నక్కపల్లి/పాయకరావుపేట: ఆ ఇద్దరు అన్నదమ్ములు చిరంజీవి, పవన్‌కళ్యాణ్ వల్లే రెండుసార్లు ఓడిపోయామని మాజీమంత్రి, టీడీపీ సీనియర్ నేత బండారు సత్యనారాయణమూర్తి అక్కసు వెళ్లగక్కారు. భవిష్యత్‌కు గ్యారంటీ చైతన్యరథం పేరుతో టీడీపీ నాయకులు చేపట్టిన ఉత్తరాంధ్ర బస్సుయాత్ర గురువారం టీడీపీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్యే వంగలపూడి అనిత ఆధ్వర్యంలో అనకాపల్లి జిల్లా పాయకరావుపేట నుంచి ప్రారంభమైంది.
ఈ సందర్భంగా పాయకరావుపేటలో నిర్వహించిన బహిరంగ సమావేశంలో బండారు సత్యనారాయణమూర్తి మాట్లాడుతూ 2009లో చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీ వల్ల, 2019లో పవన్‌కళ్యాణ్ పెట్టిన జనసేన పార్టీ వల్ల రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ ఓటమి పాలయిందని చెప్పారు. వీరు గెలవరు, ఎదుటివాళ్లని గెలవనివ్వరు.. అన్న చందాన పరిస్థితులు తయారు చేశారన్నారు. ఈ రెండు పార్టీల వల్ల తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షానికే పరిమితం కావాల్సి వచ్చిందని ఆయన పేర్కొన్నారు.
ఒక్కొక్కడి సంగతి తేలుస్తాం..
మాజీమంత్రి అయ్యన్నపాత్రుడు మాట్లాడుతూ తాము అధికారంలోకి వచ్చిన వెంటనే పోలీసుల పని పడతామని చెప్పారు. ‘అధికార పార్టీకి కొమ్ముకాసిన పోలీసులెవ్వరినీ వదిలే ప్రసక్తి లేదు. ఒక్కొక్కడి సంగతి తేలుస్తాం. ఎవరెవరు అధికారపార్టీకి అనుకూలంగా పనిచేశారో అందరి జాబితాలు మా వద్ద ఉన్నాయి. అధికారం చేపట్టిన మరుసటి రోజు నుంచే శుక్ర, శని, ఆదివారాల్లో అక్రమ కట్టడాల కూల్చివేత కార్యక్రమం ప్రారంభిస్తాం.
జగన్ పార్టీపై కక్షతీర్చుకోవడమే లక్ష్యం. వైఎస్సార్‌సీపీ నాయకులంతా శాడిస్ట్ నా కొడుకులు..’ అని పేర్కొన్నారు. విశాఖలో ఎంపీ కుటుంబం కిడ్నాప్‌నకు గురైతే ఏం చేయలేని వ్యక్తి సీఎంగా ఉండడం దారుణమన్నారు. టీడీపీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు కిమిడి కళావెంకటరావు మాట్లాడుతూ సీఎం జగన్‌మోహన్‌రెడ్డి రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశారని, అప్పుల అప్పారావు మాదిరిగా తయారయ్యారని విమర్శించారు.
టీడీపీ హయాంలో ఉద్దండపురం వద్ద వాటర్ గ్రిడ్ నిర్మిస్తే పూర్తిచేయలేని దుస్థితిలో ప్రభుత్వం ఉందని చెప్పారు. ఉద్దండపురం వాటర్ గ్రిడ్ వద్ద వీరంతా సెల్ఫీ దిగారు. ఈ సమావేశంలో మాజీ స్పీకర్ ప్రతిభాభారతి, మాజీ ఎమ్మెల్సీ బుద్ద నాగ జగదీ‹Ù, మాజీ ఎమ్యెల్యేలు పప్పల చలపతిరావు, పల్లా శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment