SP nagendrakumar
-
ప్రజలతో కలిసి పనిచేయాలి
పాలమూరు : పోలీసులు ప్రజలతో కలిసి పనిచేయాలని.. శాంతిభద్రతల పరిరక్షణే ప్రథమ కర్తవ్యమని జిల్లా నూతన ఎస్పీ శివప్రసాద్ అన్నారు. గురువారం ఆయన బదిలీ అయిన ఎస్పీ నాగేంద్రకుమార్ నుంచి జిల్లా ఎస్పీగా బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో ఇతర వర్గాలతో సమానంగానే సామాన్య, పేదవర్గాల వారికి పోలీసు సేవలు అందుతాయన్నారు. శాఖాపరంగా ఫ్రెండ్లీ పోలీస్ విధానాన్ని అమలు చేస్తున్నారని, అందులో ఏవైనా లోటుపాట్లు ఉంటే సరిదిద్ది ప్రజాసేవలో పోలీసులను భాగస్వామ్యులను చేస్తానని పేర్కొన్నారు. పోలీసులకు ఏవైనా ఇబ్బందులుంటే తక్షణం తన దృష్టికి తీసుకురావాలన్నారు. ఆయా పోలీస్ స్టేషన్లలో కేసులు పెండింగ్ లేకుండా జాగ్రత్త వహిస్తామని, పోలీస్ శాఖలోని అన్ని స్థా యిల అధికారులు, సిబ్బంది ప్రజలతో కలిసిపోయి పనిచేయాలని, సామాజిక సే వా దృక్పథంతో ఈ వృత్తిలో కొనసాగాలన్నారు. పోలీస్ స్టేషన్లలో ఎస్ఐ, సీఐ, ఆ పై అధికారుల స్థాయిలో న్యాయం జరగకుంటే బాధితులు నేరుగా తన వద్దకు వచ్చి సమస్యలు చెప్పాలన్నారు. వృత్తిపరంగా జిల్లా ఎస్పీ స్థాయిలో ఉన్నప్పటికీ అటు సామాన్య ప్రజలు, పోలీసు శాఖలోని కింది స్థాయి సిబ్బందికి సైతం ఎప్పుడూ అందుబాటులో ఉంటూ వారి సమస్యలను పరిష్కరించేందుకు పాటుపడతానన్నారు. గతంలో మాదిరిగానే ప్రజా ఫిర్యాదుల పరిష్కారం కోసం ప్రతిసోమవారం గ్రీవెన్స్ సెల్‌ను కొనసాగిస్తామన్నారు. జిల్లాలో శాంతి భద్రతలను నెలకొల్పేందుకు శాఖాపరంగా అన్ని స్థాయిల్లోని సిబ్బంది కలుపుకొని పనిచేస్తామన్నారు. జిల్లా వ్యాప్తంగా అన్ని పోలీస్ స్టేషన్లు, సర్కిల్ల పరిధిలో కేసుల నమోదు, వాటి పరిష్కారం సకాలంలో జరిగే విధంగా దృష్టి పెడతామన్నారు. -
గీత.. దాటొద్దు
మహబూబ్‌నగర్ : మున్సిపల్, సాధారణ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల ప్రవర్తనా నియమావళి (మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్)ను అతిక్రమించే వారిపై కఠిన చర్యలు తప్పవని జిల్లా కలెక్టర్ గిరిజా శంకర్ స్పష్టం చేశారు. ఎస్పీ నాగేంద్ర కుమార్, అదనపు జేసీ రాజారాం పున్నాతో కలిసి బుధవారం విలేకరులతో మాట్లాడారు. సాధారణ, మున్సిపల్ ఎన్నికల నిర్వహణ దిశగా అధికార యంత్రాంగం చేపట్టిన చర్యలను వివరించారు. సాధారణ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ మొదలయ్యే వరకు కొత్త ఓటర్ల నమోదు కార్యక్రమం కొనసాగుతుందని ప్రకటించారు. ఈ నెల 9న బూత్ స్థాయిలో ఓటర్ల నమోదుకు ప్రత్యేక డ్రైవ్ చేపడుతున్నట్లు వెల్లడించారు. జిల్లాలోని 3248 పోలింగ్ కేంద్రాల్లో పోలింగ్ సజావుగా నిర్వహించేందుకు విద్యుత్, తాగునీరు, మూత్రశాలలు తదితర మౌళిక సౌకర్యాల కల్పనపై ప్రత్యేక దృష్టి సారించామన్నారు. ఎన్నికల సంఘం నుంచి అందిన ఆదేశాలను తుచ తప్పకుండా అమలు చేస్తామన్నారు. మద్యం, నగదు పంపిణీ ఏ రూపంలో వున్నా అరికట్టేలా ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశామన్నారు. పోలీసు, అటవీ, రెవెన్యూ విభాగాల అధికారులకు కోడ్ పర్యవేక్షణ బాధ్యత అప్పగించినట్లు కలెక్టర్ గిరిజా శంకర్ వెల్లడించారు. మహిళా స్వయం సహాయక బృందాల ఖాతాలపై ప్రత్యేక నిఘా వేయాల్సిందిగా బ్యాంకర్లను అప్రమత్తం చేశామన్నారు. అనుమతి లేని వాహనాలు సీజ్ అనుమతి లేకుండా పార్టీ పతాకాలతో తిరిగే వాహనాలను సీజ్ చేస్తామని ఎస్పీ నాగేంద్ర కుమార్ హెచ్చరించారు. ఎన్నికల ప్రచార సామగ్రిపై ప్రచురణ కర్తల చిరునామా, ప్రతుల సంఖ్య తదితర వివరాలు తప్పనిసరిగా ఉండాలన్నారు. ఎన్నికల కోడ్ అమలు తీరుపై క్షేత్ర స్థాయి పోలీసు అధికారులకు శిక్షణ ఇస్తున్నట్లు వెల్లడించారు. మద్యం పంపిణీపై పటిష్ట నిఘా వేయడంతో పాటు కిరాణా షాపులు, నల్ల బెల్లం విక్రయించే దుకాణాలపై దృష్టి సారిస్తామన్నారు. బందోబస్తు కోసం ఇతర జిల్లాలతో పాటు, కేంద్ర బలగాలు కూడా జిల్లాకు వస్తున్నట్లు ఎస్పీ వెల్లడించారు. -
హై అలర్ట్
మున్సి‘పోల్’, సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో జిల్లాలో పోలీసు శాఖ అలర్ట్ అయింది. ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు ఇప్పటి నుంచే కసరత్తు మొదలుపెట్టింది. ఇందుకోసం ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. సమస్యాత్మక ప్రాంతాలను అంచనా వేయడంతో పాటు, మద్యం దుకాణాలపై దృష్టి సారించారు. ఎప్పటికప్పుడు ముఖ్య అధికారులతో సమీక్షలు నిర్వహిస్తున్నారు. మహబూబ్‌నగర్ క్రైం: ఎన్నికల సంఘం ఆదేశించక ముందు శాంతి భద్రతలపై జిల్లా పోలీసు బాస్ దృష్టి కేంద్రీకరించా రు. ఎన్నికల్లో ఖాకీలకు ఎలాంటి మచ్చ అంటుకోకుండా తగిన కసరత్తు చేస్తున్నారు. ప్రజలు ఓటు హక్కును నిర్భయంగా వినియోగించేందుకు శాంతి యుత వాతావరణాన్ని ఉండేలా కృషి చేస్తున్నారు. జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో పెరిగిపోతున్న నేర ప్రవృత్తి, ఉపయోగించే కండ, ధన బలంపై పోలీసు యంత్రాంగం అంచనా వేసేందుకు సిద్ధమవుతోంది. గతంలో జరిగిన ఎన్నికలకు సంబంధించి నేరాలపై దృష్టి పెట్టి, జిల్లాలో పీఎస్‌ల వారీగా జాబితాను తయారు చేస్తున్నారు. ఎన్నికల కమిషన్ అడిగిన వెంటనే ముందుంచేందుకు గత రెండు ఎన్నికల్లో జరిగిన నేరాలపై చిట్టా తయారు చేస్తున్నారు. ఆయుధాలు, మద్యం దుకాణాలపై ఆరా... జిల్లాలో ఆయుధాలు విక్రయించే దుకాణాలు, ముందు గుండు విక్రయాలు, వినియోగదారులపై దృష్టి పెట్టారు. లెసైన్స్ లేని వారి జాబితాను సిద్ధం చేశారు. ఆయుధాలు మందు గుండు సామగ్రి రవాణాతో పాటు లెసైన్స్ కలిగిన వారిపై ఏవైనా కేసులు నమోదయ్యాయా అని ఆరా తీస్తున్నారు. జిల్లాలో ఉన్న క్వారీలు, అందులోని నిల్వల సమాచారం సేకరిస్తున్నారు. అక్రమ సారా దుకాణాలు, బెల్టు షాపులు, కల్తీ కల్లు కేంద్రాలను గుర్తించే పనిలో నిమగ్నమయ్యారు. వీటికి సంబంధించిన సమాచారం పోలీసుల వద్ద ఉంది. ఇప్పటికే కలెక్టర్ గిరిజాశంకర్ అనుమతిలేని మద్యం దుకాణాలపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ నేపథ్యంలో పోలీసు, ఎక్సైజ్ శాఖలు ఆపనిలోనే ఉన్నారు. సమస్యాత్మక గ్రామాలపై అంచనా... జిల్లా సమస్యాత్మక గ్రామాలను గుర్తించేందుకు చురుగ్గా పని చేస్తున్నారు. వ్యక్తిగత కక్షలు, రాజకీయ కక్షలపై ఆరా తీస్తున్నారు. కుల ఆధిపత్య పోరు ఏవిధంగా ఉందనే సమాచారం సేకరిస్తున్నారు. గ్రామాల సమచారాన్ని ఇచ్చేందుకు అవసరమైన వ్యక్తులను ఏర్పాటు చేసుకుని పనిలో నిమగ్నమయ్యారు. ఎప్పుడూ గ్రామాలను సందర్శించని పోలీసులు ప్రస్తుతం పల్లెబాట పట్టి, అక్కడ మైత్రి సంఘాలను ఏర్పాటు చేసేయత్నంలో ఉన్నారు. గత ఎన్నికల్లో శాంతి భద్రతలకు విఘాతం కలిగించిన వారిపై కూడా నిఘా పెంచారు. గ్రామాల వారీగా ఉన్న ముద్దాయిల జాబితాల దుమ్ముదులుపుతున్నారు. నేర చరిత, రౌడీ షీటర్లు జాబితాను తయారు చేస్తున్నారు. పాత నేరస్తుల కదలికలను గమనిస్తున్నారు. మావోయిస్టు ప్రాబల్యం ఉన్న ప్రాంతాలు, సమస్యాత్మక గ్రామాల బందోబస్తుపై ప్రత్యేక ప్రణాళిక రూపొందిస్తున్నారు. మొత్తానికి పోలీసు శాఖ ముందే కసర త్తు ప్రారంభించడం అభినందనీయం. నేటి నుంచి జిల్లాలో 30 పోలీసు యాక్ట్ జిల్లాలో మంగళవారం నుంచి 30 పోలీసు యాక్ట్‌ను అమలు చేయాల్సిందిగా ఎస్పీ నాగేంద్రకుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడటంతో జిల్లా పోలీసులు చర్యలు చేపట్టాలన్నారు. ఇప్పటికే జిల్లాలోని అన్ని పోలీసు స్టేషన్లు, ఇతర అధికారుల కార్యాలయాల్లో హైఫ్రీక్వెన్సి వైర్లెస్ సెట్లను ఏర్పాటు పూర్తి చేయాలన్నారు. పోలీసుల అనుమతి లేనిదే ఎలాంటి సమావేశాలు, ర్యాలీలు, ధర్నాలు నిర్వహించరాదని సూచించారు. శాంతి భద్రతల పరిరక్షణలో పూర్తిస్థాయిలో చర్యలు తీసుకుంటున్నామని, ప్రజలు కూడా సహకరించాలని ఎస్పీ కోరారు. -
అరాచక శక్తుల ఆటకట్టించండి
మహబూబ్‌నగర్ క్రైం, న్యూస్‌లైన్: నేరాల ని యంత్రణకు పోలీసులు పకడ్బందీ చర్యలు తీ సుకోవాలని ఎస్పీ నాగేంద్రకుమార్ పోలీసు అ ధికారులు, సిబ్బందిని ఆదేశించారు. ఆయా పో లీస్స్టేషన్ల పరిధిలోని సమస్మాత్మక ప్రాంతాల ను గుర్తించి గస్తీ పెంచడం ద్వారా నేరాలను ని రోధించగలమన్నారు. గ్రామ పర్యటనను ఒక క్రమపద్ధతిలో నిర్వహించాలని కోరారు. శని వారం జిల్లాకేంద్రంలోని ఎస్పీ కార్యాలయంలో జిల్లా పోలీసు అధికారులతో నెలవారీ నేర స మీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భం గా ఎస్పీ మాట్లాడుతూ.. నేరాల నియంత్రణ, నేర పరిశోధన, నేరస్తులకు శిక్ష అనే మూడు ప్ర ధానమైన అంశాలను దృష్టిలో ఉంచుకుని ముందుకుసాగాలని సూచించారు. కొన్ని గ్రా మాల్లో భూముల క్రమవిక్రయాల్లో తలదూర్చి ఆరాచకం సృష్టిస్తున్న వ్యక్తుల వివరాలు తన దృష్టికి వచ్చాయని, అటువంటి వారు తమ పద్ధతులు మానుకోకపోతే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. డివిజన్ల వారీగా నేర సమీక్షిస్తూ.. ఇటీవల జరిగిన హత్య, వాహనాలు, పశువుల దొంగత నాల కేసుల్లో నిందితులను అరెస్ట్ చేయడం ప ట్ల ఎస్పీ సంతృప్తి వ్యక్తం చేశారు. ఏకే 47 తుపాకీని అపహరించిన నిందితుడిని త్వర లోనే పట్టుకుంటామని, దర్యాప్తు వివరాలను గోప్యంగా ఉంచాలని సూచించారు. ఇద్దరు ఉగ్రవాదుల అరెస్టు నేపథ్యంలో అనుమానిత ప్రాంతాల్లో ని ఘా పెంచుతున్నట్లు చెప్పారు. పోలీస్స్టేషన్లలో రికార్డులను క్రమపద్ధతిలో ఉంచుకోవాలని కో రారు. రానున్న వినాయకచవితి పర్వదినాన్ని పురస్కరించుకుని ముందస్తు జాగ్రత్తలు, శాం తికమిటీలతో సమావేశాలు, యువకులతో క మిటీలు ఏర్పాటుచేసి శాంతియుత వాతావరణం నెలకొల్పాలని ఆదేశించారు. దర్యాప్తు వి షయంలో మనకు అందిన సమాచారాన్ని క్రోడీకరించుకుని, అవసరమైతే వ్యక్తిగతంగా సమాచారం సేకరించేందుకు సిద్ధపడాలని ఎస్పీ నా గేంద్రకుమార్ పోలీసు అధికారులకు హితబోధ చేశారు. మారుతున్న పరిస్థితులకు అనుగుణం గా మన వృత్తి నైపుణ్యాలను పెంచుకోవడం ద్వారా విజయాలు సాధిస్తామన్నారు. సమావేశంలో ఏఎస్పీ ప్రదీప్‌రెడ్డి, డీఎస్పీలు బి. మల్లికార్జున్, బాలాదేవి, శ్రీనివాస్‌రెడ్డి, గోవింద్‌రెడ్డి, భరత్, సీఐలు అప్పలనాయుడు, బాలాజీ, వెం కటేశ్వర్లు, బాల్‌రెడ్డి, అధికారులు పాల్గొన్నారు. -
అరాచక శక్తుల ఆటకట్టించండి
మహబూబ్‌నగర్ క్రైం, న్యూస్‌లైన్: నేరాల ని యంత్రణకు పోలీసులు పకడ్బందీ చర్యలు తీ సుకోవాలని ఎస్పీ నాగేంద్రకుమార్ పోలీసు అ ధికారులు, సిబ్బందిని ఆదేశించారు. ఆయా పో లీస్స్టేషన్ల పరిధిలోని సమస్మాత్మక ప్రాంతాల ను గుర్తించి గస్తీ పెంచడం ద్వారా నేరాలను ని రోధించగలమన్నారు. గ్రామ పర్యటనను ఒక క్రమపద్ధతిలో నిర్వహించాలని కోరారు. శని వారం జిల్లాకేంద్రంలోని ఎస్పీ కార్యాలయంలో జిల్లా పోలీసు అధికారులతో నెలవారీ నేర స మీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భం గా ఎస్పీ మాట్లాడుతూ.. నేరాల నియంత్రణ, నేర పరిశోధన, నేరస్తులకు శిక్ష అనే మూడు ప్ర ధానమైన అంశాలను దృష్టిలో ఉంచుకుని ముందుకుసాగాలని సూచించారు. కొన్ని గ్రా మాల్లో భూముల క్రమవిక్రయాల్లో తలదూర్చి ఆరాచకం సృష్టిస్తున్న వ్యక్తుల వివరాలు తన దృష్టికి వచ్చాయని, అటువంటి వారు తమ పద్ధతులు మానుకోకపోతే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. డివిజన్ల వారీగా నేర సమీక్షిస్తూ.. ఇటీవల జరిగిన హత్య, వాహనాలు, పశువుల దొంగత నాల కేసుల్లో నిందితులను అరెస్ట్ చేయడం ప ట్ల ఎస్పీ సంతృప్తి వ్యక్తం చేశారు. ఏకే 47 తుపాకీని అపహరించిన నిందితుడిని త్వర లోనే పట్టుకుంటామని, దర్యాప్తు వివరాలను గోప్యంగా ఉంచాలని సూచించారు. ఇద్దరు ఉగ్రవాదుల అరెస్టు నేపథ్యంలో అనుమానిత ప్రాంతాల్లో ని ఘా పెంచుతున్నట్లు చెప్పారు. పోలీస్స్టేషన్లలో రికార్డులను క్రమపద్ధతిలో ఉంచుకోవాలని కో రారు. రానున్న వినాయకచవితి పర్వదినాన్ని పురస్కరించుకుని ముందస్తు జాగ్రత్తలు, శాం తికమిటీలతో సమావేశాలు, యువకులతో క మిటీలు ఏర్పాటుచేసి శాంతియుత వాతావరణం నెలకొల్పాలని ఆదేశించారు. దర్యాప్తు వి షయంలో మనకు అందిన సమాచారాన్ని క్రోడీకరించుకుని, అవసరమైతే వ్యక్తిగతంగా సమాచారం సేకరించేందుకు సిద్ధపడాలని ఎస్పీ నా గేంద్రకుమార్ పోలీసు అధికారులకు హితబోధ చేశారు. మారుతున్న పరిస్థితులకు అనుగుణం గా మన వృత్తి నైపుణ్యాలను పెంచుకోవడం ద్వారా విజయాలు సాధిస్తామన్నారు. సమావేశంలో ఏఎస్పీ ప్రదీప్‌రెడ్డి, డీఎస్పీలు బి. మల్లికార్జున్, బాలాదేవి, శ్రీనివాస్‌రెడ్డి, గోవింద్‌రెడ్డి, భరత్, సీఐలు అప్పలనాయుడు, బాలాజీ, వెం కటేశ్వర్లు, బాల్‌రెడ్డి, అధికారులు పాల్గొన్నారు.