రేవంత్‌రెడ్డిపై కఠిన చర్యలు తీసుకోవాలి | Strict measures must be taken against RevanthReddy | Sakshi
Sakshi News home page

రేవంత్‌రెడ్డిపై కఠిన చర్యలు తీసుకోవాలి

Published Tue, Jun 2 2015 4:34 AM | Last Updated on Wed, Aug 29 2018 7:31 PM

Strict measures must be taken against RevanthReddy

ఎమ్మెల్యే ఉప్పులేటి కల్పన డిమాండ్
 
 ఘంటసాల : తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికలకు ఎమ్మెల్యేల కొనుగోలుకు ప్రయత్నం చేస్తూ సాక్ష్యాలతో పట్టుబడిన తెలంగాణ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డిపై కఠిన చర్యలు తీసుకుని ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని వైఎస్సార్ సీపీ పామర్రు నియోజకవర్గ ఎమ్మెల్యే ఉప్పులేటి కల్పన డిమాండ్ చేశారు. స్థానిక డీజీఎం కాంప్లెక్స్‌లో సోమవారం ఆమె విలేకరులతో మాట్లాడుతూ రేవంత్‌రెడ్డిపై ఎన్నికల కమిషనర్ కూడా చర్యలు తీసుకోవాలన్నారు.  అనంతరం వైఎస్సార్ సీపీ రాష్ట్ర రైతు విభాగం అధ్యక్షుడు ఎంవీఎస్ నాగిరెడ్డి మాట్లాడుతూ సీఆర్‌డీఏ పరిధిలో 18 లక్షల ఎకరాలు ఎందుకు పెట్టారో సీఎం సమాధానం చెప్పాలన్నారు. సమర దీక్షను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. అవనిగడ్డ నియోజకవర్గ నేత సింహాద్రి రమేష్‌బాబు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement