ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసిన టీడీపీ | TDP made a mockery of democracy | Sakshi
Sakshi News home page

ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసిన టీడీపీ

Published Fri, Jun 10 2016 12:52 AM | Last Updated on Fri, Aug 10 2018 8:16 PM

TDP made a mockery of democracy

ఎమ్మెల్యే ఉప్పులేటి కల్పన 
 

 
పెదపూడి (కూచిపూడి) : మహాసంకల్ప దీక్షకు ప్రతిపక్ష పార్టీ ప్రజాప్రతినిధులను పిలవకపోవడం ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడమేనని పామర్రు ఎమ్మెల్యే ఉప్పులేటి కల్పన  అన్నారు. మొవ్వ మండలం పెదపూడి ఉప సర్పంచ్ చిగురుపల్లి కనకదుర్గ నివాసంలో గురువారం జరిగిన కార్యక్రమానికి హాజరైన ఆమె విలేకరులతో మాట్లాడారు. కడపలో టీడీపీ నిర్వహించిన నవ నిర్మాణ దీక్ష ప్రజలకు ఉపయోగపడకపోగా ఉద్యోగులను, అధికారులను ఇబ్బందులకు గురిచేసిందన్నారు. ఇలాంటి కార్యక్రమాల ద్వారా నిధులు వృథా చేయకుండా అభివృద్ధి పనులపై దృష్టి కేంద్రికరించాలని ఆమె సూచించారు. టీడీపీ ప్రభుత్వం ఎన్నికల హామీలను తుంగలో తొక్కిందన్నారు. డ్వాక్రా వ్యవస్థను టీడీపీ ప్రభుత్వం కుప్పకూల్చిందని ఎద్దేవా చేశారు. నీరు చెట్టు పథకం ద్వారా మట్టి, ఉచిత ఇసుక పథకం ద్వారా ఇసుక అమ్మకాల ద్వారా టీడీపీ నేతలు కోటాను కోట్లు కొల్లగొడుతున్నార ని ఆరోపించారు.


ఏప్రిల్ 14న శంకుస్థాపన చేసిన ఎన్‌టీఆర్ గృహకల్ప పథకం ద్వారా 6 లక్షల ఇళ్లు కట్టిస్తామన్న ప్రభుత్వం 51 రోజులు గడిచినా అర్హుల లిస్ట్‌నే పంపలేదని, ఇళ్ల నమూనా, మెటీరియల్ వివరాలు కూడా విడుదల చేయలేదని విమర్శించారు. యద్దనపూడి మాజీ సర్పంచ్ పులి కిరణ్‌బాబు, వైఎస్సార్ సీపీ నాయకులు రాజులపాటి మురళి, సీహెచ్ ఏడుకొండలు, జిల్లా ట్రేడ్ యూనియన్ కార్యద ర్శి తాతా శేషుబాబు పాల్గొన్నారు. అనంతరం నరసంపాలెం గ్రామానికి చెందిన కైలా వెంకటేశ్వరరావు అల్లుడు మరణించడంతో  వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు.

 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement