సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ఐటీ, సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి పల్లె రఘునాథరెడ్డి గురువారం బ్రిటన్‌లోని వెస్ట్‌మినిస్టర్ నగరంలో యూకే ప్రభుత్వం స్మార్ట్ సిటీలపై నిర్వహించిన సదస్సుల్లో పాల్గొన్నారు. రాష్ర్ట విభజన అనంతరం విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి నగరాలను మెగాసిటీలుగా అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం వద్ద ఉన్న ప్రణాళికలను ఆయన వివరించారు.
ఈ 3 నగరాల అభివృద్ధికీ తాము కట్టుబడి ఉన్నామని, తిరుపతి, విశాఖపట్నంలను ఐటీ హబ్‌లుగా తయారు చేయడంతో పాటు రాష్ట్రంలో 14 స్మార్ట్‌సిటీలను ఏర్పాటు చేస్తామని తెలిపారు. కేంద్రం సాయంతో రాష్ట్రంలోని ప్రతి ఇంటికీ ఇంటర్నెట్ సౌకర్యం కల్పిస్తామని చెప్పారు.