చంద్రబాబుకు వైఎస్ జగన్ ఫీవర్ పట్టుకుంది
విజయవాడ: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఫీవర్ పట్టుకుందని ఆ పార్టీ ఎమ్మెల్యే ఉప్పులేటి కల్పన అన్నారు. మంగళవారం విజయవాడలో జరుగుతున్న వైఎస్ఆర్ సీపీ విస్తృత స్థాయి సమావేశంలో ఆమె ప్రసంగించారు.
చంద్రబాబు నవనిర్మాణ దీక్షలో ఎక్కువగా వైఎస్ జగన్నే తలచుకున్నారని ఉప్పులేటి కల్పన అన్నారు. చంద్రబాబు అవినీతి సొమ్ముతో ఎమ్మెల్యేలను కొంటున్నారని విమర్శించారు.