(ఫైల్ ఫోటో)
సాక్షి, విజయవాడ: ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ కార్యాలయాలు ఒక్కొక్కటిగా తిరిగి తెరుచుకోనున్నాయి. ఇందులో భాగంగా రిజిస్ట్రేషన్ కార్యాలయాలు తెరవాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. రేపటి (మంగళవారం) నుంచి రిజిస్ట్రేషన్ కార్యాలయాల ఉద్యోగులు విధులకు హాజరు కావాలని ఆదేశాలు ఇచ్చింది. భౌతిక దూరం పాటిస్తూ... కార్యాలయాల్లో విధుల్లో పాల్గొనాలని సూచనలు ఇచ్చింది. అలాగే రిజిస్ట్రేషన్‌కి వచ్చే వారికి సీరియల్ ప్రకారం భౌతిక దూరం పాటించేలా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. (సచివాలయంలో పెరిగిన ఉద్యోగుల హాజరు)
కాగా లాక్‌డౌన్ నేపథ్యంలో రెడ్, ఆరెంజ్, గ్రీన్ జోన్లలో లాక్‌డౌన్ ఆంక్షలను సడలిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఆదివారం రాత్రి మార్గదర్శకాలు జారీ చేసిన విషయం తెలిసిందే. దీనిప్రకారం రెడ్, ఆరెంజ్, గ్రీన్ జోన్లలోని ప్రభుత్వ కార్యాలయాలన్నీ పనిచేయాల్సి ఉంటుంది. కాగా ఇప్పటికే అమరావతిలో సచివాలయ ఉద్యోగులు ఇవాళ విధులకు హాజరయ్యారు. మూడో వంతు సిబ్బందితో సచివాలయం సహా ప్రభుత్వ కార్యాలయాలన్నీ పని చేయనున్నాయి. (లాక్‌డౌన్‌పై కేంద్రం కీలక ప్రకటన)
Comments
Please login to add a commentAdd a comment