పాతపోస్టాఫీసు(విశాఖ దక్షిణ): అవినీతిని నిరోధించడానికి కేంద్ర విజిలెన్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ విభాగం కఠినమైన చట్టాలు రూపొందించిందని, త్వరలో ఇవి అమల్లోకి రానున్నాయని రాష్ట్ర అవినీతి నిరోధక శాఖ డైరెక్టర్ జనరల్ ఆర్.పి.ఠాకూర్ చెప్పారు. విశాఖ పోర్టు ట్రస్ట్(వీపీటీ), డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్(డీసీఐఎల్)లలో నిర్వహిస్తున్న నిఘా వారోత్సవాల ముగింపు సభ శనివారం పోర్టు సాంబమూర్తి ఆడిటోరియంలో జరిగింది. ఈ సందర్భంగా ముఖ్యఅతిథిగా ఠాకూర్ మాట్లాడుతూ అవినీతిపరులను గుర్తించడంలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అన్వేషిస్తున్నామన్నారు.
వీపీటీ చైర్మన్ ఎం.టి.కృష్ణబాబు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ అవినీతికి వ్యతిరేకంగా పోరాడాలని పిలుపునిచ్చారు. డీసీఐ సీఎండీ రాజేష్ త్రిపాఠి మాట్లాడుతూ సాంకేతికతను వినియోగించి అవినీతిని అదుపు చేయవచ్చునని అభిప్రాయపడ్డారు. కమర్షియల్ ట్యాక్స్ ప్రి న్సిపల్ కమిషనర్ హరేరాం మాట్లాడుతూ అవినీతి నిరోధించేందుకు అన్ని శాఖల పని తీరు పారదర్శకంగా ఉండాలన్నారు. వారో త్సవాల్లో భాగంగా ఇటీవల విద్యార్థులకు నిర్వహించిన చిత్ర లేఖన పోటీల్లో గెలు పొందిన విద్యార్థులకు బహుమతులు ప్రదా నం చేశారు. ఈ కార్యక్రమంలో పోర్టు డి ప్యూటీ చైర్మన్ పి.ఎల్. హరనాథ్, చీఫ్ విజిలె న్స్ అధికారి వి.వి. ఎస్.శ్రీనివాస్, వీపీటీ, డీసీఐ అధికారులు, ఉద్యోగులు పాల్గొన్నారు.
ఏఎంసీలో విజిలెన్స్ అవగాహన వారోత్సవాలు
పాతపోస్టాఫీసు(విశాఖ దక్షిణ): ఆంధ్రా వైద్య కళాశాలలో శనివారం విజిలెన్స్ అవగాహన వారోత్సవాలను నిర్వహించారు. ఏఎంసీ, హెచ్‌పీసీఎల్ సంయుక్తంగా చేపట్టిన ఈ వారోత్సవాల్లో అవినీతికి వ్యతిరేకంగా ప్రతి ఒక్కరూ పనిచేయాలని పిలుపునిచ్చారు. ఏఎంసీ ప్రిన్సిపాల్ డాక్టర్ పి.వి.సుధాకర్ ఆధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో కేజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ జి.అర్జున, హెచ్‌పీసీఎల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ జి.ఎస్.వి.ఎస్.ఎస్.ఎస్.ప్రసాద్‌శర్మ, కమ్యూనిటీ మెడిసిన్ డిపార్ట్‌మెంట్ ప్రొఫెసర్ డాక్టర్ బి.దేవి మాధవి, హెచ్‌పీసీఎల్ చీఫ్ మేనేజర్(పబ్లిక్ రిలేషన్స్) యు.ఎస్.శర్మ, చీఫ్ మేనేజర్(విజిలెన్స్) సురేష్‌బాబు, వివిధ శాఖల వైద్యులు, వైద్య విద్యార్థులు పాల్గొన్నారు. కార్యక్రమంలో భాగంగా వైద్య విద్యార్థులకు నిర్వహించిన వ్యాసరచన పోటీల్లో విజేతలకు బహుమతులు అందజేశారు.
నైతిక విలువలతో పారదర్శకత పెంపు
ఉక్కునగరం: ఉద్యోగుల్లో నైతిక విలువలు, సంస్థ పట్ల వైఖరి మార్పు చేయడం ద్వారా పారదర్శకత పెరుగుతుందని ఈస్ట్ కోస్ట్ రైల్వే డీఆర్‌ఎం ఎం.సి.మాథుర్ అన్నారు. స్టీల్‌ప్లాంట్ ఎంపీ హాలులో జరిగిన విజిలెన్స్ వారోత్సవ ముగింపు కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఉద్యోగుల్లో నిబద్ధత, భాగస్వామ్య వైఖరి పెంచడం వల్ల సంస్థ అభివృద్థి పథంలో నడుస్తుందన్నారు. స్టీల్‌ప్లాంట్ సీఎండీ పి.మధుసూదన్ మాట్లాడుతూ అవినీతి ప్రభావం సమాజంపై తీవ్రంగా ఉందన్నారు. ఇటీవల నిర్వహించిన వివిధ పోటీల విజేతలకు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో డైరెక్టర్లు పి.సి.మహాపాత్ర, రే చౌదరి, పి.కె.రథ్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment