కర్నూలు(కలెక్టరేట్), న్యూస్‌లైన్: నగర, పట్టణ ప్రాంతాల్లోని మురికివాడల్లో నివసించే ప్రజల ఆరోగ్య పరిరక్షణ కోసం ప్రత్యేక వైద్యశిబిరాలు నిర్వహించాలని మెప్మా అధికారులను కలెక్టర్ సి.సుదర్శన్‌రెడ్డి ఆదేశించారు. శుక్రవారం కలెక్టర్ తన చాంబర్‌లో వైద్యశిబిరాల నిర్వహణపై మెప్మా అధికారులతో సమీక్ష నిర్వహించారు. జిల్లాలో 10 మెడికల్ క్యాంపులు మాత్రమే నిర్వహించాల్సి ఉందని, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారితో కో-ఆర్డినేషన్ చేసుకుని వాటిని ఏర్పాటు చేసుకోవాలని అన్నారు. కర్నూలు నగరపాలక సంస్థలో 2, నంద్యాల మున్సిపాలిటీలో 2 నిర్వహించాలని తెలిపారు. ఆదోని, బనగానపల్లె, ఆత్మకూరు, ఆళ్లగడ్డ, ఎమ్మిగనూరు, డోన్ మున్సిపాలిటీల్లో ఒక్కో క్యాంపు మాత్రమే ఏర్పాటు చేయాలన్నారు.
నందికొట్కూరు, గూడూరుకు చెందిన మురికివాడల ప్రజలను కర్నూలులో జరిగే మెడికల్ క్యాంపులకు తీసుకురావాలని సూచించారు. మెడికల్ క్యాంపుల్లో మురికివాడల్లో నివసిస్తున్న ప్రజలందరికీ రక్తపరీక్షలు, విటమిన్ పరీక్షలు నిర్వహించడంతో పాటు వ్యాధి నిరోధక టీకాలు వేయాలని తెలిపారు. రక్త, విటమిన్ పరీక్షలను బట్టి వైద్యసేవలు అందించాలని తెలిపారు. జనవరి నెల చివరిలోపు ప్రక్రియ పూర్తి చేయాలని సూచించారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ కన్నబాబు, మెప్మా పీడీ రామాంజనేయులు, మున్సిపల్ కమిషనర్ సత్యనారాయణమూర్తి తదితరులు పాల్గొన్నారు.
మురికివాడల్లో ప్రత్యేక వైద్యశిబిరాలు
Published Sat, Dec 7 2013 5:46 AM | Last Updated on Sat, Sep 2 2017 1:22 AM
Advertisement
Advertisement