తపాలా ఏటీంలు వచ్చేశాయ్..!
తొలుత జిల్లా కేంద్రంలో ప్రారంభం
శ్రీకాకుళం అర్బన్: ఇప్పటివరకు ఉత్తరాల బట్వాడా, చిన్నమొత్తాల పొదుపు, బీమా సేవల కే పరిమితమైన తపాలాశాఖ వాణిజ్య బ్యాంకులతో పోటీకి సై అంటోంది. పోస్టల్ ఖాతాదారులకు ఏటీఎం సేవలు అందుబాటులోకి తెచ్చిం ది. రాష్ట్రంలో సుమారు 100 ఏటీఎంలు ఏర్పాటుకు చర్యలు తీసుకుంది. ఇందులో భాగంగా తొలుత శ్రీకాకుళం, నరసన్నపేట, టెక్కలి హెడ్‌పోస్టాఫీస్‌ల వద్ద ఏటీఎంలను ఏర్పాటుచేసింది. శ్రీకాకుళం హెడ్‌పోస్టాఫీసు ఏటీఎంను మంగళవారం ఉదయం 9.30గంటలకు కలెక్టర్ డాక్టర్ పి.లక్ష్మీనృసింహం ప్రారంభించనున్నారు.
టెక్కలిలో మధ్యాహ్నం 3 గంటలకు అక్కడి అధికారులు ప్రారంభిస్తారు. నరసన్నపేటలో ఈ నెల 13 నుంచి సేవలు అందుబాటులోకి వస్తాయి. వీటికి లభించే ఆదరణను బట్టి ఏటీఎంలను విస్తరింపజేస్తామని పోస్టల్ అధికారులు చెబుతున్నారు.