Assembly postpone
-
‘మహా’ అసెంబ్లీలో కరెంటు పోయింది!
నాగ్‌పూర్: భారీగా కురుస్తున్న వర్షాలకు విద్యుత్ అంతరాయం కలగడంతో శుక్రవారం మహారాష్ట్ర శాసనసభ స్తంభించింది. సభ ప్రారంభం కాకముందే సభను రేపటికి వాయిదా వేయాల్సి వచ్చింది. దీంతో బీజేపీ మిత్రపక్షమైన శివసేనతో పాటు విపక్షాలు ప్రభుత్వంపై విరుచుకుపడ్డాయి. శుక్రవారం ఉదయం శాసన సభ, మండలి ప్రారంభమైన కొద్ది సేపటికే సభలో చీకటి అలుముకోవడంతో ఒక రోజుకు వాయిదా పడింది. గురువారం రాత్రి నాగ్‌పూర్‌లో భారీ వర్షం కురిసింది. దీంతో అసెంబ్లీకి విద్యుత్ సరఫరా చేసే కేంద్రంలోకి భారీగా వర్షపు నీరు చేరడంతో విద్యుత్ సరఫరా ఆగిపోయింది. సభ ప్రారంభం కాగానే కాంగ్రెస్, ఎన్సీపీ సభ్యులు మాట్లాడాలని భావించినా విద్యుత్ లేకపోవడంతో మైకులు పనిచేయలేదు. మరమ్మతులు జరుగుతున్నాయని అసెంబ్లీ స్పీకర్ హరిభావ్ బాగ్దే సభను తొలుత గంటపాటు వాయిదా వేశారు. ఆ తర్వాత సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ అన్ని పార్టీల సభ్యులతో సమావేశమై ఒక రోజుకు వాయిదా వేసేలా నిర్ణయం తీసుకున్నారు. అనంతరం సీఎం మీడియాతో మాట్లాడుతూ.. ‘నగరంలో ఇప్పటికే రెండు మూడు సార్లు వర్షం పడింది. అయితే గురువారం రాత్రి మాత్రం భారీగా వర్షం పడింది. విద్యుత్ సరఫరా చేసే విభాగం సెల్లార్లో ఉండటంతో ఆ ప్రాంతం అంతా వర్షపు నీరు చేరింది. దీంతో విద్యుత్ కు అంతరాయం కలిగింది’అని చెప్పారు. నాగ్‌పూర్‌లో తొలిసారి వర్షాకాల సమావేశాలను నిర్వహించారు. -
ఓటింగ్‌పై వాయిదాతీర్మానం తిరస్కరించిన స్పీకర్
హైదరాబాద్: విభజన బిల్లుపై ఓటింగ్ నిర్వహించాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు ఇచ్చిన వాయిదా తీర్మానాన్ని శాసనసభ స్పీకర్ నాదెండ్ల మనోహర్ తిరస్కరించారు. టిడిపి సభ్యుడు ప్రవేశపెట్టిన వాయిదా తీర్మానాన్ని కూడా స్పీకర్ తిరస్కరించారు. ఇరు ప్రాంతాల సభ్యుల ఆందోళనతో గందరగోళం మధ్య ప్రారంభమైన కొద్దిసేపటికే సభను స్పీకర్ గంటసేపు వాయిదా వేశారు. సమైక్యాంధ్ర, తెలంగాణ పోటాపోటీ నినాదాలతో సభ దద్దరిల్లింది. ఇరుప్రాంతాల సభ్యులు పోడియంను చుట్టుముట్టారు. సభ సజావుగా నిర్వహించేందుకు సహకరించమని స్పీకర్ సభ్యులను కోరారు. ఫలితంలేదు. సభ్యుల నినాదాలతో గందరగోళ పరిస్థితి నెలకొంది. దాంతో సభను గంటసేపు వాయిదా వేశారు. -
అసెంబ్లీ సాగక కోటిన్నర వృథా
సాక్షి, హైదరాబాద్: శాసనసభ సమావేశాల ఒకరోజు నిర్వహణ ఖర్చు అక్షరాలా రూ.30 లక్షలు. అదీ.. రోజూ ఉదయం నుంచి మధ్యాహ్నం వరకూ జరిగి.. వాయిదా పడినపుడే. ఆ గడువునే సభకు ఒక రోజుగా పరిగణిస్తారు. ఒకరోజులో సభ జరిగేది సగటున అయిదు గంటలే. ఈ లెక్కన శాసనసభ సమావేశాల ఖర్చు నిమిషానికి రూ. 10 వేలు. ఈ నెల 12 నుంచి 19 వరకూ తొలివిడత సమావేశాల ఖర్చు అక్షరాలా కోటీ 80 లక్షల రూపాయలు. తొలి విడత ఆరు రోజులూ రోజూ సగటున ఐదు గంటల చొప్పున సభ జరగాల్సి ఉంది. తొలిరోజు మండేలాకు సంతాపం తెలిపి సభ వాయిదా పడింది. మిగిలిన 5 రోజుల సభ వ్యవధి పూర్తిగా వృధా అయినట్టు రికార్డులు చెబుతున్నాయి. సంతాప తీర్మానంపై సభ గంటా 51 నిమిషాలు జరిగింది. మిగిలిన 5 రోజులు గందరగోళంతో వాయిదా పడడంతో గంటకు రూ. 30 లక్షల చొప్పున మొత్తం రూ. కోటిన్నర ప్రజాధనం వృధా అయినట్టేనని అసెంబ్లీ వర్గాలు అంచనా వేశాయి.