అరసవల్లి, న్యూస్‌లైన్: త్వరలో అటవీ పోలీస్‌స్టేషన్లు ఏర్పాటు కానున్నాయని, సిబ్బంది భద్రతపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుందని విశాఖపట్నం సర్కిల్(విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం, పాడేరు, నర్సీపట్నం) కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ ఎ.భరత్‌కుమార్ చెప్పా రు. బుధవారం ఉదయం పట్టణ కేంద్రంలోని అటవీ శాఖ కార్యాలయాన్ని ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. అటవీ శాఖలో డీఎఫ్‌వో, రేంజర్ వరకు మాత్రమే కార్యాలయాలు ఉన్నాయని, మిగతా..సిబ్బంది ఫీల్డ్‌లోనే పనిచేస్తున్నారనిప్పారు. కొత్తగా వచ్చే అటవీ పోలీస్ స్టేషన్‌న్లలో బీట్, గార్డులు, ఆయుధాలతో కూడిన పోలీసు సిబ్బంది, వారి ఆయుధాలు ఉంటాయన్నారు. అడవుల్లో ఈ స్టేషన్లు ఉండడం వల్ల అక్కడి ప్రజలకు, ఇన్‌ఫార్మర్లకు మేలు జరుగుతుందని చెప్పారు. స్టేషన్ల ఏర్పాటుపై ఇంకా స్థల పరిశీలన జరగలేదన్నారు. తిరుపతి సంఘటన బాధాకరమన్నారు. శిక్షణ అనంతరమే సిబ్బందికి ఆయుధాలిస్తామన్నారు.
గ్రీన్ ఇండియా పైలట్ ప్రాజెక్టుగా పాడేరు
అటవీ ప్రాంతాల్లో సిబ్బంది పనితీరును పర్యవేక్షించేందుకు ఫ్లైయింగ్ స్క్వాడ్‌లు ఏర్పాటు చేసినట్లు భరత్‌కుమార్ చెప్పారు. దేశంలో చేపడుతున్న ‘గ్రీన్ ఇండియా ప్రాజెక్టు’కు రాష్ట్రంలోని పాడేరు పెలైట్ ప్రాజెక్టుగా ఎంపికైందని, దీని పరిధిలోని 23 వనసంరక్షణ కేంద్రాల్లో కార్యక్రమాన్ని చేపడుతున్నామన్నారు. అలాగే అరసకు వద్ద అంజోడులో జింకలను సంరక్షించే కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు. శ్రీకాకు ళం జిల్లాల్లో నాలుగు బేస్ క్యాంపులు, మొబైల్‌పార్టీలు, చెక్‌పోస్టుల ద్వారా కలప అక్రమ రవాణాను అడ్డుకుం టున్నామన్నారు.విశాఖ సర్కిల్‌లో ఇప్పటి వరకు రూ.1.50 కోట్ల అపరాధ రుసుం వసూలు చేశామని పేర్కొన్నారు. శాఖాపరంగా సిబ్బంది కొరత వేధిస్తోందన్నారు. త్వరలో విశాఖ సర్కిల్ 1100 మంది కొత్త ఉద్యోగులు రానున్నారని చెప్పారు.శ్రీకాకుళం జిల్లాకు 300 మంది ఉద్యోగులు వస్తున్నారన్నారు. అటవీ ప్రాంతాల్లో సిబ్బందికి కొత్త వాహనాలు సమకూరుస్తామన్నారు.
త్వరలో అటవీ పోలీస్ స్టేషన్లు
Published Thu, Jan 9 2014 3:58 AM | Last Updated on Sun, Sep 2 2018 4:46 PM
Advertisement