
సాక్షి, అమరావతి: అన్నీ వదులుకుని హైదరాబాద్ నుంచి అమరావతికి వచ్చిన ఉద్యోగులకు ఇంటి అద్దె అలవెన్సు (హెచ్‌ఆర్‌ఏ) పెంచామని, కుటుంబానికి దూరంగా ఉండే వారికి ఉచిత వసతితో పాటు డిస్పెన్సరీ కూడా ఏర్పాటు చేశామని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. మంగళవారం వెలగపూడిలోని సచివాలయంలో మూడో బ్లాక్‌లో ఉద్యోగులు, జర్నలిస్టులు, పోలీసులకు 50 శాతం రాయితీతో ఏర్పాటు చేసిన క్యాంటీన్‌ను సీఎం చంద్రబాబు ప్రారంభించి ప్రసంగించారు.
ప్రజలకు ఇబ్బంది కలిగించనంత వరకు ఉద్యోగులకు అండగా ఉంటానన్నారు. ఉద్యోగినుల సహా అందరు ఉద్యోగుల ఫిట్‌నెస్ కోసం జిమ్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. రాయితీ క్యాంటీన్‌లో నాణ్యమైన ఆహారాన్ని అందించడానికి రూ.20 లక్షలైనా ఇస్తానన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రులు నక్కా ఆనందబాబు, పితాని సత్యనారాయణ, ఏపీ సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు మురళీకృష్ణ, ఉద్యోగ సంఘాల నేతలు వెంకట సుబ్బయ్య పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment