
శాసనసభ స్పీకర్ నాదెండ్ల మనోహర్
హైదరాబాద్: విభజన బిల్లుపై ఓటింగ్ నిర్వహించాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు ఇచ్చిన వాయిదా తీర్మానాన్ని శాసనసభ స్పీకర్ నాదెండ్ల మనోహర్ తిరస్కరించారు. టిడిపి సభ్యుడు ప్రవేశపెట్టిన వాయిదా తీర్మానాన్ని కూడా స్పీకర్ తిరస్కరించారు. ఇరు ప్రాంతాల సభ్యుల ఆందోళనతో గందరగోళం మధ్య ప్రారంభమైన కొద్దిసేపటికే సభను స్పీకర్ గంటసేపు వాయిదా వేశారు.
సమైక్యాంధ్ర, తెలంగాణ పోటాపోటీ నినాదాలతో సభ దద్దరిల్లింది. ఇరుప్రాంతాల సభ్యులు పోడియంను చుట్టుముట్టారు. సభ సజావుగా నిర్వహించేందుకు సహకరించమని స్పీకర్ సభ్యులను కోరారు. ఫలితంలేదు. సభ్యుల నినాదాలతో గందరగోళ పరిస్థితి నెలకొంది. దాంతో సభను గంటసేపు వాయిదా వేశారు.