శ్రీకాకుళం పాతబస్టాండ్ : ప్రత్యేక హోదా వల్ల రాష్ట్రానికి నిధులు రావని, పన్నుల మినహాయింపు మాత్రమే ఉంటుందని ప్రభుత్వ విప్ కూన రవికుమార్ అన్నారు. అభివృద్ధికి ప్రత్యేక గ్రాంట్లు అవసరమైనందున వాటి సాధనకు కృషి చేస్తున్నామన్నారు. ఆర్ అండ్ బీ బంగ్లాలో గురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం అడ్డగోలుగా రాష్ట్ర విభజన చేసిందన్నారు. నాడు విభజన చట్టంలో లేని ప్రత్యేక హోదా ప్రస్తావన నేడు ఎలా వస్తుందని కాంగ్రెస్ నాయకులు విమర్శిస్తున్నారని ప్రశ్నించారు.
విభజన చట్టం సరిగ్గా లేనందున మన ఆస్తులు తెలంగాణాలో ఉండిపోయాయన్నారు. పోలవరం విషయంలోనూ తప్పులు చేశారని తెలిపారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆంధ్రప్రదేశ్ ఉద్యోగులను, ప్రభుత్వాన్ని ఇబ్బందులకు గురి చేస్తున్నారని, దానికి కొంతమంది వంత పాడుతున్నారని విమర్శించారు. రాష్ట్రంలో వెనుకబడిన ఏడు జిల్లాలకు ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వనున్నామని, కేంద్ర ప్రభుత్వం 3 వందల కోట్ల రూపాయలు ఆర్థిక సాయం చేసిందని తెలిపారు. రాజధాని అభివృద్ధికి నిధులిస్తామని ప్రధాని మోడీ చెప్పారని, ఆయన మాట నిలబెట్టుకుంటారని అన్నారు. జన్మభూమి కమిటీలు కేవలం గ్రామాల అభివృద్ధి కోసమే ఏర్పాటు చేశామన్నారు.
ప్రత్యేక నిధుల సాధనే లక్ష్యం
Published Fri, Aug 7 2015 12:06 AM | Last Updated on Mon, Mar 18 2019 8:51 PM
Advertisement