ప్రొద్దుటూరు: వైఎస్ఆర్ జిల్లా ప్రొద్దుటూరులోని నారాయణ కాలేజ్ లో ఇద్దరు విద్యార్థినుల ఆత్మహత్య ఘటనపై పలు విద్యార్థి సంఘాలు ధర్నాకు దిగాయి. మంగళవారం ఉదయం విద్యార్థి సంఘాల నాయకులు కాలేజ్ ఎదుట బైఠాయించి నిరసన తెలిపారు. యాజమాన్యం వైఖరితోనే విద్యార్థినిలు బలవన్మరణానికి పాల్పడ్డారని వారు ఆరోపించారు. అయితే కాలేజ్ ఎదుట ఎలాంటి సంఘటన చోటుచేసుకోకుండా పోలీసలు విద్యార్థి నాయకులను అరెస్టు చేశారు.
అదేవిధంగా స్థానిక సెవెన్ రోడ్స్ కూడలిలో ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో మంగళవారం మంత్రి నారాయణ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ ఆందోళన కార్యక్రమంలో భారీ సంఖ్యలో విద్యార్థులు పాల్గొన్నారు. దిష్టిబొమ్మను దహనం చేసిన అనంతరం తిరిగి వెళుతున్న విద్యార్థి సంఘం నాయకులను పోలీసులు అరెస్ట్‌చేశారు.