
సాక్షి, విశాఖ : శాసన మండలి రద్దు తీర్మానాన్ని కేంద్రానికి పంపించామని స్పీకర్ తమ్మినేని సీతారాం తెలిపారు. ఆయన శుక్రవారం విశాఖ విమానాశ్రయంలో మీడియాతో మాట్లాడుతూ.. ‘కేంద్రానికి ఉన్న నిబంధనల ప్రకారమే అన్ని జరుగుతాయి. చట్టం ఎవరికీ చుట్టం కాదు. ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో మండలిని రద్దు చేశారు. రాజధాని రైతులతో ప్రభుత్వం వేసిన కమిటీ మాట్లాడుతుంది. రైతులతో పాటు రైతు కూలీలకు కూడా పెన్షన్ అందచేస్తామని శాసన సభ వేదికగా ప్రకటించారు. కృత్రిమ ఉద్యమాల గురించి నేను మాట్లాడను. నిజంగా ఉద్యం జరిగితే దానికి అందరు మద్దతిద్దాం’ అని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment