బీజేపీలో పలువురి చేరిక | some political leaders are joined in bjp | Sakshi
Sakshi News home page

బీజేపీలో పలువురి చేరిక

Published Mon, Dec 1 2014 1:06 AM | Last Updated on Sat, Sep 2 2017 5:24 PM

బీజేపీలో పలువురి చేరిక

బీజేపీలో పలువురి చేరిక

లక్ష్మీపురం(గుంటూరు): విజయవాడలో కేంద్ర మంత్రులు ముప్పవరపు వెంకయ్యనాయుడు, రాజీవ్ ప్రతాప్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కంభంపాటి హరిబాబుల సమక్షంలో ఆదివారం మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో కడప, కృష్ణా, గుంటూరు జిల్లాలకు చెందిన పలువురు నేతలు బీజేపీలో చేరారు. పోరంకిలో జరిగిన సభ్యత్వ నమోదు ప్రారంభ కార్యక్రమంలో పార్టీలో చేరినవారిలో కృష్ణా జిల్లా డీసీసీ మాజీ అధ్యక్షుడు ఎం.అశోక్, కడప జిల్లా 2014 ఎన్నికల అభ్యర్థి బి.ప్రభాకర్, కృష్ణా జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ ఆర్.కృష్ణ, విజయవాడ సిటీ కాంగ్రెస్ అధ్యక్షుడు అడపా నాగేంద్రం, గుంటూరు జిల్లాకు చెందిన నేతలు తాళ్ళ వెంకటేష్ యాదవ్, చంగలి కిషోర్‌కుమార్, లాలం కోటయ్య, కె.వెంకట్, కళ్యాణం శ్రీనివాసరావు, ఎ.వెంకటరత్నం, నెల్లూరు చంద్రబాబు, కొమిరిశెట్టి సాంబశివరావు, ఎన్.మధుసూదనరావు, జి.కె.నాయుడు, షేక్ గౌస్ మొహిద్దీన్, కె.శ్రీనివాసరావు, పోటిశెట్టి శివయ్య, బొందలపాటి వెంకటేశ్వరరావు, దాసరి శ్రీమన్నారాయణ, ఆకుల వీరరాఘవయ్య, వణకూరి వీరరాఘవరెడ్డి, పల్లెటి మాధవ, సాధు సాంబశివరావు, శ్రీను నాయక్, చింతా సుబ్బారావు తదితరులు ఉన్నారు.

బీజేపీ సభ్యత్వం తీసుకున్న తాడిశెట్టి
కార్యక్రమంలో పార్టీ సభ్యత్వ నమోదు రసీదును కేంద్ర మంత్రులు వెంకయ్యనాయుడు, రాజీవ్ ప్రతాప్‌ల నుంచి గుంటూరు నగర మాజీ డిప్యూటీ మేయర్ తాడిశెట్టి మురళీమోహన్ అందుకున్నారు. పార్టీ అవసరాల నిమిత్తం 25 లాప్‌ట్యాప్‌లను వెంకయ్యనాయుడు చేతుల మీదుగా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కంభంపాటి హరిబాబుకు మురళి అందజేశారు. కార్యక్రమంలో కేంద్ర మాజీ మంత్రి కృష్ణంరాజు, రాష్ట్ర మంత్రులు కామినేని శ్రీనివాస్, పి. మాణిక్యాలరావు, ఎమ్మెల్యేలు విష్ణుకుమార్‌రాజ్, ఆకుల సత్యనారాయణ, గుంటూరు జిల్లా పార్టీ నేతలు జమ్ముల శ్యామ్‌కిషోర్, యడ్లపాటి రఘునాధబాబు, ఆర్.లక్ష్మీపతి, ఆలూరు కోటేశ్వరరావు, మాదా రాధ, మాజీ కార్పొరేటర్లు రేఖా శ్రీను, ఇంకొల్లు శ్రీను, అడపా కాశీవిశ్వనాధం, బి.రాంబాబు, సంబరాసు వాసు, బి.రత్నకుమారి, భారతీ వాసు, తోట మహేష్, జ్యోతిరాజు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement