ఆ ఆరు మృతదేహాలను భద్రపరచండి | six bodies Archive | Sakshi
Sakshi News home page

ఆ ఆరు మృతదేహాలను భద్రపరచండి

Published Fri, Apr 10 2015 1:06 AM | Last Updated on Tue, Nov 6 2018 4:37 PM

six bodies Archive

మద్రాసు హైకోర్టు ఆదేశం

చెన్నై: శేషాచలం ఎన్‌కౌంటర్‌కు సంబంధించి ఆరు మృతదేహాలను శుక్రవారం వరకు భద్రపరచాలని మద్రాస్ హైకోర్టు గురువారం ఆదేశాలు జారీ చేసింది. తిరువణ్ణామలై జిల్లాకు చెందిన మృతుల్లో ఒకరైన శశికుమార్ భార్య మునియమ్మళ్ తరఫున న్యాయవాది కె. బాలు దాఖలు చేసిన పిటిషన్‌పై న్యాయమూర్తి పైవిధంగా ఆదేశిం చారు.

మృతదేహంపై బుల్లెట్‌గాయాలు సహా కత్తితో కోసిన గుర్తులు న్నాయని కోర్టుకు వివరించారు. ఈ పిటిషన్‌పై ఆదేశాలను శుక్రవారం జారీ చేస్తామని, అప్పటివరకు ఆరు మృతదేహాలనూ తిరువణ్ణామలై జిల్లా హెడ్‌క్వార్టర్స్‌లోని ప్రభుత్వాస్పత్రి మార్చురీలో భద్రపరచాలని  ఆదేశించారు.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement