milk packet
-
పాల ప్యాకెట్ కోసం వచ్చి.. అనంతలోకాలకు
తూర్పుగోదావరి,మండపేట: పాల ప్యాకెట్ కోసం వచ్చిన చిన్నారిని మురుగునీటి డ్రైన్ రూపంలో మృత్యువు కబళించింది. పాల ప్యాకెట్ కోసం వెళ్లిన చిన్నారి వచ్చేస్తుందని ఎదురు చూస్తున్న కన్నవారికి తీరని కడుపు కోత మిగిల్చింది. బాలికను కాపాడేందుకు పెద్ద ఎత్తున స్థానికులు డ్రైన్లో గాలించినా ఫలితం లేకపోయింది. పట్టణానికి చెందిన పలివెల దుర్గాప్రసాద్, పల్లవి దంపతులకు కుమార్తె చంద్రకళ(7), కుమారుడు ఉన్నారు. స్థానిక మూడో వార్డులోని ఇంటిలో అద్దెకు ఉంటున్న దుర్గాప్రసాద్ వడ్రంగి పని చేస్తుంటాడు. స్థానిక రామాహిందూ మున్సిపల్ స్కూల్లో చంద్రకళ రెండో తరగతి చదువుతోంది. ఆదివారం సాయంత్ర సమయంలో పాల ప్యాకెట్ కోసం పోలీస్‌స్టేషన్ సమీపంలోని దుకాణం వద్దకు వచ్చింది. అప్పటికే కుంభవృష్టిగా కురిసిన వర్షంతో దుకాణం సమీపంలోని మంగళిబోదె డ్రైన్ వేగంగా ప్రవహిస్తోంది. రోడ్డుపై నుంచి ముంపునీరు ప్రవహిస్తుండడంతో నీటిలో కాలి చెప్పు జారిపోయింది. దానిని తీసుకునే ప్రయత్నంలో చంద్రకళ నీటి ప్రవాహ వేగానికి డ్రైన్లో పడి కొట్టుకుపోయింది. ప్రమాదాన్ని గమనించి ఇద్దరు చిన్నారులు బాలిక ఇంటికి వెళ్లి ఆమె తల్లికి చెప్పడంతో ఆమె పరుగెత్తుకుంటూ సంఘటన స్థలానికి చేరుకుంది. తన బిడ్డను కాపాడమంటూ ఆమె డ్రైన్ వెంబడి పరుగులు పెట్టడం చూసి స్థానికులు పెద్ద ఎత్తున డ్రైన్‌లోకి దిగి గాలింపు చర్యలు చేపట్టారు. కిలోమీటరు దూరంలో చిన్నారి దొరకడంతో హుటాహుటిన స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకురాగా అప్పటికే ఆ చిన్నారి మృతి చెందినట్టు వైద్యులు నిర్ధారించారు. మున్సిపల్ కమిషనర్ టి.రామ్‌కుమార్ సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. పట్టణ పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. అల్లారుముద్దుగా పెంచుకుంటున్న కుమార్తె విగతజీవిగా పడి ఉండడం చూసి తల్లిదండ్రులు ప్రసాద్, పల్లవి శోకసంద్రంలో మునిగిపోయారు. తమ బిడ్డను కాపాడమంటూ ఆస్పత్రి వద్ద వారు మొరపెట్టుకోవడం చూపరులను కలచివేసింది. -
రియల్ హీరో అనిపించుకున్న కానిస్టేబుల్
-
రియల్ హీరో అనిపించుకున్న కానిస్టేబుల్
