satya narayanamurty
-
వీరు గెలవరు, ఎదుటివాళ్లని గెలవనివ్వరు..
నక్కపల్లి/పాయకరావుపేట: ఆ ఇద్దరు అన్నదమ్ములు చిరంజీవి, పవన్‌కళ్యాణ్ వల్లే రెండుసార్లు ఓడిపోయామని మాజీమంత్రి, టీడీపీ సీనియర్ నేత బండారు సత్యనారాయణమూర్తి అక్కసు వెళ్లగక్కారు. భవిష్యత్‌కు గ్యారంటీ చైతన్యరథం పేరుతో టీడీపీ నాయకులు చేపట్టిన ఉత్తరాంధ్ర బస్సుయాత్ర గురువారం టీడీపీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్యే వంగలపూడి అనిత ఆధ్వర్యంలో అనకాపల్లి జిల్లా పాయకరావుపేట నుంచి ప్రారంభమైంది. ఈ సందర్భంగా పాయకరావుపేటలో నిర్వహించిన బహిరంగ సమావేశంలో బండారు సత్యనారాయణమూర్తి మాట్లాడుతూ 2009లో చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీ వల్ల, 2019లో పవన్‌కళ్యాణ్ పెట్టిన జనసేన పార్టీ వల్ల రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ ఓటమి పాలయిందని చెప్పారు. వీరు గెలవరు, ఎదుటివాళ్లని గెలవనివ్వరు.. అన్న చందాన పరిస్థితులు తయారు చేశారన్నారు. ఈ రెండు పార్టీల వల్ల తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షానికే పరిమితం కావాల్సి వచ్చిందని ఆయన పేర్కొన్నారు. ఒక్కొక్కడి సంగతి తేలుస్తాం.. మాజీమంత్రి అయ్యన్నపాత్రుడు మాట్లాడుతూ తాము అధికారంలోకి వచ్చిన వెంటనే పోలీసుల పని పడతామని చెప్పారు. ‘అధికార పార్టీకి కొమ్ముకాసిన పోలీసులెవ్వరినీ వదిలే ప్రసక్తి లేదు. ఒక్కొక్కడి సంగతి తేలుస్తాం. ఎవరెవరు అధికారపార్టీకి అనుకూలంగా పనిచేశారో అందరి జాబితాలు మా వద్ద ఉన్నాయి. అధికారం చేపట్టిన మరుసటి రోజు నుంచే శుక్ర, శని, ఆదివారాల్లో అక్రమ కట్టడాల కూల్చివేత కార్యక్రమం ప్రారంభిస్తాం. జగన్ పార్టీపై కక్షతీర్చుకోవడమే లక్ష్యం. వైఎస్సార్సీపీ నాయకులంతా శాడిస్ట్ నా కొడుకులు..’ అని పేర్కొన్నారు. విశాఖలో ఎంపీ కుటుంబం కిడ్నాప్‌నకు గురైతే ఏం చేయలేని వ్యక్తి సీఎంగా ఉండడం దారుణమన్నారు. టీడీపీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు కిమిడి కళావెంకటరావు మాట్లాడుతూ సీఎం జగన్మోహన్రెడ్డి రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశారని, అప్పుల అప్పారావు మాదిరిగా తయారయ్యారని విమర్శించారు. టీడీపీ హయాంలో ఉద్దండపురం వద్ద వాటర్ గ్రిడ్ నిర్మిస్తే పూర్తిచేయలేని దుస్థితిలో ప్రభుత్వం ఉందని చెప్పారు. ఉద్దండపురం వాటర్ గ్రిడ్ వద్ద వీరంతా సెల్ఫీ దిగారు. ఈ సమావేశంలో మాజీ స్పీకర్ ప్రతిభాభారతి, మాజీ ఎమ్మెల్సీ బుద్ద నాగ జగదీ‹Ù, మాజీ ఎమ్యెల్యేలు పప్పల చలపతిరావు, పల్లా శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. -
మురికివాడల్లో ప్రత్యేక వైద్యశిబిరాలు
కర్నూలు(కలెక్టరేట్), న్యూస్‌లైన్: నగర, పట్టణ ప్రాంతాల్లోని మురికివాడల్లో నివసించే ప్రజల ఆరోగ్య పరిరక్షణ కోసం ప్రత్యేక వైద్యశిబిరాలు నిర్వహించాలని మెప్మా అధికారులను కలెక్టర్ సి.సుదర్శన్‌రెడ్డి ఆదేశించారు. శుక్రవారం కలెక్టర్ తన చాంబర్లో వైద్యశిబిరాల నిర్వహణపై మెప్మా అధికారులతో సమీక్ష నిర్వహించారు. జిల్లాలో 10 మెడికల్ క్యాంపులు మాత్రమే నిర్వహించాల్సి ఉందని, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారితో కో-ఆర్డినేషన్ చేసుకుని వాటిని ఏర్పాటు చేసుకోవాలని అన్నారు. కర్నూలు నగరపాలక సంస్థలో 2, నంద్యాల మున్సిపాలిటీలో 2 నిర్వహించాలని తెలిపారు. ఆదోని, బనగానపల్లె, ఆత్మకూరు, ఆళ్లగడ్డ, ఎమ్మిగనూరు, డోన్ మున్సిపాలిటీల్లో ఒక్కో క్యాంపు మాత్రమే ఏర్పాటు చేయాలన్నారు. నందికొట్కూరు, గూడూరుకు చెందిన మురికివాడల ప్రజలను కర్నూలులో జరిగే మెడికల్ క్యాంపులకు తీసుకురావాలని సూచించారు. మెడికల్ క్యాంపుల్లో మురికివాడల్లో నివసిస్తున్న ప్రజలందరికీ రక్తపరీక్షలు, విటమిన్ పరీక్షలు నిర్వహించడంతో పాటు వ్యాధి నిరోధక టీకాలు వేయాలని తెలిపారు. రక్త, విటమిన్ పరీక్షలను బట్టి వైద్యసేవలు అందించాలని తెలిపారు. జనవరి నెల చివరిలోపు ప్రక్రియ పూర్తి చేయాలని సూచించారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ కన్నబాబు, మెప్మా పీడీ రామాంజనేయులు, మున్సిపల్ కమిషనర్ సత్యనారాయణమూర్తి తదితరులు పాల్గొన్నారు.