తుతం సర్పంచ్, ఉప సర్పంచ్‌లకు జాయింట్ చెక్‌పవర్ కల్పిస్తూ ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేయడంతో నిధులను ఉపయోగించుకోవచ్చు. జాయింట్ చెక్ పవర్‌పై అసంతృప్తి.. సర్పంచులతో పాటు ఉప సర్పంచులకు జాయింట్ చెక్‌పవర్ కల్పిస్తామని ప్రభుత్వం ప్రకటించడంతో సర్పంచుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. అయితే అప్పట్లో చెక్‌పవర్‌పై స్పష్టత ఇవ్వకపోవడంతో సర్పంచులు సైలెంట్‌గా ఉండిపోయారు. అయితే శనివారం హఠాత్తుగా జాయింట్ చెక్‌పవర్ కోసం ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేయడంతో సర్పంచులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కేవలం వార్డు మెంబర్‌తో గెలిచిన వ్యక్తికి సర్పంచ్‌తో సమానంగా చెక్‌పవర్ కల్పించడంతో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే ఉప సర్పంచులు మాత్రం ఈ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నారు. పర్యవేక్షణకే కార్యదర్శులు.. కార్యదర్శుల స్థానంలో ఉపసర్పంచ్‌కు చెక్‌పవర్ ఇవ్వడంతో కార్యదర్శుల పాత్ర పర్యవేక్షణకే పరిమితం కానుంది. కార్యదర్శికి ఏ మాత్రం చెప్పకుండా సర్పంచ్, ఉపసర్పంచ్లు నిధులను డ్రా చేసుకునే అవకాశం ఉండటంతో జవాబుదారీతనం, పారదర్శకత లోపిస్తుందని పలువురు అభిప్రాయపడుతున్నారు. గ్రామ పంచాయతీల్లో రాజకీయ జోక్యం విపరీతంగా పెరిగి, అధికారులకు ఏ మాత్రం ప్రాముఖ్యత ఉండదని ఆందోళన చెందుతున్నారు. అంతేకాకుండా చెక్ పవర్ కల్పించడంతో సమస్యలు తీరుతాయని ప్రజలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. చాలా సంతోషంగా ఉంది.. నాలుగు నెలలుగా గ్రామాల్లో పనులు చేయలేకపోతున్నాం. ఉన్న నిధులతో వీధిదీపాలు, తాగునీరు, పలు వసతులు క ల్పించాం. ప్రస్తుతం చెక్ పవర్ ఇవ్వడంతో గ్రామ పంచాయతీలు నిధులు ఉపయోగించుకునేందుకు అవకాశం లభించింది. ఎట్టకేలకు ప్రభుత్వం చెక్‌పవర్ జారీ చేయడం సంతోషంగా ఉంది. – ఎడ్మల పోతరెడ్డి, సర్పంచ్, పూసాయి -
మళ్లీ చెక్‌పవర్ ‘పంచాయితీ’
ఖమ్మం జడ్పీసెంటర్: పంచాయతీల్లో మళ్లీ చెక్‌పవర్ లొల్లి మొదలైంది. సర్పంచ్, పంచాయతీ కార్యదర్శికి జాయింట్ చెక్‌పవర్‌ను ఇస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడంతో ఈ అగ్గి రాజుకుంది. ఈ విషయంలో సర్పంచ్‌లు ప్రభుత్వంపై విమర్శలు ఎక్కుపెట్టారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఇదే తరహాలో జాయింట్ చెక్‌పవర్‌ను ఇవ్వడంతో