భోపాల్ : అచ్చం సినిమా సీన్ తరహాలో పరిగెడుతున్న రైలులో పాల కోసం గుక్కపట్టి ఏడుస్తున్న ఒక నాలుగేళ్ల చిన్నారికి పాల పాకెట్‌ను అందించి రియల్ హీరోగా మారాడు ఒక ఆర్పీఎఫ్ కానిస్టేబుల్. ఆ కానిస్టేబుల్ మానవతా దృక్పథానికి కేంద్ర మంత్రి పీయుష్ గోయల్ కూడా ముగ్దులయ్యారు. వివరాల్లోకి వెళితే.. 33ఏళ్ల ఇందర్ సింగ్ యాదవ్ మధ్యప్రదేశ్‌లోని భోపాల్ రైల్వే స్టేషన్లో ఆర్పీఎఫ్ కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. లాక్డౌన్ నేపథ్యంలో వలసకూలీల కోసం బెల్గాం నుంచి గోరఖ్‌పూర్‌కు వెళుతున్న శ్రామిక్ రైలు అక్కడికి చేరుకుంది. అదే రైలులో హసీన్ హష్మి తన భార్య షరీఫ్ హష్మి, నాలుగేళ్ల చిన్నారితో కలిసి గోరఖ్‌పూర్‌లోని సొంతూరుకు వెళుతున్నాడు. అప్పటికే పాల కోసం నాలుగేళ్ల చిన్నారి గుక్క పట్టి ఏడుస్తున్నాడు. మధ్యలో రెండు మూడు రైల్వే స్టేషన్లలో రైలు ఆగినా వారికి పాలు దొరకలేదు. (విషాదం : కళ్ల ముందే సముద్రంలో కలిసిపోయాయి) ఈ విషయాన్ని అక్కడే ఉన్న ఇందర్ సింగ్‌కు చెప్పి తమకు సహాయం చేయాలని అర్థించారు. వెంటనే స్పందించిన ఇందర్ సింగ్ రైల్వే స్టేషన్ బయటకు పరిగెత్తి ఒక షాపులో పాలపాకెట్‌ను కొని మళ్లీ పరిగెత్తుకొచ్చాడు. కానీ అప్పటికే రైలు కదిలిపోయింది. కానీ ఇందర్ సింగ్ మాత్రం ఒక్కక్షణం కూడా ఆలోచించకుండా రైలు వెంట పరిగెడుతూ చివరికి ఎలాగోలా షరీఫ్ హష్మికి కిటికీలోంచి పాలపాకెట్‌ను అందించాడు. ఈ వీడియో రైల్వే స్టేషన్‌లోని సీసీటీవీ ఫుటేజీలో రికార్డయింది.ఇప్పుడు ఇందర్ సింగ్ రియల్ హీరోగా మారిపోయాడు. (పైలట్ తప్పిదం వల్లే ఆ ఘోర ప్రమాదం) ఈ వీడియోనూ చూసిన కేంద్ర మంత్రి పియూష్ గోయల్ ఇందర్ సింగ్ నిజమైన హీరో అంటూ ట్విటర్ వేదికగా పొగడ్తలతో ముంచెత్తాడు. ' ఇందర్ సింగ్ ఇవాళ తన మానవత్వాన్ని చాటుకున్నాడు. పాలకోసం గుక్కపట్టి ఏడుస్తున్న నాలుగేళ్ల చిన్నారి ఆకలి తీర్చేందుకు అతను చేసిన సాహసం నిజంగా అభినందించదగ్గది. కదులుతున్నరైలు వెంబడి పరిగెడుతూ చివరికి చిన్నారి తల్లికి పాలపాకెట్ అందించి గొప్ప మనుసును చాటుకున్నాడు.. ఇందర్ సింగ్' అంటూ పేర్కొన్నాడు. కాగా ఈ ఘటన మే 31న చోటుచేసుకుంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. -
పాల ప్యాకెట్టే ప్రాణాలు తీసిందా?
చింతపల్లి(పాడేరు): మండలంలోని చెరువూరు వద్ద ఆదివారం విద్యుత్ స్తంభాన్ని ఆటో ఢీకొనడంతో ఐదుగురు గిరిజనులు మృతి చెందడానికి పాల ప్యాకెట్టే కారణమని స్థానికులు చెబుతున్నారు. చెరువూరుకు చెందిన వంతాల కృష్ణారావు గత కొంత కాలంగా ఆటో నడుపుతున్నాడు. కోరుకొండలో ఆదివారం జరిగిన వారపుసంతకు వచ్చిన కృష్ణారావు పాలప్యాకెట్ కొని, ఆటో స్టీరింగ్ భాగంలో పెట్టుకున్నాడు. ప్రయాణికులు ఎక్కిన తర్వాత చెరువూరికి సమీపంలోని దిగువ ప్రాంతానికి వెళుతుండగా పాలప్యాకెట్ ఆటో స్టీరింగ్ నుంచి జారీ కాళ్లపై పడడంతో ప్యాకెట్‌తీసి పైన పెట్టే క్రమంలో అదుపుతప్పి విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టినట్టు కొందరు చెబుతున్నారు. మండలంలోని అన్నవరం ప్రధాన రహదారి నుంచి చెరువూరు వరకు సుమారు 16 కిలోమీటర్ల మేర 150 విద్యుత్ స్తంభాలున్నాయి. ఇవన్నీ ఇనుప స్తంభాలు కావడంతో పాటు సింగిల్ లైన్ విద్యుత్ సరఫరా అవుతుంది. ఆటో స్తంభాన్ని స్వల్పంగా ఢీకొట్టినప్పటికీ పైన విద్యుత్ తీగ తెగి ఆటోపై పడడంతో షాక్‌కు గురై ఐదుగురు మరణించగా, ఆరుగురు గాయాలు పాలైనట్లు చెబుతున్నారు. గాయపడిన వారిని లోతుగెడ్డ పీహెచ్‌సీకి తరలించారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు క్షతగాత్రులను నర్సీపట్నం ఏరియా ఆస్పత్రికి తరలించి మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నారు. సీఎం స్పందించడం ఇదే ప్రథమం మండలంలో గతంలో ఎన్నో ప్రమాదాలు జరిగాయి. పెద్ద సంఖ్యలో గిరిజనులు మృత్యువాత పడ్డారు. కానీ ముఖ్యమంత్రి స్థాయిలో స్పందించడం ఇదే తొలిసారి అని పలువురు చర్చించుకుంటున్నారు. కడసిల్ప వద్ద జీపు బోల్తాపడి ఏడుగురు గిరిజనులు మృతి చెందారు. అప్పటి మంత్రిగా ఉన్న పసుపులేటి బాలరాజు ఈ ప్రాంతీయుడు కావడంతో స్పందించారు. తర్వాత జర్రెల ఘాట్ రోడ్డు వద్ద జీపు బోల్తాపడి నలుగురు గిరిజనులు అక్కడికక్కడే మృతి చెందినా మంత్రి స్థాయిలో కూడా ఎవరూ స్పందించలేదు. గత ఏడాది అన్నవరం వద్ద జీపు ప్రమాదానికి గురై నలుగురు గిరిజనులు మృతి చెందినా అధికారులు మినహా ప్రముఖ నేతలెవరు పట్టించుకున్న దాఖలాలు లేవు. రాష్ట్రంలో అత్యంత శివారునున్న విశాఖ మన్యంలోని చింతపల్లి మండలం ఒడిశా సరిహద్దు ప్రాంతంలో చెరువూరు వద్ద జరిగిన ప్రమాదంలో ఐదుగురు గిరిజనులు మృతి చెందిన వెంటనే ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి స్పందించి రూ.5లక్షలు ఎక్స్‌గ్రేషియా ప్రకటించడం సర్వత్రా చర్చాంశనీయమైంది. సంఘటన జరిగిన వెంటనే బాధితులను పరామర్శించేందుకు వెళ్లాలని జిల్లా కలెక్టర్ భాస్కర్‌కు ఆదేశాలు జారీ చేయడంతో ఆదివారం అర్ధరాత్రి ఆయన చింతపల్లి చేరుకున్నారు. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో పాడేరు ఎమ్మెల్యేగా ఎన్నికైన కొట్టగుళ్లి భాగ్యలక్ష్మి సోమవారం పాడేరులో విజయోత్సవ ర్యాలీ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ విషాద సంఘటన సమాచారం తెలియడంతో ఆమె ర్యాలీని రద్దు చేసుకుని చెరువూరుకు వెళ్లారు. -
పాల ప్యాకెట్లో పాముపిల్ల!
పశ్చిమగోదావరి, కొవ్వూరు రూరల్ : పాలప్యాకెట్‌లో పాము పిల్ల వచ్చిన సంఘటన గురువారం కొవ్వూరు మండలం పశివేదలలో జరిగింది. ఈ వార్త పరిసర గ్రామాలకు పాకడంతో పెద్ద చర్చనీయాంశమైంది. వివరాల్లోకి వెళితే గ్రామానికి చెందిన వైఎస్సార్ సీపీ నాయకుడు ఆళ్ల రంగనాథ్ రోజూ ఓ కంపెనీకి చెందిన పాలప్యాకెట్‌ను కొనుగోలు చేసి వాడుతుంటారు. గురువారం యథావిధిగా గ్రామంలోని షాపులో ఓ ప్యాకెట్ కొనుగోలు చేసి పాలను కాయడానికి ఓపెన్ చేసి గిన్నెలో వేస్తుండగా అందులో నుంచి పాము ఆకారంలో ఉన్న జీవి బయటపడింది. దీంతో వారు ఆందోళన చెంది షాపు అతడిని సంప్రదించగా వారు ఏ విధమైన సమాధానం చెప్పకపోవడంతో వినియోగదారుల ఫారంను ఆశ్రయించనున్నట్టు రంగనా«థ్ తెలిపారు. -
యథేచ్ఛగా పాల కల్తీ!
తూప్రాన్: ప్యాకెట్ పాలైనా.. గేదె పాలైనా.. విష రసాయనాలు, ఎముకల పొడిమయమై పోయాయి. పాలల్లో పోషక పదార్థాలు ఉంటాయని అందరికి తెలుసు. కానీ ప్రస్తుతం పాలల్లో వాటికి బదులుగా ప్రజలను రోగాల బారిన పడేసే విషం ఉంటోంది. ఇదేంటి అనుకుంటున్నారా..? ఇది నిజం.. జిల్లాలోని తూప్రాన్, కాళ్లకల్ మండల కేంద్రాలు పాల కల్తీకి అడ్డాగా మారాయి. పాల కల్తీ వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలు అన్న చందంగా సాగుతోంది. దీంతో వ్యాపారులు లక్షల్లో సొమ్ము చేసుకుంటున్నారు. డివిజన్ పరిధిలోని తూప్రాన్, కాళ్లకల్ గ్రామాలను అడ్డాగా ఏర్పాటు చేసుకొని వ్యాపారాన్ని యథేచ్ఛగా సాగిస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా ఈ వ్యాపారం జోరుగా సాగుతున్నట్టు సమాచారం. పట్టణానికి చెందిన ఓ పాల వ్యాపారి ఈ మేరకు వివరాలు వెల్లడించారు. తూప్రాన్ డివిజన్లోని రైతుల వద్ద ఉన్న గేదెలు, ఆవులు సుమారు 5 వేలకు పైగా ఉన్నాయి. వీటి ద్వారా రోజుకు 25 వేల లీటర్ల పాలు ఉత్పత్తి అవుతున్నాయి. కానీ ఇక్కడ నిత్యం సుమారు 50 వేల లీటర్ల వ్యాపారం సాగుతున్నట్లు తెలుస్తోంది. తూప్రాన్‌కు చుట్టుపక్కల మండలాలైన శివ్వంపేట, Ðవెల్దుర్తి, వర్గల్, చేగుంట మండలాలు, కాళ్లకల్‌కు మేడ్చెల్ జిల్లాలోని పూడూరు, రావన్‌కోల్, సోమారం, ఘనపూర్, మేడ్చెల్, లింగాపూర్, డబీల్‌పుర తదితర గ్రామాల వ్యాపారులు అక్కడ సేకరించిన పాలను తీసుకువచ్చి విక్రయిస్తున్నారు. రహస్యంగా ఆక్సిటోసిన్ ఇంజక్షన్లు.. జిల్లాలో సరఫరా అవుతున్న పాలల్లో దాదాపు 80 శాతం కల్తీ జరుగుతున్నట్లు పలువురు పాల వ్యాపారులు చెబుతున్నారు. ఒక లీటరు స్వచ్ఛమైన పాలను ఎనిమిది లీటర్ల కల్తీ పాలుగా మార్చుతున్నారు. దీని కోసం మొదట లీటరు పాలల్లో అత్యధికంగా నీళ్లు కలుపుతారు. ఆ తర్వాత ఇందులో యూరియా, ఎముకల పొడి, హైడ్రోజన్ ఫెరాక్సైడ్ వంటి రసాయనాలను తక్కువ మోతాదులో కలిపి విక్రయిస్తున్నట్లు తెలుస్తోంది. ఇదే కాక కొందరు రైతులు అధిక పాల ఉత్పత్తి కోసం పశువులకు మోతాదుకు మించి ఆక్సిటోసిన్ ఇంజక్షన్లు ఇవ్వడం పరిపాటిగా మారింది. ఈ ఇంజక్షన్లు రంగారెడ్డి జిల్లా మేడ్చల్, బోయిన్‌పల్లిలోని జనరల్ వెటర్నరీ, పశువుల దాణా దుకాణాల్లో రహస్యంగా అమ్ముతున్నట్లు సమాచారం. గతంలోనే ప్రభుత్వం ఆక్సిటోసిన్ ఇంజక్షన్‌ను నిషేధించింది. ఈ ఇంజక్షన్ వాడడం వల్ల దుష్ఫలితాలు కలుగుతాయని పశు సంవర్ధక శాఖ అధికారులు సూచిస్తున్నారు. అయినప్పటికీ అధిక పాల ఉత్పత్తి కోసం ఈ ఇంజక్షన్‌ను వాడుతున్నారు. ఇది ప్రమాదకరమని వైద్యులు చెబుతున్నారు. ఎక్కువ సేపు నిల్వ కోసం.. కల్తీ పాలను ఎక్కువ సేపు నిల్వ ఉంచడం కోసం హైడ్రోజన్ ఫెరాక్సైడ్, సోడియం బై కార్పొనేట్, క్యాల్షియం యాక్సైడ్, ఎముకల పొడి, ఇతర రసాయనాలు కలిపి కల్తీకి పాల్పడుతున్నారు. పాలు తెల్లగా ఉండేందుకు లీట రుకు రెండు గ్రాముల చొప్పున యూరియాను కలుపుతున్నట్లు సమాచారం. ఇవే కాకుండా సోయా, ఆముదం వాటి నుంచి వచ్చే నూనెలను కూడా కలుపుతున్నారు. అయితే అసలైన పాల వ్యాపారులు ఈ కల్తీ వ్యాపారుల వల్ల నష్టాలకు గురవుతున్నారు. లక్షల్లో పెట్టుబడులు పెట్టి గేదెలను పెంచుతున్న రైతులు, వ్యాపారులు కల్తీ పాల పోటీకి తట్టుకోలేక తీవ్ర నష్టాల్లో కూరుకుపోతున్నారు. కల్తీ పాలతో వచ్చే వ్యాధులు.. కల్తీ పాల వల్ల చిన్న పిల్లలతోపాటు పెద్దవారు కూడా అనారోగ్యానికి గురవుతారు. వాంతులు, విరేచనాలు, కడుపులో తిప్పడం, అల్సర్, గ్యాస్ట్రో, జీర్ణకోశ సంబంధిత వ్యాధులు వచ్చే ప్రమాదం ఉందని వైద్యులు చెబుతున్నారు. వెంటనే సంబంధిత అధికారులు స్పందించి కల్తీ పాలను నివారించాలని పలువురు కోరుతున్నారు. తూప్రాన్‌లో రెండేళ్ల క్రితం ఓ పాల వ్యాపారి కృత్రిమ పాలను తయారు చేస్తున్న విషయాన్ని తెలుసుకున్న పోలీసులు అతడి ఇంటిపై దాడి చేశారు. పాలల్లో కల్తీ గుట్టు రట్టు చేశారు. ఈ పాలల్లో యూరియా, నూనె, పౌడర్, తదితర రసాయనాలు గుర్తించి సదరు వ్యాపారిపై కేసు నమోదు చేశారు. అయితే కొన్నాళ్లపాటు జాగ్రత్త పడిన వ్యాపారులు తిరిగి జోరుగా పాల కల్తీకి పాల్పడుతున్నట్లుగా విశ్వసనీయ సమాచారం. మార్కెట్లో స్వచ్ఛమైన పాలు దొరకడం లేదు మార్కెట్లో స్వచ్ఛమైన పాలు దొరకడం లేదు. పాలు అమ్మేవారు రోజూ నాణ్యమైనవి అమ్మడం లేదు. పలుచని పాలు అమ్ముతున్నారు. కనీసం పెరుగు కూడా తోడు కోవడం లేదు. కల్తీ పాలు అమ్ముతున్నారు. ఎక్కడ కొనాలో తెలియక నిత్యం సతమతమవుతున్నాం. నాణ్యమైన పాలు అమ్మే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలి. –మహ్మద్ అసీఫ్, కల్తీ పాలతో ఇబ్బందులు తప్పడం లేదు వ్యాపారులు కల్తీ పాలను అమ్మడం వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. గతంలో తూప్రాన్‌లో కృత్రిమ పాల తయారుదారుడిని గుర్తించిన పోలీసులు కేసు నమోదు చేశారు. అదే తరహాలో పాలల్లో కల్తీ చేస్తున్నారన్న అనుమానాలు ఉన్నాయి. తనిఖీ అధికారులు పాలల్లో కల్తీని గుర్తించి ప్రజల ఆరోగ్యాలను కాపాడాలి. –చెలిమెల జయరాములు, తూప్రాన్ -
పాలు సలసల
గాజువాక, న్యూస్‌లైన్ : విశాఖ డెయిరీ పాల ధర లీటరుకు రూ.2లు పెరగనుంది. ఈ ధర సోమవారం నుంచే అమల్లోకి రానుంది. విశాఖ డెయిరీ గత ఏడాదిన్నర కాలంలో పాల ధరను నాలుగుసార్లు పెంచింది. ఆరు నెలలుగా అర లీటరు రూ.17 ఉన్న పాల ప్యాకెట్ ఇప్పుడు రూ.18కి చేరుకుంది. ఇప్పటికే అన్ని ధరలు పెరిగి ఉక్కిరిబిక్కిరవుతున్న ప్రజలకు ఇప్పుడు పాల ధర కూడా భారంగా మారనుంది. డెయిరీ యాజమాన్యం మునుపటిలాగా ఈసారి లీటరుకు రెండు రూపాయలు పెంచడం కాకుండా ఒక్కో పరిమాణానికి ఒక్కో విధంగా పెంచినట్టు తెలుస్తోంది. కొన్ని పాలపై రూపాయి, మరికొన్ని పాలపై రెండు రూపాయలు, ఇంకొన్ని పాలపై ఐదు రూపాయల వరకు ధర పెరిగిందని డెయిరీ వర్గాలు పేర్కొంటున్నాయి. ఈసారి 200 ఎం.ఎల్. ప్యాకెట్‌కు కూడా ధర పెంచారు. ఈ ప్యాకెట్లను లీటరు పరిమాణంలో తీసుకుంటే ఒకేసారి ఐదు రూపాయలు పెరిగినట్టవుతుంది. ఇటీవల రాష్ట్రంలో ఇంధన, పాల కొనుగోలు ధరలు, పాల రవాణా ఖర్చులు, ప్యాకింగ్ ఫిల్మ్ ధరలు, యంత్ర సామగ్రి, ప్రాసెసింగ్ చార్జీలు పెరిగి డెయిరీ నిర్వహణ ఖర్చులు భారీగా పెరిగాయని, ఈ నేపథ్యంలో డెయిరీ నిర్వహణ కష్టతరమవుతోందని యాజమాన్యం విడుదల చేసిన కరపత్రంలో పేర్కొంది.