జిల్లాలో శ్రీకృష్ణా దేవరాయ యూనివర్శటీ అధికారులు అత్యుత్సాహం చూపించారు. సోమవారం నుంచి జరగాల్సిన దూరవిద్య పరీక్షలను జన్మభూమి కారణంగా వాయిదా వేశారు.
అనంతపురం: జిల్లాలో శ్రీకృష్ణా దేవరాయ యూనివర్శిటీ అధికారులు అత్యుత్సాహం చూపించారు. సోమవారం నుంచి జరగాల్సిన దూరవిద్య పరీక్షలు వాయిదా వేస్తున్నట్టు ఎస్కేయూ ప్రకటించింది. జన్మభూమి కార్యక్రమం కారణంగా పరీక్షలను తాము వాయిదా వేస్తున్నట్టు ఎస్కేయూ ఓ ప్రకటనలో పేర్కొంది.
పరీక్షలు వాయిదా వేయడాన్నినిరసిస్తూ ఎస్కేయూ విద్యార్థి సంఘాలు బంద్ చేపట్టాయి. యూనివర్సిటీ అధికారుల తీరుపై విద్యార్థి సంఘాలు మండిపడ్డాయి. అధికారులు టీడీపీ కార్యకర్తలుగా వ్యవహరిస్తున్నారంటూ ఎస్కేయూ విద్యార్థి సంఘాలు ఆరోపించాయి.