గరిష్ట స్థాయికి చేరుకున్న శ్రీశైల జలాశయం!
గరిష్ట స్థాయికి చేరుకున్న శ్రీశైల జలాశయం!
Published Sun, Aug 31 2014 8:15 PM | Last Updated on Thu, Sep 27 2018 5:46 PM
శ్రీశైలం: గత కొద్దిరోజులుగా కురుస్తున్న భారీ వర్షాల ప్రభావంతో శ్రీశైల జలాశయం గరిష్టస్థాయికి చేరుకుందని అధికారులు తెలిపారు. ప్రస్తుత నీటి మట్టం 884.30 అడుగులకు చేరుకుందని తెలిపారు. శ్రీశైలం పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులని అధికారులు తెలిపారు.
శ్రీశైల జలాశయం ఇన్ ఫ్లో 2 లక్షల 388 క్యూసెక్కులు, ఔట్ ఫ్లో 68 వేల 297 క్యూసెక్కులని అధికారులు వెల్లడించారు. నీటి మట్టం పెరిగితే ఏ క్షణానైనా క్రస్ట్ గేట్లు తెరిచే అవకాశం ఉందని తెలుస్తోంది.
Advertisement
Advertisement