మీసేవ ఆన్‌లైన్ పోర్టల్, మీసేవ కెపాసిటీ బిల్డింగ్ పోర్టల్‌ను రాష్ట్ర ఐటీ శాఖా మంత్రి పొన్నాల లక్ష్మయ్య, రెవెన్యూ శాఖ మంత్రి రఘువీరా రెడ్డితో కలిసి శుక్రవారం ఇక్కడ ప్రారంభించారు.
సాక్షి, హైదరాబాద్: మీసేవ ఆన్‌లైన్ పోర్టల్, మీసేవ కెపాసిటీ బిల్డింగ్ పోర్టల్‌ను రాష్ట్ర ఐటీ శాఖా వుంత్రి పొన్నాల లక్ష్మయ్యు, రెవెన్యూ శాఖ మంత్రి రఘువీరా రెడ్డితో కలిసి శుక్రవారం ఇక్కడ ప్రారంభించారు. ఈ సందర్భంగా మీసేవను రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించేందుకు కృషి చేసిన అధికారులను సత్కరించడంతోపాటు, తహసీల్దార్లకు లాప్‌టాప్‌లు అందజేసే కార్యక్రమాన్ని కూడా ప్రారంభించారు.
25 వేల గ్రామాలకు ఫైబర్ బ్రాడ్‌బాండ్‌ను అందుబాటులోకి తెస్తున్నామని, 4 జీ సర్వీసెస్ అందుబాటులోకి వస్తే మన రాష్ట్రంలోని 12 పట్టణాలకు సేవలు అందుబాటులోకి వస్తాయని మంత్రి పొన్నాల చెప్పారు. త్వరలో మారుమూల ప్రాంతాల్లో మీసేవ ద్వారా బ్యాంకింగ్ సేవలను అందిస్తామన్నారు. ఆధార్‌ను కూడా మీసేవకు అనుసంధానం చేయనున్నట్లు పేర్కొన్నారు. కాగా, మంత్రి రఘువీరా రెడ్డి మాట్లాడుతూ ‘మీ సేవ’ ద్వారా పౌరులకు అందుతున్న సేవలను కొనియాడారు. రెవెన్యూ విభాగాన్ని మీసేవకు అనుసంధానించినట్లు చెప్పారు.