పాల ప్యాకెట్‌లో పాముపిల్ల! | Snake in Milk Packet West godavari | Sakshi
Sakshi News home page

పాల ప్యాకెట్‌లో పాముపిల్ల!

Published Fri, Apr 26 2019 12:36 PM | Last Updated on Fri, Apr 26 2019 12:36 PM

Snake in Milk Packet West godavari - Sakshi

కొవ్వూరు మండలం పశివేదలలో పాలల్లో ఉన్న పాముపిల్ల

పశ్చిమగోదావరి, కొవ్వూరు రూరల్‌ : పాలప్యాకెట్‌లో పాము పిల్ల వచ్చిన సంఘటన గురువారం కొవ్వూరు మండలం పశివేదలలో జరిగింది. ఈ వార్త పరిసర గ్రామాలకు పాకడంతో పెద్ద చర్చనీయాంశమైంది. వివరాల్లోకి వెళితే గ్రామానికి చెందిన వైఎస్సార్‌ సీపీ నాయకుడు ఆళ్ల రంగనాథ్‌ రోజూ ఓ కంపెనీకి చెందిన పాలప్యాకెట్‌ను కొనుగోలు చేసి వాడుతుంటారు. గురువారం యథావిధిగా గ్రామంలోని షాపులో ఓ ప్యాకెట్‌ కొనుగోలు చేసి పాలను కాయడానికి ఓపెన్‌ చేసి గిన్నెలో వేస్తుండగా అందులో నుంచి పాము ఆకారంలో ఉన్న జీవి బయటపడింది. దీంతో వారు ఆందోళన చెంది షాపు అతడిని సంప్రదించగా వారు ఏ విధమైన సమాధానం చెప్పకపోవడంతో వినియోగదారుల ఫారంను ఆశ్రయించనున్నట్టు రంగనా«థ్‌ తెలిపారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement