వెంకటాచలం, న్యూస్‌లైన్: వైఎస్సార్‌సీపీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డి తన తండ్రి వైఎస్ రాజశేఖరరెడ్డి కంటే మించిన వ్యక్తి అని పార్టీ సీఈసీ సభ్యుడు, సర్వేపల్లి నియోజకవర్గ సమన్వయకర్త కాకాణి గోవర్ధన్‌రెడ్డి అన్నారు. మండలంలోని పూడిపర్తి గ్రామంలో టీడీపీ, కాంగ్రెస్ పార్టీలకు చెందిన ప్రధాన నాయకులు ఆదివారం కాకాణి సమక్షంలో వైఎస్సార్‌సీపీలో చేరారు. కాకాణి మాట్లాడుతూ 2004 ఎన్నికల్లో ప్రజలకు సేవ చేయాలన్న ఆశయంతో వైఎస్సార్ అకుంఠిత దీక్షతో విజయం సాధించినట్టుగా ప్రస్తుతం జగన్‌మోహన్‌రెడ్డి ఆ విధంగానే ముం దుకు సాగుతున్నారన్నారు. సువర్ణ పాలన అందించడం జగన్‌తోనే సాధ్య మన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు తన మామ ఎన్టీఆర్‌ను వెన్నుపోటు పొడిచి అధికారంలోకి వచ్చి సంక్షేమ పథకాలకు తూట్లు పొడిచారని విమర్శించారు. స్థానిక ఎమ్మెల్యే ఆదాల ప్రభాకర్‌రెడ్డి నియోజకవర్గంలో చేసిన అభివృద్ధి శూన్యమన్నారు.
పదేళ్లుగా ఆదాల ఎమ్మెల్యేగా పనిచేస్తున్నారని, పూడిపర్తి ప్రధాన రహదారి అధ్వానంగా ఉండటాన్ని చూస్తే ఆయనకు గ్రామాల అభివృద్ధిపై ఉన్న ప్రేమ ఏపాటిదో అర్థమవుతోందన్నారు. వైఎస్సార్‌సీపీ ఎన్నికల గుర్తు ఫ్యాన్‌ను అందరూ గుర్తు పెట్టుకుని జగన్‌ను ముఖ్యమంత్రిని చేయాలని, తనను ఆశీర్వదించాలని కాకాణి కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యులు బిరుదవోలు శ్రీకాంత్‌రెడ్డి, మోపూరు భాస్కర్‌నాయుడు, శ్రీహరిరెడ్డి, నాశిన సురేష్, వెంపులూరి హరి, ఆలూరు సాయికిరణ్, అబ్దుల్‌కరీం పాల్గొన్నారు.
పూడిపర్తిలో ఆ రెండు పార్టీలు ఖాళీ
మహానేత వైఎస్సార్‌పై అభిమానం, వైఎస్ జగన్‌పై నమ్మకం, కాకాణి గోవర్ధన్‌రెడ్డి చేసిన అభివృద్ధి వెరసి పూడిపర్తిలోని కాంగ్రెస్, టీడీపీ నాయకులను వైఎస్సార్‌సీపీలో చేరేట్టు చేశాయి. మండలంలో ప్రధాన నాయకుడు వేమారెడ్డి శ్యాంసుందర్‌రెడ్డి వర్గీయులు కోడూరు కమలాకర్‌రెడ్డి, కోడూరు రఘునందన్‌రెడ్డి, కేతిరెడ్డి శ్రీనివాసులరెడ్డి, సర్పంచ్ నిర్మల, డక్కిలి రమణయ్య తదితర నాయకులు తమ అనుచరులతో కాకాణి ఆధ్వర్యంలో పార్టీలో చేరారు. అలాగే టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి అనుచరులు బుడంగుంట రామకృష్ణారెడ్డి, పోతిరెడ్డి సుధాకర్‌రెడ్డి, తోట కృష్ణయ్య, శ్రీనివాసులు, కోడూరు బలరామిరెడ్డి తమ అనుచరులతో పార్టీ తీర్థం పుచ్చుకున్నారు.
తండ్రిని మించిన తనయుడు జగన్
Published Mon, Jan 6 2014 5:51 AM | Last Updated on Mon, Mar 18 2019 7:55 PM
Advertisement
Advertisement