బతుకు 'సహారా' ఎడారేనా ? | Story On Subrata roy | Sakshi
Sakshi News home page

బతుకు 'సహారా' ఎడారేనా ?

Published Wed, Aug 20 2014 2:02 PM | Last Updated on Sat, Sep 2 2017 12:10 PM

బతుకు 'సహారా' ఎడారేనా ?

బతుకు 'సహారా' ఎడారేనా ?

కాలం దెబ్బకు ఎవరైనా కుదేలు కావాల్సిందే. అది ధనవంతుడు, రాజకీయనాయకుడు.... ఎవరైనా జీవితంలో ఎప్పుడో అప్పుడు ఎక్కడో అక్కడ కాలం దెబ్బ తినక తప్పదు. అందుకు అత్యుత్తమ ఉదాహరణ సహారా పరివార్ ఇండియా ఛైర్మన్ సుబ్రత రాయ్. సహారా గ్రూప్ ఛైర్మన్గా జీవితం అనే వైకుంఠపాళిలో ఆయన ఎంతో వేగంగా అత్యున్నత స్థితికి చేరుకున్నారో ... అంతే వేగంగా కిందకి జారీ పడ్డారు. ప్రస్తుతం తీహార్ జైల్లో ఊచలు లెక్కిస్తూ... బెయిల్ కోసం కన్నులు కాయాలు కాచేలా ఎదురు చూస్తున్నారు. దేశ విదేశాల్లోని ఆస్తులు న్యూయార్క్ ప్లాజా, గ్రోస్వెనర్ హౌస్.... విక్రయానికి లేదా తనఖా పెట్టుకునేందుకు ఎవరైనా  రాకపోతారా అని ఆశాగా ఎదురు చూస్తూ... కాలం వెళ్ల దీస్తున్నారు. ఇంతకీ సుబ్రత రాయ్ కథా కమామిషూ ఏమిటి?

గోరఖ్పూర్లో సహారాలో సుబ్రత చిరుఉద్యోగిగా బాధ్యతలు చేపట్టి... ఆ కంపెనీనే సొంతం చేసుకున్నారు. అనంతరం బ్యాంకింగ్, మీడియా, ఎంటర్టైనర్, అతిథ్యం.... అన్ని రంగాల్లోకి సహారా ఇండియా పరివార్గా ప్రవేశించి అంచెలంచెలుగా ఎదిగింది. దేశ విదేశీ పత్రికలు సైతం ఆయన్ని అత్యంత శక్తిమంతమైన వ్యక్తుల జాబితాలో ఒకరని కీర్తించింది. అంతేనా... దేశ విదేశీ విశ్వవిద్యాలయాలు ఆయనకు గౌరవ డాక్టరేట్లు ప్రదానం చేశాయి.

దేశంలో అత్యధిక ఉద్యోగులు గత సంస్థ భారతీయ రైల్వే. ఆ తర్వాత స్థానాన్ని సహార ఇండియా సొంతం చేసుకుంది. దాంతో సహారా ఇండియా రికార్డు సృష్టించింది. అంతాబాగానే ఉంది. కానీ తన సంస్థలో నగదు కుదువ పెట్టిన మదుపుదారులకు దాదాపు రూ. 24 వేల కోట్లు సుబ్రతరాయ్ సకాలంలో చెల్లించలేకపోయారు. దాంతో మదుపుదారులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు.

కోర్టు హాజరుకావాలని సుబ్రతను సుప్రీం ఆదేశించింది. ఆ ఆదేశాలను సుబ్రత పెడచెవిన పెట్టాడంతో కోర్టు ఆగ్రహానికి గురైయ్యారు. సుబ్రతను వెంటనే అరెస్ట్ చేయాలని పోలీసులను కోర్టు ఆదేశించింది. పోలీసులు ఆయన్ని అరెస్ట్ చేసి... కోర్టులో ప్రవేశపెట్టారు. ఆయనకు జైలు శిక్ష విధించింది. బెయిల్ విడుదల కావాలంటే రూ. 10 వేల కోట్లు బెయిల్ బాండ్ సమర్పించాలని ఆయన్ని కోర్టు ఆదేశించింది. దాంతో ఆ నగదును సమకూర్చుకునేందుకు చేసిన ప్రయత్నాలు ఏవి ఫలించలేదు.

అయితే ఆస్తుల విక్రయానికి లేదా తనఖా కోసం కొనుగోలుదారులు వస్తే మాట్లాడేందు... ఇతర ప్రాంతాలలో ఉన్నవారితో మాట్లాడేందుకు వీడియో కాన్ఫెరెన్స్ ద్వారా తీహార్ జైల్లో ఏర్పాటు చేసుకోవచ్చు అంటూ సుప్రీం కోర్టు ఆయనకు వెలుసుబాటు కల్పించింది. దాంతో తన ఆస్తుల కొనుగోలు చేసేందుకు ఎవరైనా ముందుకురాకపోతారా అంటూ వెయ్యికళ్లతో ఎదురు చూస్తున్నారు. అయితే సహారా గ్రూప్ను బ్రూనై సుల్తాన్ కొనుగోలు చేసేందుకు ప్రయత్నాలు చేయునున్నారని సమాచారం. ఆయన కొంటే సరే లేకుంటే సుబ్రత జీవితం.... సహారా ఎడారే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement