గుంటూరు: చదువు రావడం లేదని మనస్తాపంతో ఓ విద్యార్థి గుంటూరులో ఆత్మహత్య చేసుకున్నాడు. త్వరలో జరగబోయే పదో తరగతి పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించలేనేమోననే భయంతో బుధవారం పాఠశాల భవనం పై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు.
స్థానికంగా నివాసమంటున్న శాంతిరాజు(15) విజన్ స్కూల్‌లో పదో తరగతి చదువుతున్నాడు. ఈ క్రమంలో ఈ నెల 14 నుంచి పాఠశాలకు వెళ్లడం లేదు. దీంతో శాంతిరాజు తల్లిదండ్రులు అతనికి సర్ది చెప్పి బుధవారం పాఠశాలకు తీసుకువచ్చారు. చదువు రావడంలేదని చెప్పిన వాళ్లు పట్టించుకోకుండా...ఫెయిల్ అయినా పరవాలేదు అని చెప్పి అతనిని పాఠశాలలో వదిలి వెళ్లారు. వాళ్లు వెళ్లిన కొద్ది సేపటికే విద్యార్థి పాఠశాల భవనం పై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
చదువు రావడం లేదని విద్యార్థి ఆత్మహత్య
Published Wed, Dec 23 2015 3:29 PM | Last Updated on Fri, Nov 9 2018 4:36 PM
Advertisement
Advertisement