మహబూబ్‌నగర్ క్రైం, న్యూస్‌లైన్: నేరాల ని యంత్రణకు పోలీసులు పకడ్బందీ చర్యలు తీ సుకోవాలని ఎస్పీ నాగేంద్రకుమార్ పోలీసు అ ధికారులు, సిబ్బందిని ఆదేశించారు. ఆయా పో లీస్‌స్టేషన్ల పరిధిలోని సమస్మాత్మక ప్రాంతాల ను గుర్తించి గస్తీ పెంచడం ద్వారా నేరాలను ని రోధించగలమన్నారు. గ్రామ పర్యటనను ఒక క్రమపద్ధతిలో నిర్వహించాలని కోరారు. శని వారం జిల్లాకేంద్రంలోని ఎస్పీ కార్యాలయంలో జిల్లా పోలీసు అధికారులతో నెలవారీ నేర స మీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భం గా ఎస్పీ మాట్లాడుతూ.. నేరాల నియంత్రణ, నేర పరిశోధన, నేరస్తులకు శిక్ష అనే మూడు ప్ర ధానమైన అంశాలను దృష్టిలో ఉంచుకుని ముందుకుసాగాలని సూచించారు. కొన్ని గ్రా మాల్లో భూముల క్రమవిక్రయాల్లో తలదూర్చి ఆరాచకం సృష్టిస్తున్న వ్యక్తుల వివరాలు తన దృష్టికి వచ్చాయని, అటువంటి వారు తమ పద్ధతులు మానుకోకపోతే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
డివిజన్ల వారీగా నేర సమీక్షిస్తూ.. ఇటీవల జరిగిన హత్య, వాహనాలు, పశువుల దొంగత నాల కేసుల్లో నిందితులను అరెస్ట్ చేయడం ప ట్ల ఎస్పీ సంతృప్తి వ్యక్తం చేశారు. ఏకే 47 తుపాకీని అపహరించిన నిందితుడిని త్వర లోనే పట్టుకుంటామని, దర్యాప్తు వివరాలను గోప్యంగా ఉంచాలని సూచించారు. ఇద్దరు ఉగ్రవాదుల అరెస్టు నేపథ్యంలో అనుమానిత ప్రాంతాల్లో ని ఘా పెంచుతున్నట్లు చెప్పారు. పోలీస్‌స్టేషన్లలో రికార్డులను క్రమపద్ధతిలో ఉంచుకోవాలని కో రారు. రానున్న వినాయకచవితి పర్వదినాన్ని పురస్కరించుకుని ముందస్తు జాగ్రత్తలు, శాం తికమిటీలతో సమావేశాలు, యువకులతో క మిటీలు ఏర్పాటుచేసి శాంతియుత వాతావరణం నెలకొల్పాలని ఆదేశించారు.
దర్యాప్తు వి షయంలో మనకు అందిన సమాచారాన్ని క్రోడీకరించుకుని, అవసరమైతే వ్యక్తిగతంగా సమాచారం సేకరించేందుకు సిద్ధపడాలని ఎస్పీ నా గేంద్రకుమార్ పోలీసు అధికారులకు హితబోధ చేశారు. మారుతున్న పరిస్థితులకు అనుగుణం గా మన వృత్తి నైపుణ్యాలను పెంచుకోవడం ద్వారా విజయాలు సాధిస్తామన్నారు. సమావేశంలో ఏఎస్పీ ప్రదీప్‌రెడ్డి, డీఎస్పీలు బి. మల్లికార్జున్, బాలాదేవి, శ్రీనివాస్‌రెడ్డి, గోవింద్‌రెడ్డి, భరత్, సీఐలు అప్పలనాయుడు, బాలాజీ, వెం కటేశ్వర్లు, బాల్‌రెడ్డి, అధికారులు పాల్గొన్నారు.
అరాచక శక్తుల ఆటకట్టించండి
Published Sun, Sep 1 2013 5:59 AM | Last Updated on Wed, Apr 3 2019 8:51 PM
Advertisement
Advertisement