సోనియా రాజీనామా చేయాలి:జేసీ | sonia gandhi should be out from upa chair:jc diwakar reddy | Sakshi
Sakshi News home page

సోనియా రాజీనామా చేయాలి:జేసీ

Published Tue, Dec 10 2013 1:39 AM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM

సోనియా రాజీనామా చేయాలి:జేసీ - Sakshi

సోనియా రాజీనామా చేయాలి:జేసీ


తాడిపత్రి, న్యూస్‌లైన్: ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియా గాంధీ తన పదవికి రాజీనామా చేసి, మరొకరికి అవకాశం కల్పిస్తే మంచిదని మాజీ మంత్రి, తాడిపత్రి ఎమ్మెల్యే జేసీ దివాకర్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. రాహుల్ గాంధీకి పగ్గాలు అప్పగించినా.. పెద్దగా ఫలితముండదని, కొత్త వారికి అవకాశమిస్తే మంచిదని అభిప్రాయపడ్డారు. అనంతపురం జిల్లా తాడిపత్రిలో సోమవారం తన నివాసంలో ఆయన విలేకరులతో మాట్లాడారు.

ఆదివారం వెల్లడైన నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు భవిష్యత్తులో దేశమంతటా పునరావృతమవుతాయని జోస్యం చెప్పారు. ‘‘దేశంలో కాంగ్రెస్ పార్టీ పనైపోయింది. ఇక ఆ పార్టీ ఖాళీ అవుతోంది.. కాంగ్రెస్ పని గోవిందా.. గోవిందా..’’ అని వ్యాఖ్యానించారు. పార్లమెంట్‌లో అవిశ్వాసం పెట్టాలని స్పీకర్‌కు నోటీసు ఇచ్చిన ఎంపీలను అభినందిస్తున్నట్టు చెప్పారు. ప్రస్తుతం తనకు పార్టీ మారాల్సిన అవసరం లేదని, ఒక వేళ కొత్త పార్టీ వస్తే అప్పుడు అలోచిస్తా అని విలేకరులు అడిగిన ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement