హైదరాబాద్ : వైఎస్ఆర్ కాంగ్రెస్ సభ్యుల నిరసనల మధ్య ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు గురువారానికి వాయిదా పడ్డాయి. అత్యంత కీలకమైన శివరామకృష్ణ కమిటీ నివేదిక, రాజధాని ఎంపికపై చర్చ జరగాలని ప్రధాన ప్రతిపక్షం పదే పదే కోరింది. ఈ మేరకు పార్టీ సభ్యులు స్పీకర్‌కు పదే పదే విజ్ఞప్తి చేశారు.
అయితే స్పీకర్ సానుకూలంగా స్పందించకపోవటంతో సభ్యులు పోడియం చుట్టుముట్టి నిరసన తెలిపారు. మరోవైపు స్పీకర్ సూచన మేరకు మంత్రులు బడ్జెట్ డిమాండ్లపై తీర్మానాలు కోరారు. ఓవైపు సభ్యులు నినాదాలు.. మరోవైపు మంత్రుల తీర్మానాలతో సభలో గందరగోళం ఏర్పడింది. దీంతో స్పీకర్ సభను రేపటికి వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు.