సరికొత్త వైద్య విధానానికి శ్రీకారం
విజయవాడ (హెల్త్ యూనివర్సిటీ): డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ స్మార్ట్ వైద్య విద్య విధానానికి శ్రీకారం చుట్టింది. స్మార్ట్‌ఫోన్, ల్యాప్‌టాప్, ట్యాబ్, నోట్‌బుక్ వంటివి ఉంటే చాలు.. యూజీ(సూపర్ స్పెషాలిటీ) నుంచి సెకండ్ ఇయర్ పీజీ వరకు పాఠాలు, మెడికల్ జర్నల్స్ చదువుకోవచ్చు.
ఇప్పటికే మెడికల్ ఎడ్యుకేషన్ యాప్‌లు అందుబాటులో ఉన్నప్పటికీ దేశంలో తొలిసారిగా ఎన్టీఆర్ యూనివర్సిటీ తమ విద్యార్థులకు, ప్రొఫెసర్లకు అధికారికంగా మెడికల్ జర్నల్స్, పాఠ్యాంశాలను ఎన్టీఆర్ మెడ్‌నెట్ కన్సార్షియం డిజిటల్ లైబ్రరీ ద్వారా ఉచితంగా అందించేందుకు గేట్‌వే పోర్టల్‌ను ప్రారంభించింది. దీనిని హెల్త్ యూనివర్సిటీ వైస్ చాన్సలర్ డాక్టర్ టి.రవిరాజు సోమవారం లాంఛనంగా ప్రారంభించారు.
‘స్మార్ట్’గా వైద్య విద్య
Published Tue, Apr 7 2015 2:28 AM | Last Updated on Mon, Aug 20 2018 2:35 PM
Advertisement
Advertisement