
వేయికాళ్ల మండపంపై శ్రీస్వరూపానంద వివరణ
తిరుమల: విశాఖ శారదాపీఠం పీఠాధిపతి శ్రీస్వరూపానంద స్వామి ఈ రోజు ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శ్రీవారి ఆలయం ముందు వేయికాళ్ల మండపం నిర్మాణం జరగదని చెప్పారు. వేయికాళ్ల మండపం నిర్మాణంపై వేసిన స్పెషల్ కమిటీ కూడా భద్రతాకారణాల దృష్ట్యా అక్కడ నిర్మాణం జరగదని తేల్చినట్లు తెలిపారు.
తిరుపతి సమీపంలో ఏర్పాటు చేస్తున్న ఇస్లామిక్ యూనివర్శిటీని రద్దు చేసి ఆ భవనాన్ని టీటీడీకి ఇవ్వాలని శ్రీస్వరూపానంద స్వామి డిమాండ్ చేశారు.