రాష్ట్రం వల్లే ‘షెడ్యూల్డ్’ గుర్తింపులో జాప్యం
Published Sun, Jan 26 2014 2:54 AM | Last Updated on Fri, Nov 9 2018 5:52 PM
సీతంపేట/భామిని, న్యూస్‌లైన్: సీతంపేట ఏజెన్సీలో నాన్‌షెడ్యూల్డ్ ఏరియాలో ఉన్న 8 గిరిజన పంచామతీలను షెడ్యూల్డ్ ఏరియా లో కలపడానికి సంబంధించిన ప్రతిపాదన రాష్ట్ర ప్రభుత్వం వద్ద పెండింగ్‌లో ఉండడం వల్లే షెడ్యూ ల్డ్ గ్రామాల గుర్తింపులో జాప్యం జరుగుతోందని కేంద్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి వైరిచర్ల కిశోర్‌చంద్రదేవ్ చెప్పారు. శనివారం ఆయన సీతంపేట మండలం కంబ గూడ సమీపంలో రూ.3 కోట్లతో నిర్మించిన యూత్ ట్రైనింగ్ సెంటర్‌ను, అంతకుముందు భామినిలో అభివృద్ధి పనులు ప్రారంభించి మాట్లాడారు. షెడ్యూల్డ్ ఫైల్ రెండేళ్లుగా ఎందుకు పెండింగ్‌లో ఉందో తెలియదన్నారు.
జంపరకోట జలాశయం పూర్తిచేయడానికి అవసరమైన రూ.12 కోట్లు మంజూరు చేయించడానికి చర్యలు తీసుకుంటానని చెప్పారు. గిరిజనులు సేకరిస్తున్న అటవీ ఉత్పత్తులకు కనీస మద్దతు ధర కల్పిస్తామన్నారు. చింతపండు కిలో మద్దతు ధర రూ.20 ఉండేలా చేస్తామని హామీ ఇచ్చారు. మహిళా సంఘాలకు బ్యాంకు లింకేజీ రుణాలు అందజేశారు. ఐఏపీ నిధులతో తివ్వకొండల్లోని గిరిజన ప్రాంతాల్లో లింక్ రోడ్లు పూర్తిచేయాలన్నారు. భామినిలో జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్యే సుగ్రీవులు మాట్లాడుతూ ఈ ప్రాంత అభివృద్ధికి మూడేళ్లలో రూ.30 కోట్ల చొప్పున కేటాయించడానికి కేంద్ర మంత్రి కిశోరే కారణమన్నారు. ఐటీడీఏ పీవో కె.సునీల్‌రాజ్‌కుమార్ మాట్లాడుతూ మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో మూడేళ్లలో చేపట్టిన పనులను వివరించారు. ఈ కార్యక్రమాల్లో పాలకొండ ఆర్డీవో తేజ్‌భరత్, గిరిజన సంక్షేమ శాఖ ఈఈ నాయుడు, వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.
Advertisement
Advertisement