కర్నూలు(న్యూసిటీ) : కర్నూలును రాజధానిగా చేయాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేశాయి. బుధవారం కలెక్టరేట్ ఎదుట రాయలసీమ విద్యార్థి సమాఖ్య, గిరిజన విద్యార్థి సమాఖ్య, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ విద్యార్థి పరిషత్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ముందుగా కొత్త బస్టాండ్ నుంచి రాజ్‌విహార్, బుధవారపేట మీదుగా కలెక్టరేట్ వరకు అక్కడ నుంచి సీక్యాంప్ వరకు విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు.
ఈ సందర్భంగా నాయకులు చంద్రశేఖర్, శ్రీరాములు మాట్లాడుతూ 1937 శ్రీబాగ్ ఒప్పందం ప్రకారం చర్చల ఫలితంగా కర్నూలును రాజధానిగా చేయాలని తెలిపారు. తెలుగుదేశం ప్రభుత్వం గుంటూరు, విజయవాడ మధ్య రాజధానిని ఏర్పాటు చేయాలని శివరామకృష్ణన్ కమిటీకి చెప్పడం దారుణమన్నారు. రాయలసీమ నుంచి ముఖ్యమంత్రిగా ఎన్నికైన చంద్రబాబు నాయుడు కన్నభూమికి ద్రోహం చేశారని ఆరోపించారు. రాయలసీమలో కేంద్ర విద్యా సంస్థల ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఆగస్టు 15న జరగనున్న స్వాతంత్య్ర వేడుకల్లో పాల్గొననున్న చంద్రబాబు నాయుడును అడ్డుకుంటామని హెచ్చరించారు.
1937 శ్రీబాగ్ ఒప్పందం ప్రకారం చర్చలు
Published Thu, Jul 24 2014 12:24 AM | Last Updated on Sat, Sep 2 2017 10:45 AM
Advertisement