నిమ్మరసం ఇచ్చి దీక్షలను విరమింపజేస్తున్న చెరుకులపాడు ప్రదీప్‌రెడ్డి
పత్తికొండ టౌన్ : ప్యాకేజీల కోసం కేంద్రం వద్ద ప్రత్యేక హోదాను తాకట్టు పెట్టి సీఎం చంద్రబాబు రాష్ట్ర ప్రజలకు తీరని ద్రోహం చేశారని సీపీఐ రాష్ట్ర నాయకుడు పి.రామచంద్రయ్య విమర్శించారు. ఏపీకి ప్రత్యేక హోదా కోసం పదవులకు రాజీనామా చేసి, ఢిల్లీలో ఆమరణ నిరాహారదీక్ష చేస్తున్న వైఎస్సార్‌సీపీ ఎంపీలకు మద్దతుగా ఆ పార్టీ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు పట్టణంలో 4 రోజులుగా రిలే నిరాహార దీక్షలు కొనసాగుతున్నాయి. మంగళవారం ఎం.అగ్రహారం గ్రామ సర్పంచ్ గంపల వెంకటేశులు, మాజీ ఎంపీపీ మల్లికార్జున యాదవ్, ఎంపీటీసీ సభ్యులు విష్ణువర్దన్, శ్రీనివాసులు, నాయకులు జయభరత్‌రెడ్డి, కృష్ణ, చౌడప్ప, శ్రీధర్‌రెడ్డి, రామకృష్ణ, నెట్టికంటయ్య, శేఖర్, మల్లికార్జున, అంజి, శ్రీనివాసులు, లక్ష్మన్న దీక్షల్లో కూర్చున్నారు. సీపీఐ రాష్ట్ర నాయకుడు పి.రామచంద్రయ్య, నాయకులు నబీరసూల్, పెద్ద వీరన్న, కారుమంచి, సీపీఎం మండల కార్యదర్శి దస్తగిరి, నాయకులు రంగారెడ్డి, వెంకటేశ్వరరెడ్డి, న్యాయవాదులు సోమప్ప, నారాయణస్వామి, లోక్‌సత్తా నాయకుడు రాంమోహన్ దీక్షా శిబిరం వద్దకు వచ్చి సంఘీభావం తెలిపారు. హిమాచల్‌ప్రదేశ్‌లో బస్సు లోయలో పడి మృతిచెందిన విద్యార్థుల ఆత్మశాంతికి రెండు నిమిషాలు మౌనం పాటించారు.
ఈ సందర్భంగా రామచంద్రయ్య మాట్లాడుతూ నాలుగేళ్లుగా ఏ ఒక్క రోజూ సీఎం చంద్రబాబు ప్రత్యేక హోదా అడగలేదన్నారు. ప్రత్యేక హోదా వల్ల ఉపయోగం ఏమీ ఉండదని ప్రజలను మభ్యపెట్టాలని యత్నించారన్నారు. ఇప్పుడు అన్ని వర్గాలు హోదా కోరుకుంటుండటం గమనించిన చంద్రబాబు కొత్త డ్రామా మొదలుపెట్టారన్నారు. అయినా ప్రజలు నమ్మే స్థితిలో లేరన్నారు. ప్రత్యేక హోదా సాధన కోసం పోరాటాన్ని ఉధృతం చేయాల్సిన అవసరముందున్నారు. వైఎస్సార్‌సీపీ నాయకుడు చెరుకులపాడు ప్రదీప్‌రెడ్డి మాట్లాడుతూ వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పిలుపు మేరకు నాయకులు, కార్యకర్తలు ప్రత్యేక హోదా కోసం పోరాటాన్ని కొనసాగిస్తామన్నారు.
సాయంత్రం ప్రదీప్‌రెడ్డి, మాజీ సర్పంచ్ జి.సోమశేఖర్, బార్‌అసోసియేషన్ అధ్యక్షుడు డి.బాలబాషా నిమ్మరసం ఇచ్చి దీక్షలను విరమింపజేవారు. కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ జిల్లా కార్యదర్శి సి.శ్రీరంగడు, పత్తికొండ, మద్దికెర, తుగ్గలి మండల కన్వీనర్లు బజారప్ప, మురళీధర్‌రెడ్డి, జిట్టా నాగేశ్, పత్తికొండ మాజీ సర్పంచ్ జి.సోమశేఖర్, సింగిల్‌విండో మాజీ అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి, నాయకులు బసినేపల్లి భద్రయ్య, ప్రతాప్, పెండేకల్ మధు, మల్లికార్జున, ఆస్పరి రవిచంద్ర, కారం నాగరాజు, దేవన్న, మేదరి రమేశ్, కారుమంచి, హోసూరు శీను, లాలు, నజీర్, బొంబాయి శ్రీనివాసులు, కవిదాసు, వడ్డే లక్ష్మన్న, బురుజుల సుబ్బయ్య, మనోహర్, రామలింగారెడ్డి, ప్రతాప్‌రెడ్డి, మధుసూదన్‌నాయుడు, పోతుగల్లు వెంకటేశ్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment