పుష్కరాల్లో విద్యుత్ సిబ్బందికి డ్రెస్ కోడ్ | Special Dress Code for AP EPDCL Team | Sakshi
Sakshi News home page

పుష్కరాల్లో విద్యుత్ సిబ్బందికి డ్రెస్ కోడ్

Published Tue, Jul 7 2015 6:17 PM | Last Updated on Sat, Aug 18 2018 6:29 PM

Special Dress Code for AP EPDCL Team

విశాఖపట్నం : గోదావరి పుష్కరాల్లో ప్రత్యేక విధులు నిర్వర్తించే ఆంధ్రప్రదేశ్ తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ(ఏపీ ఈపీడీసీఎల్) సిబ్బంది ఒకే రకమైన దుస్తులు ధరించనున్నారు. పుష్కరాల్లో ఒక్కో ప్రభుత్వ విభాగానికి ఒక్కో డ్రెస్‌ కోడ్ ఉండాలని సీఎం చంద్రబాబు ఇటీవల సూచించడంతో ఏ దుస్తులు ఉండాలనేదానిపై ఉద్యోగుల నుంచి సీఎండీ అభిప్రాయాలు సేకరించి చివరికి నీలం, నలుపు రంగు దుస్తులను ఎంపిక చేశారు. పురుషులు నేవీ బ్లూ షర్ట్, బ్లాక్ ప్యాంట్, మహిళలు నేవీ బ్లూ చీర,  జాకెట్ ధరించాలని సీఎండీ ఆర్.ముత్యాలరాజు మంగళవారం ఆదేశించారు.

ఈ రకమైన రెండు జతల దుస్తులను ప్రతీ ఉద్యోగి పుష్కరాల విధులకు తెచ్చుకోవాలని సూచించారు. దుస్తులకు అయ్యే ఖర్చు రూ.1200 ఉద్యోగి జీతంతో కలిపి అందిస్తామని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఈ నెల 14వ తేదీ నుంచి 25వ తేదీ వరకూ జరిగే గోదావరి పుష్కరాల్లో 1800 మంది ఈపీడీసీఎల్ సిబ్బంది సేవలు అందించనున్నారు. ఎవరెవరు ఏ విధులు నిర్వర్తించాలనే దానిపై కమిటీల వారీగా ఇప్పటికే స్పష్టంగా ఆదేశాలు వెలువడ్డాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement