విజయనగరం: విజయనగరం జిల్లా రామభద్రపురంలో దారుణం చోటు చేసుకుంది. భర్తను భార్యా పిల్లలు కలిసి చంపిన సంఘటన శనివారం రాత్రి చోటుచేసుకుంది. మద్యం సేవించి వచ్చిన కండి అప్పారావు(50) కుటుంబసభ్యులతో గురువారం గొడవపడ్డాడు. ఈ విషయమై 2 రోజులుగా వాదులాడుకుంటున్నారు. మద్యం మత్తులో ఉన్న తండ్రి తలపై తనయుడు కర్రతో మోది హతమార్చాడు. కొన ఊపిరితో ఉన్న అప్పారావును ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మరణించాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ప్రభుత్వాసుపత్రికి తరలించారు.