వెల్దుర్తి/జహీరాబాద్, న్యూస్‌లైన్: పాముకాటుకు ఇద్దరు రైతులు బలయ్యారు. వెల్దుర్తి మండలం అచ్చంపేటలో ఓ రైతు మరణిం చగా, జహీరాబాద్ మండలం ధనాసిరిలో పాముకాటుకు గురై చికిత్స పొందుతూ మరణించాడు. వివరాలు ఇలా.. వెల్దుర్తి మండలం అచ్చంపేటకు చెందిన రైతు పెరుక వెంకటేశం(50) మంగళవారం రాత్రి స్థానిక హనుమాన్ దేవాలయం వద్ద ఏర్పాటు చేసిన వినాయక మండపంలో భజనలు చేసి అర్ధరాత్రి ఇంటికి వచ్చి నిద్రించాడు. దుప్పట్లో దూరిన పాము వెన్ను పూస పై కాటు వేసింది. వెంటనే మేల్కొన్న వెంకటేశం ఏదో కరిచిందని కుటుంబ సభ్యులకు తెలుపగా వారంతా వెతకగా కట్ల పాము కన్పించింది. వెంటనే దాన్ని చంపేశారు. ఆ వెంటనే వెంకటేశంను ఆసుపత్రికి తీసుకెళ్తుండగా మార్గమధ్యంలో మృతి చెందాడని కుటుంబ సభ్యు లు తెలిపారు. వెంకటేశంకు భార్య సుశీల, ఇద్దరు కుమారులు ఉన్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని శవాన్ని పోస్టుమార్టం నిమిత్తం మెదక్ ఆసుపత్రికి తరలించారు. ప్రభుత్వం స్పందించి వెంకటేశం కుటుంబాన్ని పరిహారం చెల్లించి ఆదుకోవాలని గ్రామ సర్పంచ్ నర్సింలు కోరారు.
చికిత్స పొందుతూ సురేశ్ మృతి...
జహీరాబాద్ మండలం ధనాసిరి గ్రామానికి చెందిన రైతు సురేశ్(42) రెండురోజుల క్రితం పొలం వద్ద ఎడ్లను మేపుతున్న క్రమంలో పాము కాటుకు గురయ్యాడు. కుటుంబ సభ్యులు వెం టనే అతణ్ణి జహీరాబాద్ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో కర్ణాటకలోని బీదర్ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మంగళవారం రాత్రి మరణించాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు చిరాగ్‌పల్లి పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
పాముకాటుకు ఇద్దరు రైతుల బలి
Published Thu, Sep 12 2013 12:12 AM | Last Updated on Mon, Oct 1 2018 2:00 PM
Advertisement
Advertisement