కలెక్టరేట్, న్యూస్‌లైన్: వీఆర్‌ఓ, వీఆర్‌ఏ పరీక్షల నిర్వహణకు జిల్లాలో పకడ్బందీగా ఏర్పాట్లు చేస్తున్నామని ఇన్‌చార్జ్ కలెక్టర్ హరిజవహర్‌లాల్ చెప్పారు. శుక్రవారం కలెక్టరేట్‌లోని సమావేశ మంది రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పరీక్షల ఏర్పాట్ల వివరాలను వెల్లడిం చారు. ప్రశ్నా పత్రాలు తెరిచింది మొదలు పరీ క్ష అనంతరం ఓఎంఆర్ షీట్లు సీల్ చేసే వరకు వీడియో చిత్రీకరిస్తామని తెలిపారు. నిమిషం ఆలస్యమైనా పరీక్ష హాల్‌లోకి అభ్యర్థులను అనుమతించబోమని స్పష్టం చేశారు. పరీక్ష సమయానికంటే గంట ముందుగానే కేంద్రాల వద్దకు చేరుకోవాలని సూచించారు.
విధుల్లో 4,815మంది..
జిల్లాలో వీఆర్‌ఓ పోస్టులకు 85,431, వీఆర్‌ఏ పోస్టులకు 4,997దరఖాస్తులు అందాయని చెప్పారు. వీఆర్‌ఓ పరీక్ష కోసం 11 పట్టణాలలో 278 పరీక్ష కేంద్రాలు, వీఆర్‌ఏ పరీక్ష కోసం జిల్లా కేంద్రంలోని 14కేంద్రాలు కేటాయించి నట్లు వివరించారు. అన్ని సెంటర్లకు సరిపడా అధికారులు, ఇన్విజిలేటర్లను నియమించామని ఇన్‌చార్జి కలెక్టర్ తెలిపారు. పరీక్షల కోఆర్డినేటర్‌గా డీఆర్‌ఓ, అదనపు కో ఆర్డినేటర్లుగా ఆర్‌డీఓలు వ్యవహరిస్తారన్నారు. అలాగే పరీక్ష కేంద్రం పర్యవేక్షకునిగా సదరు విద్యా సంస్థ ప్రిన్సిపాల్/ప్రధానోపాధ్యాయుడు, పరిశీలకులుగా జిల్లా అధికారులు, లైజన్ అధికారులుగా తహసీల్దార్లు/ఎంపీడీఓలు, సహాయ లైజన్ అధికారులుగా డిప్యూటీ తహసీల్దార్లు/సూపరింటెండెంట్లు/లెక్చరర్లు విధులు నిర్వహిస్తారని చెప్పారు. 29ఫ్లైయింగ్ స్క్వాడ్ బృందాలు ఏర్పాటు చేశామని, పరీక్షల నిర్వహణలో మొత్తం 4,815మంది ఉద్యోగులు పాల్గొంటున్నారన్నారు.
పుకార్లు నమ్మకండి
ఒక్కో వీఆర్‌ఓ పోస్టుకు 1258 మంది పోటీ పడుతున్నారు. కొంత మంది అభ్యర్థులు దళారులను ఆశ్రయిస్తున్నారనే కథనాలు వస్తున్న నేపథ్యంలో వాటిని నమ్మకూడదని అధికారులు తెలిపారు. కేవలం మెరిట్ ప్రకారమే ఉద్యోగాలు వస్తాయన్నారు. పరీక్షా కేంద్రంలో అభ్యర్థులతో బంధుత్వం ఉన్న ఇన్విజిలేటర్లను తొలగిస్తున్నామని చెప్పారు. అయినా ఇన్విజిలేటర్లుగా కొనసాగిన వారిపై కఠిన చర్యలు తప్పవని ఇన్‌చార్జ్ కలెక్టర్ హెచ్చరించారు.
అభ్యర్థులు తీసుకెళ్లాల్సినవి..
అభ్యర్థులు తమ వెంట బాల్ పెన్నులు(బ్లూ/బ్లాక్), ప్యాడ్ తప్పనిసరిగా తీసుకెళ్లాలి. దరఖాస్తు చేసిన సమయంలో అందజేసిన మీసేవ, ఏపీ ఆన్‌లైన్ సెంటర్ల ద్వారా పొందిన రశీ దులు, హాల్ టికెట్లతో సహా హాజరుకావాలి. నెట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకున్న హాల్‌టికెట్‌పై అభ్యర్థి ఫొటో లేకుంటే... అక్కడ ఫొటో అతి కించి గెజిటెడ్ అధికారితో అటెస్ట్ చేయించాలి. ఇటువంటి అభ్యర్థులు అదనంగా మూడు పాస్‌పోర్ట్ సైజు ఫొటోలు తీసుకెళ్లాలి.
తీసుకెళ్ల కూడనవి..
సెల్‌ఫోన్, కాలిక్యులేటర్, ఇతర ఎలక్ట్రానిక్ వస్తువులు, రబ్బర్, వైట్నర్, పెన్సిళ్లు, బ్లేడ్‌లను లోనికి అనుమతించరు. ఒకవేళ వీటిని వినియోగిస్తే ఓఎంఆర్ షీట్‌ని మూల్యాంకనం చేయరు.
మూడు భాషల్లో ప్రశ్నపత్రాలు...
ప్రశ్నపత్రం తెలుగు, హిందీ, ఉర్దూ భాషల్లో ఉంటుంది. పరీక్షలు జరిగే పట్టణాలలో జిరాక్స్ సెంటర్లు అన్నీ మూసివేయాలని తహసీల్దార్లకు ఆదేశాలు జారీ చేశారు. అదే విధంగా పరీక్ష కేంద్రాల పరిధిలో విద్యుత్ సరఫరా ఉంటుంది. కేంద్రాల వద్ద పోలీస్ బందోబస్తు పెట్టి 144 సెక్షన్ విధించారు. అభ్యర్థుల కోసం జిల్లా రెవెన్యూ అధికారి కార్యాలయంలో హెల్ప్‌లైన్ ఏర్పాటు చేశారు.
వేలిముద్రల సేకరణ
ఒకరి బదులు మరొకరు పరీక్ష రాస్తున్నారని వార్తలు మీడియాలో వస్తున్న విషయం తెలి సిందే. ముఖ్యంగా తమవారి కోసం ఉపాధ్యాయులు హాజరవుతున్నారని అధికార యం త్రాంగం గుర్తించింది. ఇటువంటి ఘటనలకు తావులేకుండా అధికారులు పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నారు. పరీక్ష హాల్‌లోకి వెళ్లే ముందే అభ్యర్థి వేలిముద్రలు సేకరిస్తారు. సదరు అభ్యర్థి ఉద్యోగం పొందితే విధుల్లో చేరే ముందు మరోసారి వేలిముద్రలు తీసుకుం టారు. ఈ రెండు వేలిముద్రలు సరిపోలితేనే విధుల్లో చేరేందుకు అనుమతిస్తారు. లేకుంటే ఉద్యోగం దక్కనట్టే. దీన్ని గ్రహించి దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులే పరీక్షకు హాజరు కావాలని అధికారులు పేర్కొంటున్నారు.
పకడ్బందీగా వీఆర్‌ఓ, వీఆర్‌ఏ పరీక్షలు
Published Sat, Feb 1 2014 3:47 AM | Last Updated on Sat, Sep 2 2017 3:13 AM
Advertisement