అప్పట్లో సర్పంచ్‌లు ఆందోళనకు దిగారు. ఈ నేపథ్యంలో నాటి ప్రభుత్వం ఆ జీవోను ఉపసంహరించుకుంది. ఇప్పుడు అదే తరహాలో సర్పంచ్‌లు అసహనం వ్యక్తం చేస్తున్నారు. పంచాయతీల్లో నిర్వహించే పనులు, అభివృద్ధి కార్యక్రమాలు, నిధుల వినియోగంలో సర్పంచ్‌తో పాటు కార్యదర్శుల సంతకం తీసుకోవటం ఏమిటని పలువురు ప్రెసిడెంట్లు ప్రశ్నిస్తున్నారు. జిల్లావ్యాప్తంగా 671 పంచాయతీలు ఉన్నాయి. వీటిలో మొత్తం 147 మంది కార్యదర్శులు విధులు నిర్వహిస్తున్నారు. ఏపీపీఎస్సీ ద్వారా ఇటీవల మరో 48 మందిని నియమించారు. ఈ 195 పంచాయతీలు మినహా మిగిలినవాటికి కార్యదర్శులు లేరు. అటువంటప్పుడు జాయింట్ చెక్‌పవర్ ఇస్తే పరిస్థితి ఏంటని సర్పంచ్‌లు ప్రశ్నిస్తున్నారు. కేసీఆర్ గతంలో ఉన్న జాయింట్ చెక్‌పవర్‌ను రద్దు చేశారు..ఉన్నట్టుండి ఈ నిర్ణయం ఏంటని అంటున్నారు. ‘ప్రభుత్వం పారదర్శకంగా వ్యవహరిస్తోందని, ప్రజలకు జవాబుదారీగా ఉండేందుకే సర్పంచ్, కార్యదర్శులకు జాయింట్ చెక్‌పవర్ ఇచ్చాము’ అని ప్రభుత్వం వాదిస్తోంది. సర్కారు వాదనతో సర్పంచ్‌లు ఏకీభవించడం లేదు. పంచాయతీలకు నిధులు విడుదల చేయకుండానే దుర్వినియో గం అవుతాయనడంలో అర్థం లేదని వాదిస్తున్నారు. ఇద్దరి సంతకంతోనే నిధులు ఈ జీవో ప్రకారం సర్పంచ్, కార్యదర్శి ఇద్దరూ సంతకం చేస్తేనే ఏ నిధులైనా విడుదలవుతాయి. గ్రామపంచాయతీల అభివృద్ధి నిమిత్తం అంతర్గత రహదారులు, మరమ్మతు పనులు, పారిశుధ్యం, వీధి దీపాలు, పంచాయతీ భవనాలు, 13వ ఆర్థికసంఘం నిధులు, బీఆర్జీ, ఆర్‌జీపీఎస్‌ఏ తదితర నిధులు వస్తాయి. ఈ నిధుల్లో ఒక్క రూపాయి ఖర్చు చేయాలన్నా సర్పంచ్, కార్యదర్శులిద్దరి సంతకం కావాలి. గతంలో జనరల్ ఫండ్ నుంచి గ్రామ మౌలిక అవసరాల కోసం ఖర్చు చేసే అధికారం సర్పంచ్‌కు మాత్రమే ఉంది. ఇప్పుడు జనరల్ ఫండ్ డ్రా చేయాలన్నా కార్యదర్శి సంతకం తప్పనిసరి. కార్యదర్శులపై ‘అదనపు’ భారం జిల్లాలో 671 పంచాయతీలు ఉండగా 195 మంది కార్యదర్శులే ఉన్నారు. ఇప్పటికే సగానికి పైగా కార్యదర్శి పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఈ ఖాళీ పోస్టులను 34 మంది అర్హులతో భర్తీ చేసే అవకాశం ఉంది. అయినా ఇంకా పలు పంచాయతీలకు సెక్రటరీల కొరత ఉంటుంది. సర్పంచ్ కు అవసరమైనప్పుడు కార్యదర్శి అందుబాటులో ఉండని సమస్య తలెత్తే అవకాశం ఉంది. గతంలో సర్పంచ్‌లు, వార్డు సభ్యులకు జాయింట్ చెక్‌పవర్ ఉండేది. ఇప్పుడు సర్పంచ్‌లు, కార్యదర్శులకు కలిపి ఇచ్చారు. అధికారాలను బదలాయించాలన్న డిమాండ్ సర్పంచ్ల నుంచి వినిపిస్తుండగా ప్రభుత్వం ఉన్న అధికారాల్లో కోత విధించడంపై సర్పంచ్‌లు ఆందోళన చెందుతున్నారు. సర్పంచ్ల మంచికే:రవీందర్, జిల్లా పంచాయతీ అధికారి జాయింట్ చెక్ పవర్ వల్ల సర్పంచ్‌లకే ప్రయోజనం. ప్రతి పనిలో, నిధుల ఖర్చులో సర్పంచ్‌లతో పాటు కార్యదర్శులకు బాధ్యత ఉంటుంది. ప్రతి పైస ఖర్చు కూడా ఎప్పటికప్పుడు నమోదు చేస్తారు. దీని వల్ల అడిట్ ఇబ్బందులు ఉండవు. జవాబుదారితనం పెరుగుతుంది. సర్పంచ్‌లకు పూర్తి వెసులుబాటు ఉంటుంది. సర్పంచ్‌లను అవమానించడమే: కొర్రా రాములు, సోములగూడెం సర్పంచ్, పాల్వంచ సర్పంచ్‌లు, సెక్రటరీలకు జాయింట్ చెక్‌పవర్ ఇవ్వడం సర్పంచ్‌లను అవమానించడమే. గతంలో సర్పంచ్‌లు పోరాడి తెచ్చుకున్న జీవోను సీఎం కేసీఆర్ రద్దు చేయడం దారుణం. ఇప్పటి వరకు ఎలాంటి అభివృద్ధి నిధులు మంజూరుకాలేదు. అప్పుడే దుర్వినియోగం మాటెత్తడం సరికాదు. అభివృద్ది పనులకు విఘాతమే: సరస్వతి, తోగ్గూడెం సర్పంచ్, పాల్వంచ గ్రామ పంచాయితీలకు సెక్రటరీలు సరిపడా లేరు. ఒక్కో సెక్రటరీ మూడు, నాలుగు పంచాయతీల బాధ్యతలు చూడాల్సి వస్తోంది. దీనివల్ల వారు అందుబాటులో ఉండే అవకాశం లేదు. వారు అందుబాటులో లేకపోతే అభివృద్ధి పనుల్లో జాప్యం చోటుచేసుకుంటుంది. కాబట్టి సర్పంచ్‌లకే చెక్‌పవర్ ఇవ్వాలి. -
జాయింట్ జగడం
- కార్యదర్శికి చెక్ పవర్‌పై సర్పంచుల గుర్రు - నిధుల దుర్వినియోగానికి అడ్డుకట్ట పడేనా? - కార్యదర్శుల కొరతతో తీవ్ర ఇబ్బందులు - 29 అంశాలు బదలాయింపు అయ్యేనా..? సుల్తానాబాద్: గ్రామపంచాయతీలకు 29 అంశాలను బదలాయించడంతో పాటు నిధులు, విధుల్లో సర్వాధికారాలు కట్టబెడుతామన్న సర్కారు దానికి విరుద్ధంగా పంచాయతీ కార్యదర్శులు, సర్పంచులకు జాయింట్ చెక్‌పవర్ కల్పిస్తూ జీవో జారీ చేయడంపై సర్పంచులు గుర్రుగా ఉన్నారు. పారదర్శకత, జవాబుదారీతనం పేరిట గ్రామ ప్రజాప్రతినిధులను అగౌరవ పరచడమేనని, తమ హక్కులను హరించే ప్రయత్నంలో భాగమని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈజీవోపై సర్కారు పునరాలోచన చేయాల్సిన అవసరముందని సర్పంచులు కోరుతున్నారు. నిధుల దుర్వినియోగమే కారణమా..? సర్పంచులకు నేరుగా చెక్ పవర్ ఉండడంతో పంచాయతీ పాలకవర్గం తీర్మానాలు లేకుం డానే డబ్బులు డ్రా చేసి వాడుకుంటున్నారనే ఆరోపణలున్నాయి. ఇప్పటికే పలు గ్రామాల సర్పంచులపై ప్రభుత్వానికి, ఉన్నతాధికారుల కు ఫిర్యాదులు అందాయి. దీంతో ప్రభుత్వం జాయింట్ చెక్ పవర్‌ను అమలు చేస్తే కొంతవరకు అవినీతికి చెక్ పెట్టవచ్చనే ఆలోచనతోనే ఈ జీవో జారీ చేసినట్టు భావిస్తున్నారు. సర్పంచులు బాధ్యతలు చేపట్టి ఏడాదిన్నర అవుతున్నప్పటికీ మెజారిటీ గ్రామ పంచాయతీల్లో నిధులు లేకపోవడంతో అభివృద్ధి కుంటుపడింది. ప్రభుత్వం ఏర్పడి ఆర్నెల్లు అవుతున్నప్పటికీ పలు రకాల పనులకు నిధులు విడుదల చేయలేదు. పని చేసిన వాటికి నిధులు నేటికీ ఇవ్వకపోవడంతో అప్పులు తెచ్చి పనులు చేసిన సర్పంచులు ఆందోళన చెందుతున్నారు. ఇటీవల బీఆర్జీఎఫ్, 13వ ఆర్థిక సంఘం నిధులు విడుదల కావడంతో పాటు ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ నిధులను గ్రామాభివృద్ధికి నిధులు వెచ్చించనున్నారు. గతంలోనూ జాయింట్ చెక్ పవర్ కల్పించిన సందర్భాల్లో సర్పంచుల నుంచి పెద్ద ఎత్తున వ్యతిరేకత ఎదురైంది. పలు చోట్ల కార్యదర్శులు, సర్పంచులు కుమ్మక్కై నిధులు దుర్వినియోగం చేసిన సంఘటనలు లేకపోలేదు. ఈ నేపథ్యంలో జాయింట్ చెక్ పవర్ ప్రయత్నం ఎంతవరకు ఫలిస్తుందనే విషయమై భిన్నవాదనలు వినిపిస్తున్నాయి. కార్యదర్శులేరి..? జిల్లాలో 1207 గ్రామపంచాయతీలు ఉండగా, 528 మంది మాత్రమే కార్యదర్శులు ఉన్నారు. క్లస్టర్ల వారీగా చూసినా జిల్లాలో 621 క్లస్టర్లు ఉండగా.. 93 కార్యదర్శి పోస్టులు ఖాళీగా ఉన్నాయి. దీంతో పెద్ద పంచాయతీలను మినహాయిస్తే మిగిలిన వాటిలో నాలుగు నుంచి ఆరు గ్రామపంచాయతీలకు ఒక కార్యదర్శి మాత్రమే విధులు నిర్వహిస్తున్నారు. అదనపు భారంతో వీరు అన్ని పనులు నిర్వహించడం ఇబ్బందికరంగా ఉంది. అంతేగాకుండా నిధుల విషయమై సర్పంచులకు, కార్యదర్శులకు మధ్య అభిప్రాయ భేదాలు తలెత్తే అవకాశాలు లేకపోలేదు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఖాళీగా ఉన్న పంచాయతీ కార్యదర్శి పోస్టులను భర్తీ చేస్తేనే లక్ష్యం నెరవేరుతుంది. -
సర్పంచ్‌లకే చెక్‌పవర్
కరీంనగర్ సిటీ, న్యూస్‌లైన్ : గ్రామపంచాయతీ నిధులపై పూర్తి ఆజమాయిషీని సర్పంచ్‌లకే కట్టబెడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వుల మేరకు కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. ఇందుకు సంబంధించిన మార్గదర్శకాలను మంగళవారం విడుదల చేశారు. ఇప్పటివరకు పంచాయతీ కార్యదర్శితో కలిసి సర్పం చ్‌కు జాయింట్ చెక్‌పవర్ ఉండగా, సర్పంచ్ల సంఘం, బీసీ సంక్షేమ సంఘం విజ్ఞప్తి మేరకు 30 ఉత్తర్వు, 20.01.1995లోని 40వ నియమం ప్రకారం సర్పంచ్‌లకు సొంతంగా చెక్‌పవర్‌ను పునరుద్ధరిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీని ప్రకారం పంచాయతీకి సంబంధిం చిన సాధారణ నిధుల చెక్కులు విడిపించడానికి సర్పంచ్‌కు పూర్తిస్థాయి హక్కును కల్పించారు. ప్రత్యేక నిధులు అంటే 13వ ఆర్థిక సంఘం నిధులు, స్టేట్ ఫైనాన్స్ కమిటీ(ఎస్ఎఫ్సీ), వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి నిధులు(బీఆర్జీఎఫ్)పై మాత్రం సర్పంచ్, కార్యదర్శులకు జాయింట్ చెక్‌పవర్ ఉంటుంది. దీనిపై సర్పంచ్ల సంఘం అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. చెక్‌పవర్ ఇచ్చినట్లే ఇచ్చి పరిమితులు విధించడం సరికాదంటోంది. ఆర్థిక ఆజమాయిషీపై మార్గదర్శకాలివి పంచాయతీరాజ్ చట్టం 1994 ప్రకారం పంచాయతీల ద్వారా చెల్లించవలసిన ప్రతి బిల్లుకు తప్పకుండా పంచాయతీ తీర్మానం ఆమోదం పొందాలి. పంచాయతీ కార్యదర్శి ప్రభుత్వ నియమాల ప్రకారం పరిశీలించి ముందుంచి తేనే సర్పంచ్ బిల్లు పాస్ చేయాలి. బిల్లు పాసైన అనంతరం సంబంధిత నగదు పుస్తకంతో సహా అకౌంటింగ్ రిజిస్టర్లో పొందుపరిచిన అనంతరమే చెక్కును సర్పంచ్‌కు అందచేయాలి. గ్రామపంచాయతీ ద్వారా తీర్మానం ఆమోదింపబడకుండా, గ్రామపంచాయతీ పనులు నిర్వహిస్తే పరిపాలనా అనుమతి, సాంకేతిక అనుమతి, మేజర్మెంట్ బుక్, చెక్ మేజర్మెంట్లు లేకుండా చెల్లింపులు చేయరాదు. సామగ్రి కొనుగోళ్లపై ఫైనాన్షియల్ కోడ్‌లో నిర్ధేశింపబడిన నియమాలను పాటించాలి. కాంట్రాక్ట్, పార్ట్‌టైం ఉద్యోగుల వేతనాల చెల్లింపులో పంచాయతీ బడ్జెట్ నియమావళిని అనుసరించాలి. గ్రామపంచాయతీ బడ్జెట్ ప్రొవిజన్ ప్రకారం ఆదా యం మేరకు ఖర్చులు చేసుకోవచ్చు. ప్రత్యేక అవసరం అయితే తప్ప పార్టీ పేరుతోనే చెక్కు లు జారీ చేయాలి, సొంతంగా డ్రా చేయరాదు. లెక్కలు, పనుల రిజిస్టర్లు, చెక్కు, పాసుపుస్తకం కచ్చితంగా గ్రామపంచాయతీ కార్యాలయంలో కార్యదర్శి ఆధీనంలో ఉండాలి. అవసరమైనపుడు సర్పంచ్ సమీక్షించొచ్చు. రశీదుల ద్వారా వసూలు చేయబడిన నగదు నుంచి నేరుగా ఎలాంటి చెల్లింపులు చేయొద్దు. ట్రెజరీలోని గ్రామపంచాయతీ నిధికి జమ చేయాలి. పూర్తి అధికారం ఇవ్వాలి - అంతటి అన్నయ్యగౌడ్, సర్పంచ్ల సంఘం జిల్లా అధ్యక్షుడు సర్పంచ్‌లకు చెక్‌పవర్ ఇచ్చినట్లే ఇచ్చి, కొన్ని నిధులపై జాయింట్ పవర్‌ను కొనసాగించడం సరికాదు. జాయింట్ చెక్‌పవర్‌ను పూర్తిగా రద్దుచేయాలి. సర్పంచ్ల అధికారాలపై పరిమితులు తొలగించాలి. బీఆర్జీఎఫ్, ఎస్జీఎఫ్, 13వ ఆర్థిక సంఘం నిధులపై సర్పంచ్‌కే చెక్‌పవర్ అప్పగించాలి. సీనరేజి నిధులు, స్టాంప్‌డ్యూటీ జనరల్ ఫండ్‌కు వెంటనే జమచేయాలి. -
పంచాయతీ పాలనకు ‘చెక్’పవర్
కోవూరు, న్యూస్‌లైన్: దేశానికి పట్టుగొమ్మలైన పల్లెల అభివృద్ధిలో రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి లోపించింది. ఆలస్యంగా ఎట్టకేలకు పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించింది. మళ్లీ ఇప్పుడు నిబంధనల పేరుతో పాలనకు అడ్డుతగులుతోంది. పంచాయతీ అభివృద్ధిలో కీలకమైన చెక్‌పవర్‌ను ప్రజల మద్దతుతో ఎన్నికైన సర్పంచ్ల పాటు ప్రభుత్వ కనుసన్నల్లో పనిచేసే పంచాయతీ కార్యదర్శులకూ కట్టబెట్టింది. ప్రభుత్వ నిర్ణయాన్ని సర్పంచ్‌లు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. పల్లెపాలనలో సర్పంచ్‌లది కీలకపాత్ర. క్షేత్రస్థాయిలో నెలకొన్న మౌలికవసతుల సమస్యను పరిష్కరించడంలో వారు క్రియాశీలకపాత్ర పోషిస్తారు. ప్రజలు కూడా తమ సమస్యలను ఎక్కువ శాతం వారి దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించుకుంటారు. ఈ క్రమంలో గ్రామాల అభివృద్ధికి సంబంధించిన నిధులు ప్రభుత్వం నుంచి బ్యాంకులకు చేరుతాయి. వీటిని చెక్‌ల రూపంలో డ్రా చేస్తారు. గతంలో సర్పంచ్‌కు మాత్రమే చెక్‌పవర్ ఉండేది. ఊరికి కావాల్సిన పనులకు అవసరమైన నిధులను సర్పంచ్ డ్రా చేసి ఖర్చుచేసేవారు. ఈ సంప్రదాయానికి ప్రభుత్వం ఫుల్స్టాప్ పెట్టింది. చెక్‌పవర్‌లో సర్పంచ్‌తో పాటు పంచాయతీ కార్యదర్శులను భాగస్వామ్యం చేసింది. ఈ మేరకు ఇటీవల ఉత్తర్వులు జారీ అయ్యాయి. ప్రభుత్వ నిర్ణయాన్ని సర్పంచ్‌లు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. తమను ఉత్సవ విగ్రహాలుగా మార్చేందుకు కుట్ర జరుగుతోందని వారు ఆరోపిస్తున్నారు. కుట్రలో భాగంగానే సర్పంచ్‌లు, కార్యదర్శులకు జాయింట్ చెక్‌పవర్‌ను రూపొందించిందని చెబుతున్నారు. గతంలో సర్పంచ్‌లు అనేక ఉద్యమాలు చేసి చెక్‌పవర్‌ను సాధించుకున్నారని, నిబంధనల పేరుతో దానికి కొర్రీలు పెడితే గ్రామాభివృద్ధి స్తంభించే ప్రమాదముందని హెచ్చరిస్తున్నారు. ప్రభుత్వం తన నిర్ణయాన్ని పునఃసమీక్షించుకోవాలని, లేనిపక్షంలో మరో ఉద్యమానికి తెరలేపుతామని వారు స్పష్టం చేస్తున్నారు. ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ మద్దతుదారులు ఎక్కువగా సర్పంచ్‌లుగా ఎన్నికయ్యారు. వారిని ఇబ్బంది పెట్టేందుకు ప్రభుత్వం జాయింట్ చెక్‌పవర్‌ను తెరపైకి తెచ్చిందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. -
సంతకాల ‘పంచాయితీ’!
పాలమూరు, న్యూస్‌లైన్: ఎన్ని‘కల’ ఫలించి గ్రామ సర్పంచ్ పీఠమెక్కిన ప్రజా ప్రతినిధులకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న కొత్త నిర్ణయంతో సంకటస్థితిలో పడేసినట్లయింది. దీంతో స ర్పంచ్‌లు, కార్యదర్శులకు మధ్య సంతకాల పంచాయితీ మొదలైంది. గ్రామపంచాయతీల్లో అక్రమాలకు అడ్డుకట్టవేసేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఇదిలాఉండగా, గత పాలకవర్గాల పదవీకాలం ముగిసిన రెండేళ్ల తర్వాత పంచాయతీలకు ఎన్నికలు జరిగాయి. ఆగస్టు మొదటివారంలో అధికారిక బాధ్యతలు స్వీకరించిన సర్పంచ్‌లకు చెక్‌పవర్ లేకపోవడంతో పనులు నిర్వహణ కష్టంగా మారింది. దీంతోవారు తమ అధికారాల కోసం ఒత్తిడితేవడంతో సోమవారం రాష్ట్ర ప్రభుత్వం సర్పంచ్‌లు, కార్యదర్శులకు ఉమ్మడి చెక్‌పవర్ ఉండేవిధంగా జీఓ నెం.385ను జారీచేసింది. ప్రభుత్వ నిర్ణయం పట్ల సర్పంచ్‌లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గతంలో సర్పంచ్‌లు, కార్యదర్శులకు జాయింట్ చెక్‌పవర్ ఉండేది. కానీ జనరల్ నిధులకు సంబంధించి సర్పంచ్‌లకు మాత్రమే పూర్తి అధికారాలు కేటాయించారు. ఈసారి మాత్రం అన్ని ఖర్చులు, నిధులకు సంబంధించి జాయింట్ పవర్ కేటాయించారు. జిల్లాలో 1324 గ్రామపంచాయతీలకు 518 మంది కార్యదర్శులు మాత్రమే ఉన్నారు. (గ్రేడ్ 1 పంచాయతీల్లో 8, గ్రేడ్2 పంచాయతీల్లో నాలుగు ఖాళీలు ఉన్నాయి.) వీరిలో 80 మందికి పైగా తాత్కాలిక సిబ్బంది పనిచేస్తున్నారు. దాదాపు 800 పంచాయతీ కార్యదర్శుల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఈ కారణంగా ఒక్కో కార్యదర్శికి రెండు మూడు గ్రామాలకు సంబంధించి అదనపు బాధ్యతలు అప్పగించారు. ఈ నేపథ్యంలో చెక్వపర్ను సర్పంచ్‌లతోపాటు కార్యదర్శులకు కేటాయించడం సరికాదని గ్రామ ప్రథమపౌరులు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. అక్రమాలకు అడ్డుకట్ట వేసేందుకు పంచాయతీ నిధులను వినియోగించడంలో ప లు అక్రమాలు చోటుచేసుకున్న సందర్భంగా సర్పంచ్ల అక్రమాలకు అడ్డుకట్ట వేసేందుకు ఉమ్మడి చెక్ పవర్ కేటాయించినట్లు పంచాయతీరాజ్ శాఖ అధికారులు పేర్కొంటున్నారు. గ తంలో జిల్లాలో 30 మందికిపైగా సర్పంచ్‌లు అవినీతికి పాల్పడినట్లుగా ఆరోపణలు ఉన్నా యి. వారిలో 11 మంది అవినీతికి పాల్పడిన ట్లు రుజువుకావడంతో వారిని ఈ పోటీల్లో అనర్హులుగా ప్రభుత్వం ప్రకటించింది. వారి నుంచి రూ.86,75,651 మాత్రమే నిధులు రికవరీ చే శారు. మిగతా వారిపై కూడా విచారణ జరిపి రి కవరీ చేస్తే కోట్లరూపాయలు వసూలవుతాయి. కాగా, ఎవరో చేసిన తప్పులకు తమ అధికారాలకు అడ్డుకట్ట వేయడం సరైన విధానం సరికాదని కొత్త సర్పంచ్‌లు వాదిస్తున్నారు. రాజ్యాం గబద్ధంగా తమకు కేటాయించిన అధికారాల ను అప్పగించాలని, లేదంటే ఆందోళన బాట పడతామని హెచ్చరిస్తున్నారు. సమన్వయం సాధ్యం కాదు కార్యదర్శులకు జాయింట్ చె క్పవర్ ఇవ్వడంతో ఇద్దరి మ ధ్య సయన్వయం కుదరదు. గ్రామంలో సర్పంచ్, పట్టణం లో కార్యదర్శులు ఉంటే పను లు సాధ్యపడవు. సకాలంలో పనులు చేయలేక గె లిపించిందెందుకని ప్రజలు మమ్మల్ని ఛీదరించుకుంటారు. - వెంకటయ్య గౌడ్, సర్పంచ్, గౌరారం, బొంరాస్‌పేట(మం) ప్రభుత్వానిది నిర్లక్ష్యధోరణి అసలే పంచాయతీలకు కార్యదర్శు ల కొరత తీవ్రం గా ఉంది. ఒక్కో కార్యదర్శి మూడు, నాలు గు గ్రామాల్లో పనిచేస్తున్నాడు. దీనివల్ల ఇబ్బందులు తలెత్తుతాయి. ప్ర భుత్వం స్థానిక సంస్థలపై నిర్లక్ష్యధోరణి ని ప్రదర్శిస్తుందనడానికి ఇదే నిదర్శనం.. - ఇంద్రయ్య సాగర్, సర్పంచ్, నిజాలాపూర్, అడ్డాకుల (మం) ‘పవర్’ సర్పంచ్‌లకే ఉండాలి గ్రామావృద్ధికి సంబంధించి చెక్ పవర్ సర్పంచ్‌కే ఉండాలి. పంచాయతీ కార్యదర్శితో జాయింట్ సంతకం వల్ల అభివృద్ధి విషయంలో ఇద్దరి మధ్య బేధాభిప్రాయాలు తలెత్తుతాయి. అభివృద్ధి కూడా కుంటుపడే అవకాశం ఉంటుంది. -కె.రఘు, సర్పంచ్, అడ్డాకుల జాయింట్ పవర్ వద్దు పంచాయితీ నిధుల వ్యయంలో సర్పం చ్లతోపాటు పం చాయతీ కార్యదర్శులకు జాయింట్ చెక్ పవర్ ఉండొద్దు. పనులు చేయాలన్నా, పంచాయతీకి అవసరమైన సామగ్రిని కొనుగోలు చేయాలన్నా కార్యదర్శులను ఆశ్రయించాలంటేఇబ్బందిగా ఉంటుంది. - లక్ష్మీ, సర్పంచ్, తుంకిమెట్ల, బొంరాస్‌పేట(మం)