MLA uppuleti Kalpana
-
ఎమ్మెల్యే ఉప్పులేటికి తప్పిన ప్రమాదం
విజయవాడ: కృష్ణాజిల్లా పామర్రు ఎమ్మెల్యే ఉప్పులేటి కల్పన తృటిలో ప్రమాదం నుంచి బయటపడ్డారు. కారులో ఆమె విజయవాడకు వెళ్తుండగా యనమలకుదురు వద్దకు రాగానే కరకట్టపై ఒక్కసారిగా స్కూటీ అడ్డు వచ్చింది. దీంతో డ్రైవర్ సడన్ బ్రేక్ వేయడంతో కారు టైర్ ఒక్కసారిగా పేలిపోయింది. టైర్ పేలినా కారు అదుపు తప్పక పోవడంతో ఆమె ఈ ఘటన నుంచి సురక్షితంగా బయటపడ్డారు. అక్కడే కొంత సమయం వేచిచూసిన తర్వాత ఎమ్మెల్యే ఉప్పులేటి కల్పన మరో కారులో విజయవాడ చేరుకున్నట్లు సమాచారం. -
చంద్రబాబుకు వైఎస్ జగన్ ఫీవర్ పట్టుకుంది
విజయవాడ: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఫీవర్ పట్టుకుందని ఆ పార్టీ ఎమ్మెల్యే ఉప్పులేటి కల్పన అన్నారు. మంగళవారం విజయవాడలో జరుగుతున్న వైఎస్ఆర్ సీపీ విస్తృత స్థాయి సమావేశంలో ఆమె ప్రసంగించారు. చంద్రబాబు నవనిర్మాణ దీక్షలో ఎక్కువగా వైఎస్ జగన్నే తలచుకున్నారని ఉప్పులేటి కల్పన అన్నారు. చంద్రబాబు అవినీతి సొమ్ముతో ఎమ్మెల్యేలను కొంటున్నారని విమర్శించారు. -
ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసిన టీడీపీ
ఎమ్మెల్యే ఉప్పులేటి కల్పన పెదపూడి (కూచిపూడి) : మహాసంకల్ప దీక్షకు ప్రతిపక్ష పార్టీ ప్రజాప్రతినిధులను పిలవకపోవడం ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడమేనని పామర్రు ఎమ్మెల్యే ఉప్పులేటి కల్పన అన్నారు. మొవ్వ మండలం పెదపూడి ఉప సర్పంచ్ చిగురుపల్లి కనకదుర్గ నివాసంలో గురువారం జరిగిన కార్యక్రమానికి హాజరైన ఆమె విలేకరులతో మాట్లాడారు. కడపలో టీడీపీ నిర్వహించిన నవ నిర్మాణ దీక్ష ప్రజలకు ఉపయోగపడకపోగా ఉద్యోగులను, అధికారులను ఇబ్బందులకు గురిచేసిందన్నారు. ఇలాంటి కార్యక్రమాల ద్వారా నిధులు వృథా చేయకుండా అభివృద్ధి పనులపై దృష్టి కేంద్రికరించాలని ఆమె సూచించారు. టీడీపీ ప్రభుత్వం ఎన్నికల హామీలను తుంగలో తొక్కిందన్నారు. డ్వాక్రా వ్యవస్థను టీడీపీ ప్రభుత్వం కుప్పకూల్చిందని ఎద్దేవా చేశారు. నీరు చెట్టు పథకం ద్వారా మట్టి, ఉచిత ఇసుక పథకం ద్వారా ఇసుక అమ్మకాల ద్వారా టీడీపీ నేతలు కోటాను కోట్లు కొల్లగొడుతున్నార ని ఆరోపించారు. ఏప్రిల్ 14న శంకుస్థాపన చేసిన ఎన్టీఆర్ గృహకల్ప పథకం ద్వారా 6 లక్షల ఇళ్లు కట్టిస్తామన్న ప్రభుత్వం 51 రోజులు గడిచినా అర్హుల లిస్ట్‌నే పంపలేదని, ఇళ్ల నమూనా, మెటీరియల్ వివరాలు కూడా విడుదల చేయలేదని విమర్శించారు. యద్దనపూడి మాజీ సర్పంచ్ పులి కిరణ్‌బాబు, వైఎస్సార్ సీపీ నాయకులు రాజులపాటి మురళి, సీహెచ్ ఏడుకొండలు, జిల్లా ట్రేడ్ యూనియన్ కార్యద ర్శి తాతా శేషుబాబు పాల్గొన్నారు. అనంతరం నరసంపాలెం గ్రామానికి చెందిన కైలా వెంకటేశ్వరరావు అల్లుడు మరణించడంతో వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. -
రేవంత్‌రెడ్డిపై కఠిన చర్యలు తీసుకోవాలి
ఎమ్మెల్యే ఉప్పులేటి కల్పన డిమాండ్ ఘంటసాల : తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికలకు ఎమ్మెల్యేల కొనుగోలుకు ప్రయత్నం చేస్తూ సాక్ష్యాలతో పట్టుబడిన తెలంగాణ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డిపై కఠిన చర్యలు తీసుకుని ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని వైఎస్సార్ సీపీ పామర్రు నియోజకవర్గ ఎమ్మెల్యే ఉప్పులేటి కల్పన డిమాండ్ చేశారు. స్థానిక డీజీఎం కాంప్లెక్స్‌లో సోమవారం ఆమె విలేకరులతో మాట్లాడుతూ రేవంత్‌రెడ్డిపై ఎన్నికల కమిషనర్ కూడా చర్యలు తీసుకోవాలన్నారు. అనంతరం వైఎస్సార్ సీపీ రాష్ట్ర రైతు విభాగం అధ్యక్షుడు ఎంవీఎస్ నాగిరెడ్డి మాట్లాడుతూ సీఆర్డీఏ పరిధిలో 18 లక్షల ఎకరాలు ఎందుకు పెట్టారో సీఎం సమాధానం చెప్పాలన్నారు. సమర దీక్షను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. అవనిగడ్డ నియోజకవర్గ నేత సింహాద్రి రమేష్‌బాబు పాల్గొన్నారు.