విద్యావ్యవస్థను గాడిలో పెట్టేందుకే జంబ్లింగ్ విధానం
చంద్రబాబు
విజయవాడ: విద్యావ్యవస్థను గాడిలో పెట్టేందుకే జంబ్లింగ్ విధానాన్ని ప్రవేశపెట్టామని సీఎం చంద్రబాబునాయుడు చెప్పారు. ప్రైవేట్ జూనియర్ కాలేజీల యాజమాన్యాలు సీఎంను కలవగా ఆయన పై విధంగా వ్యాఖ్యానించారు. జబ్లింగ్ విధానం వల్ల విద్యార్థులకు ప్రాక్టికల్ పరీక్షల్లో జరిగే ఇబ్బందులను తెలిపేందుకు కాలేజీల ప్రతినిధులు మంగళవారం ముఖ్యమంత్రిని కలిశారు. ఆయన మాట్లాడుతూ.. క్వాలిటీ విద్యలేదని, ఇంజినీరింగ్ కాలేజీ వాళ్ల సంగతి చూడాలని అన్నారు. దీంతో విస్తుపోయిన ప్రైవేట్ కాలేజీల ప్రతినిధులు తాము ఇంజినీరింగ్ కాలేజీలవారం కాదని, జూనియర్ కాలేజీల వ్యక్తులమని చెప్పారు. ఎవరైతేనేమి ఇంటర్‌లో కూడా క్వాలిటీ ఎడ్యుకేషన్ పెరుగుతుంది కదా అంటూ ప్రశ్నించారు. దీంతో ప్రైవేట్ జూనియర్ కాలేజీల యాజమాన్యాలకు నోట మాట రాలేదు.
తెలంగాణలో జబ్లింగ్ లేదు
తెలంగాణ రాష్ట్రంలో ఇంటర్ ప్రాక్టికల్స్ పరీక్షల్లో జబ్లింగ్ పెట్టలేదు. యాజమాన్యాలు, తల్లిదండ్రుల విజ్ఞప్తి మేరకు ఈ ఆదేశాలను తెలంగాణ ప్రభుత్వం విరమించుకుంది. దీన్ని వివరించేందుకు కాలేజీల ప్రతినిధులు ప్రయత్నించగా సీఎం వినిపించుకోలేదు. దీంతో వారు వెనుదిరిగారు.