మత్స్య సంపద అభివృద్ధికి చర్యలు | Ðsteps will taken to fishery development | Sakshi
Sakshi News home page

మత్స్య సంపద అభివృద్ధికి చర్యలు

Published Wed, Nov 2 2016 5:54 PM | Last Updated on Mon, Feb 17 2020 5:11 PM

Ðsteps will taken to fishery development

ఏలూరు (మెట్రో)
జిల్లాలో మత్స్యసంపదను అభివృద్ధి చేయడానికి 20 ఎకరాలను రైతుల వద్ద లీజుకు తీసుకుని పండుగప్ప, పీతల పెంపకాన్ని పైలెట్‌ ప్రాజెక్టుగా చేపట్టాలని కలెక్టర్‌ కాటంనేని భాస్కర్‌ మత్స్యశాఖాధికారి డీడీ యాకుబ్‌ పాషాను ఆదేశించారు. కలెక్టరేట్‌లో బుధవారం వ్యవసాయం, పశుసంవర్దక, ఉద్యానవనం, ఎపీ డెయిరీ, మార్కెటింగ్, ఆత్మ, బిందు సేద్యం తదితర ప్రాధాన్యతా రంగాల అధికారులతో కలెక్టరు సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టరు మాట్లాడుతూ జిల్లాలో నూతన రకాల చేపల ఉత్పత్తికి పశ్చిమ ఎంతో అనుకూలమైనదని  తక్కువ పెట్టుబడితో అధిక లాభార్జించడానికి అవకాశం ఉన్నందున పండుగప్ప, పీతల పెంపకానిన ప్రయోగాత్మకంగా చేపట్టాలని ఎప్పటికప్పుడు రైతులకు సరైన అవగాహన కలిగించడం వలన ఏడాదిలో పండుగప్ప, పీతలకు చెందిన 20 ఎకరాల చేపల చెరువులను లీజుకు తీసుకుని వాటిని పెంచాలని ఈ పెంపకం వలన అధిక ఆదాయం లభిస్తే భవిష్యత్తులో పెద్ద ఎత్తున పండుగప్ప, పీతల పెంపకాన్ని ప్రొత్సహించాలన్నారు.  బియ్యపుతిప్ప గ్రామంలో హార్బర్‌ ఏర్పాటు విషయంపై ఇకపై వారం వారం సమీక్షిస్తానని తాను కలెక్టరుగా బాధ్యతలు చేపట్టిన నాల్గవ రోజునే  బియ్యప్పతిప్ప గ్రామాన్ని సందర్శించి ఆ గ్రామంలో మత్స్య హార్బర్‌ నిర్మాణానికి చర్యలు చేపట్టానని హార్బర్‌ ఏర్పాటలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుండి  అనుమతులు లభించడంలో కొంత జాప్యం జరుగుతోందన్నారు.  25 వేల హెక్టార్లలో ఈ సంవత్సరం బిందు సేద్యం లక్ష్యం కాగా ఇప్పటివరకు 4 వేల హెక్టార్లలో మాత్రమే పూర్తి చేయడం జరిగిందని 5 నెలల కాలకంలో 21 వేల హెక్టార్లలో బిందు సేద్యం ఎలా చేయగలుగుతారని కలెక్టరు ప్రశ్నించారు. రైతుల అవసరాలకు అనుగుణంగా వరి విత్తనాలను మనమే ఉత్పత్తి చేసేందుకు అనువుగా వెయ్యి విత్తన సొ సైటీలు ఏర్పాటు చేసి జిల్లాకు అవసరమయ్యే విత్తనాలను రైతులే పండించుకుని రైతులకు విక్రయించుకునేలా చర్యలు చేపట్టాలని ఆత్మ పీడీ అనంతకుమారిని కలెక్టరు ఆదేశించారు.  సమవేశంలో ఏజేసీ ఎంహెచ్‌.షరీఫ్, సీపీఓ బాలకృష్ణ, వ్యవసాయ శాఖ జేడీ వై.సాయిలక్ష్మిశ్వరి, ఎల్‌డీఎం ఎం.సుబ్రహ్మణ్యేశ్వరరావు, ఆత్మ పీడీ ఆనందకుమారి, మార్క్‌ఫెడ్‌ జిల్లా మేనేజర్‌ నాగమల్లిక, ఉద్యానవన శాఖ ఏడీలు దుర్గేష్, విజయలక్ష్మి పాల్గొన్నారు. 
 
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement